పుల్వామా దాడి తరువాత మొదటిసారి స్పందించిన పాక్ ప్రధాని ఇమ్రాన్.. ఏమన్నాడో తెలుసా

229

ఫిబ్రవరి 14న భారత పాలిత కశ్మీర్‌ పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్ల వాహనంపై జరిగిన దాడిలో 40 మంది జవాన్లు మృతి చెందిన సంగతి మన అందరికి తెలిసిందే. ఈ దాడికి పాకిస్తానే కారణం అని భారత్ నేరుగా ఆరోపించింది. ఈ దాడికి బాధ్యులం మేమేనని పాకిస్తాన్‌లో ఉన్న జైషే మహమ్మద్ మిలిటెంట్ సంస్థ ప్రకటించింది. అయితే ఈ దాడి మీద భారత్ ఒకవైపు ఆక్రోశంతో ఉంటె పాకిస్తాన్ మాత్రం ఇప్పటివరకు ఏమి అనలేదు. అయితే దాడి తర్వాత పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ఖాన్ మొదటిసారి దీనిపై స్పందించారు.మరి ఆయనేమన్నాడో చూద్దామా.

Image result for pak pm

దాడి గురించి మాట్లాడిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ “మొదట మీరు ఏ ఆధారం లేకుండా ఆరోపణలు చేస్తున్నారు. సౌదీ ప్రిన్స్ పాక్ పర్యటన మాకు చాలా కీలకం. అలాంటి సమయంలో మేం ఇలా చేయిస్తామా? పాకిస్తాన్ స్థిరత్వం వైపు అడుగులు వేస్తున్న ఈ దశలో మేం అలా ఎందుకు చేస్తాం అన్నారు. పాకిస్తాన్‌కు దీనివల్ల ఏం ప్రయోజనం ఉంటుంది. ప్రతిసారీ మీరు అలా చేయాలనుకుంటే మీరు మాటిమాటికీ అదే చేస్తుంటారు. నేను మళ్లీ మళ్లీ చెబుతున్నా, ఇది కొత్త పాకిస్తాన్. తీవ్రవాదంతో పాకిస్తాన్ స్వయంగా బాధపడుతోందని ఇమ్రాన్ అన్నారు. ఇమ్రాన్ ఖాన్ కశ్మీర్ అంశంలో చర్చలకు భారత్‌ను స్వాగతించారు. వచ్చి విచారణ చేసుకోవచ్చని నేను మీకు ఆఫర్ చేస్తున్నా. ఎవరైనా పాకిస్తాన్ భూభాగాన్ని ఉపయోగించుకుంటుంటే వారిని మా శత్రువుగానే భావిస్తాం అన్నారు.

ఈ క్రింది వీడియో చూడండి 

తీవ్రవాద సమస్య అంతటా ఉంది. ఈ తీవ్రవాదం వల్ల మాకు వంద బిలియన్ డాలర్ల నష్టం జరిగింది. భారత్‌లో ఒక కొత్త ఆలోచన రావాలి. కశ్మీరీలలో మృత్యుభయం లేకుండా పోయిందంటే దానికి కారణం ఏమయ్యుంటుంది. సమస్యలకు పరిష్కారం చర్చలతోనే దొరుకుతుంది. భారత్‌కు దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదా? భారత మీడియాలో, రాజకీయాల్లో పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని, దాడులు చేయాలని చర్చ జరుగుతోందని విన్నాం. పాకిస్తాన్‌పై దాడి చేస్తే, పాకిస్తాన్ ఆలోచిస్తుందా, ఆలోచించదు.. పాకిస్తాన్ సమాధానం ఇస్తుంది అన్నారు. కానీ ఆ పరిస్థితులు ఎక్కడకు దారితీస్తాయి. యుద్ధం ప్రారంభించడం సులభమే, కానీ, దానిని ముగించడం ఎవరి చేతుల్లోనూ ఉండదని మనందరికీ తెలుసు. ఇదంతా ఎటు దారితీస్తుందో ఆ అల్లాకే తెలియాలి. మేం వివేకంతో వ్యవహరిస్తాం, అఫ్గానిస్తాన్‌తో వ్యవహరించినట్లే, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుంటాం అని ఇమ్రాన్ అన్నారు.చూడాలి మరి ఇమ్రాన్ చేసిన వ్యాఖ్యలతో ప్రధాని ఏమంటాడో. మరి పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ చేసిన ఈ వ్యాఖ్యల మీద అలాగే ఇప్పుడు భారత్ ఏం చేస్తే బాగుంటుంది. మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.