సాఫ్ట్ వేర్ జాబ్ ఇంటర్వ్యూలో అమ్మాయికి వింత ప్రశ్న…నైట్ ప్లాట్ కు వస్తావా..అమ్మాయి చేసిన పని తెలిస్తే సెల్యూట్ చేస్తారు..

272

నేడు నడుస్తుంది పోటీ ప్రపంచం..అన్ని రంగాలలో తీవ్రమైన పోటీ నెలకొని ఉంది.అది సంస్థల మధ్యనే కాదు వ్యక్తుల మధ్య కూడా ఉంది.ఈ సమయంలో విద్యా రంగంలో ఉన్న పోటీ గురించి సెపరేట్ గా చెప్పుకోవాల్సిన పని లేదు.అన్ని అర్హతలు ఉన్నా కూడా ఉద్యోగం రావడం చాలా కష్టతరమవుతుంది. ఎంత టాలెంట్ ఉన్నా కూడా ఇంగ్లిష్ ధారాళంగా వచ్చి తీరాల్సిందే. లేదంటే ఇతరులతో పోటీ పడలేము. వెనకబడిపోతారు.నగరాలూ ఒక మోస్తరు పట్టణాలలో ప్రయివేట్ కార్పొరేట్ స్కూల్స్ కాలేజీలలో చదువుకునే విద్యార్థులకు కొంచమైనా ఇంగ్లిష్ వస్తుంది. కానీ గ్రామాలలో ప్రభుత్వ స్కూల్ లలో చదువుకే వారికి ఇంగ్లిష్ రావడం లేదు. ఇలా ప్రభుత్వ స్కూల్ లో కష్టపడి సాఫ్ట్ వేర్ జాబ్ కు వచ్చిన అమ్మాయికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురైంది. మరి ఆ అమ్మాయి ఎదుర్కొన్న అనుభవం ఏమిటో చూద్దామా.

Image result for interviews

ఆ అమ్మాయి పేరు దియాశా.. ఉత్తరప్రదేశ్ లోని ఒక మారుమూల గ్రామం. ఎలాగోలా కష్టపడి బీటెక్ కంప్లీట్ చేసింది. ఈ మధ్యనే ఆమె ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో ఇంటర్వ్యూకు వెళ్ళింది.దియా అన్నిట్లో షార్ప్. సబ్జెక్టు పరంగా ఆమెకు తిరుగులేదు.అన్ని రౌండ్స్ దాటింది. ఇక లాస్ట్ రౌండ్ వచ్చింది.చుడండి దియా మీరు అన్నిట్లో ఓకే కానీ మీరు ఇంగ్లిష్ లో మాట్లాడలేకపోతున్నారు. అయినా పర్లేదు నేను మీకు ఉద్యోగం ఇస్తాను. కానీ ఒక కండిషన్. మీరు రోజు రాత్రికి నా ప్లాట్ కు రావాలి. నేను మీకు అక్కడ స్పెషల్ గా ఇంగ్లిష్ నేర్పిస్తా. ఇది మీకు ఇష్టం అయితే మీరు జాబ్ లో జాయిన్ అవ్వవచ్చు. నీలా పల్లెటూరి నుంచి వచ్చి ఇంగ్లిష్ సరిగ్గా రాని అమ్మాయిలకు జాబ్ ఎలా వస్తుంది చెప్పు అని నిస్సిగ్గుగా మాట్లాడేశాడు హెచ్ ఆర్. అంతే ఆ మాటలకు దియా ఏడ్చేసింది.

ఈ క్రింది వీడియో చూడండి 

ఆమెకు కోపం తన్నుకొచ్చింది. వెంటనే హెచ్ ఆర్ చెంప చెల్లుమనిపించి బయటకు వచ్చేసింది. అయితే దియా అక్కడితో ఆగిపోలేదు. తనలా పల్లెటూరి నుంచి వచ్చే అమ్మాయిలు ఇంగ్లిష్ లో ఇబ్బంది పడకూడదని ముందుగా తానూ ఇంగ్లిష్ నేర్చుకోవడం స్టార్ట్ చేసింది.మూడునెలల్లో అనుకున్నది సాధించింది.ఒక పెద్ద కంపెనీలో జాబ్ తెచ్చుకుంది.ఆ తర్వాత సిటీలో ఒక ఇన్స్టిట్యూట్ పెట్టింది. సాయంత్రం ఆఫీస్ అయిపోయా అందులో ఒక్క రూపాయి కూడా ఫీజ్ తీసుకోకుండా ఇంగ్లీష్ నేర్పడం స్టార్ట్ చేసింది.విద్యార్థులకు ఇంగ్లిష్ నేర్పించండం కోసం ఫారెన్ వెళ్లే అవకాశాలను కూడా వదులుకుంది.మొదట ఒకరిద్దరు మాత్రమే వచ్చేవారు కానీ రానురాను పదుల సంఖ్యలో వచ్చారు.అలా దియా ఇప్పటివరకు 2000 మందికి ఇంగ్లిష్ నేర్పించింది. గ్రామాల నుంచి వచ్చిన అమ్మాయిలకు అయితే పెద్ద దిక్కులా అయ్యింది.అందరికి జాబ్ వచ్చేలా చేసింది.తనకు ఎదురైనా అనుభవం మరెవరికి ఎదురుకాకూడదని ఆమె ఆలోచన.మరి దియా గురించి దియా చేసిన పని గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.