తీవ్ర విషాదం: గోదావరిలో పడవ ప్రమాదం.. 10 మంది గల్లంతు

490

తూర్పుగోదావరి: ఐ.పోలవరం మండలం పశువుల్లంక మొండి వద్ద ప్రయాణికులతో ఉన్న ఇంజన్‌ పడవ శనివారం గోదావరిలో బోల్తా పడిన ఘటనలో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంలో ఒక మహిళతో సహా మొత్తం 10 మందికి పైగానే విద్యార్థులు గల్లంతయినట్లు భావిస్తున్నారు. అయితే కొన్ని ప్రత్యేక కారణాలే ఈ ప్రమాదానికి దారితీసినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదానికి దారితీసినకారణాల్లో ప్రధానమైంది పడవ ఇంజన్ స్టార్ట్ కాకముందే లంగర్ తీసేయడమేనని తెలిసింది. దీనికి మరికొన్ని ప్రతికూల పరిస్థితులు తోడవడం ఈ ఘోరానికి దారితీసింది. దీంతో పాటు ప్రమాదం జరిగిన అనంతరం సహాయక చర్యలు చేపట్టేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం కూడా మరింత నష్టదాయకంగా పరిణమించింది.

ప్రమాదం...జరిగింది ఇలా...

పశువుల్లంకమొండి వద్ద పడవ ప్రమాదంలో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గోదావరి పోటుతో ఉండటం, పాటు వర్షం కురుస్తుండటంతో సహాయచర్యలకు అంతరాయం కలుగుతోంది. అయినప్పటికీ సహాయ బృందాలు నదిలో ముమ్మరంగా గాలిస్తున్నారు. స్థానిక మత్స్యకారుల సాయం కూడా అధికార యంత్రాంగం తీసుకుంటోంది. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా, ఎస్పీ విశాల్‌ గున్నీ, ఉన్నతాధికారులు సహాయచర్యలు పర్యవేక్షిస్తున్నారు. ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఈరోజు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయచర్యలు పర్యవేక్షిస్తున్నారు. గల్లంతైన వారు బతికే అవకాశం లేకపోవచ్చని స్థానిక మత్స్యకారులు అభిప్రాయపడుతున్నారువరద నీటితో రెండురోజులుగా గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇలాంటి సమయంలో నదిలో ఈ ఇంజన్ పడవకు లంగరు వేశారు. మోటార్‌ స్టార్ట్‌ కాకుండా పడవ లంగరు తీయకూడదు. నాటుపడవ కావడంతో ప్రవాహవేగం ఎటు వస్తే అటు వెళ్లిపోతుంది. మోటార్‌ స్టార్ట్‌ చేసిన తర్వాత లంగరు నుంచి పడవకు కట్టిన పగ్గాన్ని విప్పాలి. కానీ పడవ నడిపే సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. మోటార్‌ స్టార్‌ కాకుండానే పడవ లంగరు వదిలేశారు. విడిరోజుల్లో అయితే వేరే విషయంగానీ, నాలుగు రోజుల నుంచి వరదలతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇంత ఉధృతిలో లంగరును వదిలేయడంతో పడవ కొట్టుకుపోయింది.

దీంతో కొట్టుకుపోయారు...బైక్ à°² వల్లరెండవ శనివారం అయినా స్కూలుకు రావాలనడంతో అలావచ్చిన పశువుల్లంకమొండి జడ్పీ స్కూలు విద్యార్థులు, వేర్వేరు పనులపై వచ్చిన ప్రయాణికులు సాయంత్రం నాలుగు గంటలకు తమ తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు పడవ ఎక్కగానే పడవ సిబ్బంది ముందు లంగరును వదిలారు. అదేసమయంలో మోటారు స్టార్ట్‌ చేశారు. ఇంజన్‌ ఫ్యాన్‌కు చెత్త అడ్డుతగలడంతో మోటారు స్టార్ట్‌ కాలేదు. లంగరు వదిలి ఉండటంతో ఈలోపు గోదావరి ప్రవాహ వేగానికి పడవ ముందుకెళ్లిపోయింది. సుమారు 75 మీటర్ల దూరం వెళ్లి నిర్మాణంలో ఉన్న వారధి పిల్లర్‌ను ఢీకొట్టి పడవలోని వారంతా కేకలు, హాహాకారాలు పెడుతుండగానే బోల్తా పడిపోయింది.

వారికి పడవే దిక్కు...సరిగ్గా మూడేళ్ల కిందటఇలా పడవ బోల్తా పడగానే పడవలో ఉన్న ద్విచక్రవాహనాలు, స్కూలు బ్యాగులు ప్రయాణికులపై పడిపోయాయి. దీంతో పలువురు విద్యార్థులు నీటిలో మునిగి గల్లంతైనట్లు తెలుస్తోంది. ఈ ఘోరానికి సాక్ష్యంగా రెండు కిలోమీటర్ల మేర స్కూలు బ్యాగులు నీటిలో తేలియాడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. పడవ బోల్తా పడుతుందనగా, కిందకు దూకేసి కొందరు ప్రాణాలు నిలుపుకోగా, బయటపడలేని వారు కొట్టుకుపోయారు. ఓ వైపు గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తుండటం, మరోవైపు సామర్థ్యానికి మించి బరువు కూడా పడవ బోల్తా కారణమని చెబుతున్నారు. ఇటీవల వాడపల్లి వద్ద కూడా అధిక బరువు వల్లే ప్రమాదం జరిగింది. పైగా ప్రమాదానికి గురైన పడవకు ఎలాంటి అనుమతులు లేవు. కనీసం ప్రయాణికులకు లైఫ్ జాకెట్లు లేవు.

పశువుల్లంక మొండి గ్రామంలో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఉంది. గోదావరి వృద్ధ గౌతమిపాయకు ఆనుకుని అటూఇటూ ఉన్న లంక గ్రామాల విద్యార్థులు పడవ మీద ఇక్కడికొచ్చి చదువుకుంటుంటారు. అలాగే, పాలన, రోజువారీ అవసరాల కోసం గోదావరిపాయకు ఆవల ఉన్న ముమ్మిడివరం, ఐ పోలవరం, తాళ్లరేవు, కే గంగవరం మండలాల్లోని 12 లంక గ్రామాల ప్రజలూ ఈ మార్గంలోనే రాకపోకలు సాగిస్తుంటారు. మిగతా రోజులు ఎలాగున్నా వరద ప్రవాహం వచ్చే మూడు నెలలూ విద్యార్థులకు, జనాలకు దినదినగండమే…మరోవైపు మహా పుష్కరాల సందర్భంగా రాజమహేంద్రవరం గోదావరి తీరాన తొక్కిసలాట జరిగి..29 మంది విగతజీవులయ్యారు. మూడేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు ఈ విషాదం చోటుచేసుకొంది. తిరిగి అదే రోజున ఇప్పుడు పడవ మునిగిపోయి…11 మంది పిల్లల కుటుంబాలకు కడుపుకోతను మిగిల్చింది.