AP కి భారీ గండం.. రెండ్రోజుల పాటూ జాగ్రత్త హెచ్చరిస్తున్న వాతావరణ అధికారులు

149

దేశ వ్యాప్తంగా రానున్న రెండు మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ ఏడాది రుతుపవనాలు 17 రోజులు ముందుగానే దేశవ్యాప్తంగా విస్తరించినట్లు అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో మంగళవారం పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది. ఈ వారం చివరినాటికి దేశ వ్యాప్తంగా పలుచోట్ల భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి ఏర్పడినందున కొన్ని ప్రాంతాల్లో భారీవర్షాలు కురిసే అవకాశంఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల పలు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. రానున్న రెండు రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఈ క్రింది వీడియో చూడండి

ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది ఆర్టీజీఎస్. నైరుతి రుతుపవనాల వల్ల ఈనెల 6, 7న ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని హెచ్చరించింది. అలలు 4 మీటర్ల ఎత్తు వరకు ఎగిసిపడే అవకాశం ఉందని.. ఈదురుగాలులు గంటకు 45-55 కిలోమీటర్ల వేగంతో వీస్తాయంటోంది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా ఉండటమే మంచిదని.. ప్రజలు తీర ప్రాంతాలకు వెళ్లకుండా దూరంగా ఉండాలని హెచ్చరించారు. విశాఖ‌ప‌ట్నం, శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం జిల్లాల తీర ప్రాంత ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌లు పాటించాలని ఆర్టీజీఎస్ హెచ్చరించింది. అలాగే సముద్ర అల‌ల తీవ్ర‌త ఎక్కువ‌గా ఉండే తీర‌ప్రాంత మండ‌లాల జాబితాను విడుదల చేసింది.

Image result for heavy rains

విశాఖపట్నం జిల్లా విషయానికి వస్తే.. గాజువాక, భీమునిపట్నం, పెద గంట్యాడ, పరవాడ, అచ్యుతాపురం, రాంబిల్లి, ఎస్.రాయవరం, పాయకరావుపేట, నక్కపల్లి, విశాఖపట్నం (అర్బన్), విశాఖపట్నం (రూరల్) మండలాలు, అలాగే విజ‌య‌న‌గ‌రం జిల్లా విషయానికి వస్తే పూస‌పాటిరేగ‌, బోగాపురం మండలాలు, అలాగే శ్రీకాకుళం జిల్లా విషయానికి వస్తే ఇచ్చాపురం, ఎచ్చెర్ల‌, క‌విటి, సోంపేట‌, మందస‌, వ‌జ్ర‌పుకొత్తూరు, పొలాకి, సంత‌బొమ్మాళి, శ్రీకాకుళం, ర‌ణ‌స్థ‌లం మండలాలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. సోమవారం పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు పడడంతో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. శ్రీకాకుళం, విజయవాడ, విశాఖ, తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు, అనంతపురం, చిత్తూరు, విజయనగరం జిల్లాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. కాగా పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని, సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు తెలిపారు. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి. మరి వాతావరణశాఖా జారీ చేసిన హెచ్చరికల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.