ఈ యాప్ లో అంద‌మైన అమ్మాయిల‌తో డేటింగ్ చేయ‌చ్చు కాని త‌రువాత ఏం జ‌రుగుతుందో తెలిస్తే షాక్

238

ఆన్‌లైన్ డేటింగ్ యాప్స్ ఇప్పుడు ట్రెండీగా మారాయి. వీటిప‌ట్ల యువ‌త ఎక్కువ‌గా ఆసక్తి చూపుతున్నారు.దీని ద్వారా అనేక మోస‌లు జరుగుతున్నాయి. యువ‌త త‌మ వివ‌రాలు, ఫోటోలు అప్‌లోడ్ చేయ‌డం వ‌ల్ల అనేక అన‌ర్థాలు జ‌రుగుతున్నాయి. డేటింగ్ యాప్స్ లో వ్య‌క్తిగ‌త స‌మాచారం పెట్ట‌డంతో పాటు గుర్తు తెలియ‌ని వ్య‌క్తుల‌తో ప‌రిచ‌యాలు పెంచుకోవ‌డం వ‌ల్ల ఎన్నో స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. ఆన్‌లైన్ డేటింగ్ యాప్స్ లో గుర్తు తెలియ‌ని వ్య‌క్తుల‌తో ప‌రిచ‌యాలు పెంచుకోవ‌డం వారితో స‌న్నిహితంగా మెల‌గ‌డం వ‌ల్ల చాలా మంది మోస‌పోతున్నారు. కొంత మంది అబ్బాయిలు కూడా అమ్మాయి పేరుతో ప్రొఫైల్ క్రియేట్ చేసి మోసాల‌కు పాల్ప‌డుతున్నారు. అంద‌మైన అమ్మాయిల ఫోలోలు అప్‌లోడ్ చేసి.. ఇంకో అబ్బాయితో చాటింగ్ చేసి అత‌ని ద‌గ్గ‌ర నుంచి డ‌బ్బు గుంజుతున్నారు.

Image result for dating apps

ఇక ఆన్ డేటింగ్ యాప్స్ మాయలో ప‌డి కొంత మంది త‌మ జీవితాలు నాశ‌నం చేసుకుంటున్నార‌ని పోలీసులంటున్నారు. గుర్తు తెలియ‌ని వ్య‌క్తుల‌తో ప‌రిచ‌యాలు పెంచుకుని ఇబ్బందులు ప‌డుతున్నార‌ని.. అయితే ఇలాంటి యాప్స్‌కు యువ‌త దూరంగా ఉండాల‌ని పోలీసులు సూచిస్తున్నారు. అస‌లీ ఆన్‌లైన్ డేటింగ్ యాప్స్ ఎలా ప‌నిచేస్తాయ‌నే విష‌యాల‌ను పూర్తిగా వివ‌రించారు. అయితే వ్య‌క్తిగ‌త ఇన్ఫ‌ర్మెష‌న్ ఎవ‌రితో ప‌డితే వారితో షేర్ చేసుకుంటున్నారు. దీంతో ఎన్నో స‌మ‌స్య‌ల‌కు గుర‌వుతున్నారు. ఈ డేటింగ్ యాప్స్‌లో చాటింగ్ చేసేవారికి మాన‌సిక స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయ‌ని వైద్యులు చెబుతున్నారు. కొంత మంది ఫోటోలు చూసి వారితో స్నేహం చేస్తున్నార‌ని, ఆ వ్య‌క్తి మోస‌గాడ‌ని తెలిస్తే మాన‌సికంగా కుంగిపోతున్నార‌ని వైద్యులు చెబుతున్నారు. ఇక దీనిపై మ‌రో వార్త కూడా వ‌స్తోంది.

ఈ క్రింది వీడియో చూడండి

యువత పాశ్చాత్య సంస్కృతికి బాగా ఆకర్షితులౌతున్నారని. టీనేజ్ కి రాగానే.. డేటింగ్ లు మొదలెడుతున్నారు. అయితే.. ఈ డేటింగ్ లపై 16 నుంచి 21ఏళ్ల వయసుగల యువతీ యువకులపై తాజాగా ఓ సంస్థ జరిపిన సర్వేలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.డేటింగ్ పేరిట.. చాలా మంది యువకులు.. యువతులను శారీరకంగా, లైంగికంగా వేధిస్తున్నట్లు ఈ సర్వేలో తేలింది. 53శాతం మంది తాము లైంగిక, శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురయ్యామని ఈ సర్వేలో తెలియజేయడం విశేషం. కాగా.. కొద్ది మాత్రమే.. వేధింపులు మొదలవ్వగానే.. ఆ రిలేషన్ కి పులిస్టాఫ్ పెడుతున్నారట.

Image result for dating apps

ఇంకొందరైతే.. తమ డేటింగ్ పార్టనర్.. తమను చీటింగ్ చేస్తున్నారని తెలిసినప్పటికీ.. గుడ్డిగా వాళ్లనే పట్టుకొని వేలాడుతున్నట్లు తేలింది. కేవలం 11శాతం మంది మాత్రమే డేటింగ్ లో నమ్మకంగా, నిజాయితీ ఉంటున్నారట. ఇక కొందరైతే.. శాడిస్టుల్లాగా ప్రవర్తిస్తూ.. తమ డేటింగ్ పార్ట్ నర్ శరీరంపై వస్తువులతో గాయాలు కూడా చేస్తున్నారట. మరో 40శాతం మంది.. సన్నిహితంగా ఉన్నంత వరకు బాగానే ఉండి.. రిలేషన్ బెడిసి కొట్టిందీ అనగానే.. బెదిరింపులకు పాల్పడుతున్నారట. తమకు తెలియకుండా నగ్న ఫోటోలు, వీడియోలు తీసి.. ఆ తర్వాత వాటిని చూపించి క్యాష్ చేసుకుంటున్న వారు కూడా ఉన్నారని తెలిసింది. కొందరు బెదిరించి, భయపెట్టి మరీ అత్యాచారాలకు పాల్పడుతున్నారట. ఈ సమస్యలన్నింటినీ తాము ఎదుర్కొన్నామని 16నుంచి 21ఏళ్లలోపు యువతులు చెప్పడం గమనార్హం. మ‌రి మీ పిల్ల‌ల మొబైల్స్ల ఓ ఇలాంటి యాప్స్ ఉంటే వెంట‌నే తీసేయండి వారికి మీరే కౌన్సిలింగ్ ఇవ్వండి ,మ‌రి ఈ వీడియోపై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.