చెన్నైలో ఓ కాలేజీ చైర్మ‌న్ రాస‌లీల‌లు అమ్మాయిల‌తో న‌గ్నంగా దొరికిపోయాడు

340

కాలేజీ అంటే విద్యాబుద్దులు నేర్పే నిల‌యంగా చూడాలి.. అందుకే విద్యార్దుల ప‌ట్ల వారు కూడా అదే అంకిత భావంతో ఉంటారు. కాని కొంద‌రు విద్యాబుద్దులు నేర్పాల్సిన టీచ‌ర్లే, క‌ళాశాలలో నీచాతినీచంగా ప్ర‌వ‌ర్తిస్తుంటారు. మ‌రి ఇలాంటి వారి వ‌ల్ల కాలేజీలో మంచి భావ‌న పోయి చెడు ఆలోచ‌న‌ల‌కు కారణం అవుతుంది. తాజాగా చెన్నైలోని ఇలాంటి ఓ దారుణం జ‌రిగింది, ఓ కాలేజీ చైర్మ‌న్ రాస‌లీలలు బ‌య‌ట‌ప‌డ్డాయి మ‌రి ఆ విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం.తమిళనాడులోని కోయంబత్తూరులోని ఓ కాలేజీలో కాలేజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ వేధింపులకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను ఎవరో తీశారు. వాటిని బయటకు తెచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..విద్యార్థినులతో పాటు లెక్చరర్ల పట్ల కూడా అతను అసభ్యంగా ప్రవర్తించినట్లుగా చెబుతున్నారు. ఈ మేరకు ఓ విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు వీడియోలు, ఫోటోలను పోలీసులకు అందించారు. దీంతో విషయం వెలుగు చూసింది. ఈ కీచ‌క కాలేజీ చైర్మ‌న్ కామ గుట్టు ర‌ట్టు అయింది.

Image result for చెన్నైలో ఓ కాలేజీ చైర్మ‌న్ రాస‌లీల‌లు

ఈ ఘటన కోయంబత్తూరులో.. శరవణంపట్టిలోని ఎస్ఎన్ఎస్ కాలేజీలో జ‌రిగింది.. ఈ కాలేజీ కరస్పాండెంట్ అండ్ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం ఈ దారుణానికి పాల్పడ్డాడు. అతని వయస్సు 63 సంవ‌త్స‌రాలు. ఇతను గత రెండేళ్లుగా విద్యార్థినులతో పాటు స్టాఫ్‌పై లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు…అతని వేధింపుల విషయమై గతంలో కాలేజీలోని కిందిస్థాయి సిబ్బంది, పలువురు అమ్మాయిలు… అతని కొడుకుకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు నేపథ్యంలో అతనిపై చర్యలు తీసుకోకుండా, ఇలా ఫిర్యాదు చేసిన వారినే బెదిరించాడు ఆ కుమారుడు.మరో దారుణమైన విషయం ఏమంటే.. విదేశాలలో ఇలాంటి వేధింపులు (లైంగిక వేధింపులు) సాధారణమేనని మేనేజ్‌మెంట్ చెప్పినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు, వీటిని పెద్ద సమస్యగా చేయవద్దని హెచ్చరించారు…ఈ విష‌యం పై కాలేజీలో ఇలాంటి దారుణం జ‌రుగుతుంద‌ని ఎవరికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో ఓ బాధితురాలు తుడియలూర్ పోలీస్ స్టేషన్‌లో అతనిపై ఫిర్యాదు చేసింది.. ఆమె ఫిర్యాదు తెలిసిన మేనేజ్‌మెంట్.. ఆమెను తీవ్రంగా హెచ్చరించింది. చంపేస్తామని కూడా బెదిరించినట్లుగా తెలుస్తోంది.

Image result for చెన్నైలో ఓ కాలేజీ చైర్మ‌న్ రాస‌లీల‌లు

బాధితురాలికి తీవ్రమైన బెదిరింపులు రావడంతో ఏం చేయలేని పరిస్థితుల్లో ఆమె అతని వేధింపులకు సంబంధించిన వీడియోలను, ఫోటోలను ఆధారాలుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంతేకాదు, ఇలా చేయడమే కాకుండా, ఫిర్యాదు చేసినందుకు తనను బెదిరిస్తున్నారని తెలియ‌చేసింది…ఇప్పుడు ఫిర్యాదు చేసిన బాధితురాలు… కాలేజీలో పని చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోలు జుగుప్సాకరంగా ఉన్నాయి. అతను మహిళలను బలవంతంగా దగ్గరకు తీసుకొని, కౌగిలించుకోవడం, ముద్దులు ఇవ్వడం చేస్తున్నాడు. గత రెండేళ్లుగా అతను పలువురిని వేధింపులకు గురి చేశాడు…అతని లైంగిక వేధింపులు తాళలేక పలువురు మహిళలు ఉద్యోగం వదిలేశారు. ఇప్పుడు ఫిర్యాదు చేసిన బాధితురాలిని గత రెండేళ్లుగా వేధించే ప్రయత్నం చేస్తున్నాడని తెలుస్తోంది.

ఈ క్రింది వీడియో చూడండి 

అంతేకాదు, అతని కొడుకుతో చేసిన వాట్సాప్ సందేశాలను, ఫిర్యాదులను కూడా పోస్ట్ చేసింది. ఇందులో ఆమె అతని తండ్రి గురించి ఫిర్యాదు చేసింది. మీరొక్కరే ఈ విషయంలో నాకు సహాయం చేయగలరని భావిస్తున్నానని పేర్కొన్నారు. నాకు ఏమైనా జరిగితే, మీది, మీ తండ్రితే బాధ్యత అని, నేను బతకడం వృథా అని ఓ సందేశంలో పేర్కొన్నారు. ఈ విషయమై బాధితురాలితో అతని కొడుకు మాట్లాడుతూ… మీరు వ్యక్తిగతంగా వచ్చి నన్ను కలవమని చెప్పాడని పేర్కొన్నాడని బాధితురాలి తెలిపింది. వచ్చి కలిస్తే సమస్యపై మాట్లాడుదామని చెప్పాడని అంది. దానికి ఆమె అతని సందేశంతో షాకయింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ కాలేజీ చైర్మ‌న్ ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు, చూశారుగా ఇలాంటి వారు ఉండ‌టం వ‌ల్ల అమ్మాయిల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోయింది.