పెళ్ళైన నెల రోజులకే..శ్రీకాకుళం జిల్లాలో దారుణం..ఏం జరిగిందో తెలిస్తే కన్నీళ్ళు ఆగవు

145

ఆత్మహత్య చేసుకోవడం మహాపాపము.అయినా కానీ ఇప్పటికి ఎందరో ఈ దారుణ చర్యకు పాల్పడుతున్నారు.ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నారంటే చాలా పెద్ద కారణమే ఉంటుంది.ఇదంతా గతం.ఇప్పుడు చిన్న చిన్న విషయాలకే సూసైడ్ చేసుకుంటున్నారు.అమ్మానాన్న తిట్టారని కొందరు పరీక్షలో ఫెయిల్ అయ్యామని కొందరు అలాగే భార్యతో గానీ భర్తతో గానీ ఏదైనా చిన్న సమస్య వచ్చిందని కొందరు..ఇలా రకరకాల కారణాల వలన ఆత్మహత్య చేసుకుంటున్నారు.ఇప్పుడు కూడా ఒక నవవధువు ఆత్మహత్య చేసుకుంది.పెళ్ళైన కొన్ని రోజులకే ఆమె విగాతజీవిగా మారింది.ఇంతకు ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుంది.ఆ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

లావేరు గ్రామానికి చెందిన లంకలపల్లి సూర్యనారాయణ, గోవిందమ్మ దంపతుల మూడో కుమార్తె రోహిణి(25)ని ఆమదాలవలస పట్టణంలోని పెంటయ్యకాలనీకు చెందిన యర్నాగుల వెంకటరావు, వెంకటరత్నం దంపతుల కుమారుడు మోహన్‌కుమార్‌తో ఈ ఏడాది ఆగస్టు 25న వివాహం చేశారు.మోహన్‌కుమార్‌ విశాఖపట్నం జిల్లా పరవాడలో ఫార్మా కంపెనీలో అసిస్టెంట్‌ మేనేజరుగా పనిచేస్తున్నాడు. ఈ నెల 3న విశాఖపట్నంలోని కూర్మన్నపాలెంలో అపార్టుమెంటును అద్దెకు తీసుకొని నూతన దంపతులు ఉంటున్నారు. ఈ నెల 27న సాయంత్రం మోహన్‌కుమార్‌ డ్యూటీ నుంచి అపార్టుమెంటుకు తిరిగి రాగా భార్య రోహిణి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించాడు. వెంటనే ఈ విషయాన్ని లావేరులోని అత్తమామాలుకు ఫోన్‌లో తెలియజేయడంతో వారు గురువారం రాత్రి అపార్టుమెంటుకు చేరుకుని బోరున విలపించారు. రోహిణి సోదరుడు, కుటుంబ సభ్యులు అర్ధరాత్రి సమయంలోనే అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

భర్త మోహన్‌కుమార్‌ వేధింపులు తట్టుకోలేకే రోహిణి ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు సూర్యనారాయణ, గోవిందమ్మ, సోదరుడు కృష్ణలు తెలిపారు. కట్నకానుకలు బాగానే ఇచ్చి పెళ్లి చేశామని, పెళ్లి సరదాలు తీరకముందే వేధింపులకు కుమార్తె బలైపోయిందని కన్నీరుమున్నీరుగా విలపించారు. తనతో చనువుగా ఉండటం లేదని కుమార్తె చెప్పినా..సర్దుకుంటారులే అని అనుకున్నామని, ఇంతలోనే ఆత్మహత్య చేసుకుందని వాపోయారు. దీనికంతటికీ కారణమైన మోహన్‌కుమార్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. మృతదేహాన్ని శుక్రవారం సాయంత్రం లావేరు తీసుకురావడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.విన్నారుగా ఈ నవవధువు ఆత్మహత్య వెనుక ఉన్న కారణాల గురించి.మరి ఈ ఘటన గురించి మీరేమంటారు.