పెర్త్ టెస్ట్ లో జడేజాను కొట్టిన ఇషాంత్ శర్మ..ఏమైందో తెలిస్తే షాక్

313

ఆస్ట్రేలియా గడ్డపై తొలి టెస్టులో ఘన విజయం సాధించిన టీమిండియా.. రెండో టెస్టులో తడబడింది. పెర్త్ వేదికగా మంగళవారం ముగిసిన రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్‌పై 146 పరుగుల తేడాతో ఆతిథ్య ఆస్ట్రేలియా గెలుపొందింది. నాలుగు టెస్టుల సిరీస్‌ని 1-1తో సమం చేసింది. అయితే ఈ మ్యాచ్ ఓడిపోయామనే బాధ ఒకవైపు ఉంటె ఇప్పుడు ఇషాంత్ శర్మ రవీంద్ర జడేజాల మధ్య జరిగిన గొడవ ఇండియన్ క్రికెట్ అభిమానులను షాక్ కు గురిచేసింది. మరి ఏమైందో తెలుసుకుందామా.

ఆస్ట్రేలియాతో పెర్త్ వేదికగా ఈరోజు ముగిసిన రెండో టెస్టు మ్యాచ్‌లో భారత క్రికెటర్లు రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మ పెద్ద ఎత్తున గొడవపడిన ఘటన ఒక్కరోజు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆటలో నాలుగోరోజైన సోమవారం ఫీల్డింగ్‌ కూర్పులో భాగంగా తలెత్తిన వివాదం.. తారాస్థాయికి చేరడంతో ఒకానొక దశలో జడేజాపైకి దూసుకెళ్లిన ఇషాంత్ శర్మ చేయి చేసుకునేలా కనిపించాడు. అయితే అప్పటికి అక్కడికి చేరుకున్న మరో ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ, డ్రింక్స్ అందించేందుకు మైదానంలోకి వచ్చిన భువనేశ్వర్ కుమార్ వారిని విడదీసి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఈ వీడియో మంగళవారం వెలుగులోకి రావడంతో ఆస్ట్రేలియా గడ్డపై భారత్ పరువు తీసేశారంటూ అభిమానులు మండిపడుతున్నారు.

వాస్తవానికి పెర్త్ టెస్టు తుది జట్టులో రవీంద్ర జడేజా లేడు. కానీ నిన్న మధ్యలో సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా మైదానంలోకి వచ్చిన జడేజా బౌలింగ్ చేస్తున్న ఇషాంత్ శర్మకి లాంగాన్, లాంగాఫ్‌లో ఫీల్డర్ల కూర్పుపై సలహాలివ్వబోయాడు.. దీంతో.. చిర్రెత్తిపోయిన ఇషాంత్ శర్మ అతడిపై నోరుజారాడు. దీంతో జడేజా కూడా అదేరీతిలో స్పందించడంతో సహనం కోల్పోయిన ఇషాంత్ శర్మ అతడిపైకి దూసుకెళ్లాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మరింది. నోబాల్ ఒత్తిడి కారణంగా ఇషాంత్ శర్మ రెండో ఇన్నింగ్స్‌లో లయ తప్పడంతో అతడ్ని లక్ష్యంగా చేసుకుని ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ పరుగులు సాధిస్తున్న తరుణంలో జడేజా సలహాలివ్వడం అతనికి కోపానికి ఓ కారణంగా తెలుస్తోంది. ఏది ఏమైనా ఆస్ట్రేలియా గడ్డ మీద పొడుస్తామని వెళ్లిన మన ఇండియన్ క్రికెటర్స్ ఇలా పోట్లాడటం సమంజసం కాదు. ఈ కోపాలను పక్కన పెట్టి సిరీస్ ఎలా గెలవాలో ఆలోచిస్తే మంచిది.