ఈ బ్యాంకులో లోన్ కావాలంటే అమ్మాయిల నగ్న వీడియోలు తాకట్టు పెట్టాలి.. వాటితో ఏం చేస్తారో తెలిస్తే..

335

విన‌డానికి కాస్త ఆశ్చ‌ర్యం అనిపించినా ఇది వాస్త‌వం, సాధార‌ణంగా బ్యాంకు లోన్ కావాలి అంటే ఓ పట్టాన మంజూరు కాదు.. దానికి సవాలక్ష కారణాలు చూపిస్తారు. ఇది బాగా లేదంటారు.. గవర్నమెంట్ నుంచి ఫలానా పత్రాలు కావాలంటూ వేధిస్తారు. చివరకు అన్ని తెచ్చినా తనఖాగా ఆస్తులను పెట్టుకొని ఇస్తారు. ఇలా బ్యాంకు రుణం పొందాలంటే తలప్రాణం తోకకు వస్తుంది. ఇవ‌న్నీ ఎందుకు అని క‌మీష‌న్ కూడా ఇస్తాము అనేలా కొంద‌రు కాళ్ల‌బేరానికి వ‌స్తారు. కానీ ఇక్కడ చైనా బ్యాంకు మాత్రం అలా కాదు.. కేవలం మహిళలకే లోన్లు ఇస్తుంది. దానికి ష్యూరిటీగా వారి నగ్న ఫొటోలు వీడియోలను సంస్థకు ఇవ్వాలి. ఇలా చాలా మంది విద్యార్థినులు ఇలానే ఇప్పటివరకు లోన్లు తీసుకున్నారు. మ‌రి ఆ బ్యాంకు గురించి తెలుసుకుందాం.

Image result for state bank
చైనాలోని నేకెడ్ లోన్’ అనే సంస్థ ఆన్ లైన్ ద్వారా రుణాలు మంజూరు చేస్తామని ప్రకటన ఇచ్చింది… కేవలం మహిళలకు మాత్రమే లోన్లు ఇస్తామని తెలిపింది. మహిళా కస్టమర్లు తమ ఆస్తులు ఆర్థిక వివరాలు ఏమీ అప్పగించాల్సిన అవసరం లేదు.. కేవలం వారి నగ్న శరీరాన్ని ఫొటోలు తీసి.. వీడియోలు తీసి ఇస్తే చాలు రుణాలు మంజూరు చేస్తారు. మహిళలు తమ ఐడీ కార్డులను పట్టుకొని నగ్నంగా నిల్చొని సెల్ఫీలు తీసుకోవాల్సి ఉంటుంది. తమకు ఎంత డబ్బు కావాలి.? పేరు ఊరు ఎప్పుడు చెల్లిస్తారనే విషయాలను వీడియోలో వివరించాలి. ఒకవేళ డబ్బులు చెల్లించకుంటే సంస్థ తమ నగ్న చిత్రాలను ఆన్ లైన్ లో విడుదల చేయవచ్చని ఒప్పందం ప్రకారం చెప్పాల్సి ఉంటుంది. ఈ ఫొటోలు వీడియోలను ఆన్ లైన్ లో పంపగానే వారు ఆన్ లైన్ ద్వారానే రుణాలు మంజూరు చేయడం ప్రారంభించారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

తాజాగా నేకెడ్ లోన్ సంస్థ నుంచి 10 జీబీ సైజ్ గల మహిళల నగ్న ఫొటోలు వీడియోలు లీక్ అయ్యాయి. ఈ ఫొటోలను జీదైబౌ అనే మరో ఆన్ లైన్ సంస్థ తాజాగా లీక్ చేసి ‘నేకెడ్ లోన్’ సంస్థ బండారం బయటపెట్టింది. మొత్తం 161 మంది మహిళలు నేకెడ్ లోన్ నుంచి రుణం పొందినట్లు వెల్లడించింది. వీరంతా 17 ఏళ్ల నుంచి 23 ఏళ్లలోపు కాలేజీ విద్యార్థినులే అని తేలింది. వీరంతా కాస్మోటిక్స్ ఇతర అవసరాల కోసం ఇలా తమ దేహాన్ని ఆన్ లైన్ లో పెట్టి డబ్బు తీసుకున్నట్టు తెలిసింది. లోన్ చెల్లించలేని విద్యార్థినులు యాజమాన్యానికి లైంగిక కోర్కెలు తీర్చి రుణాలు కూడా తప్పించుకున్నారని జీదైబౌ సంస్థ వెల్లడించింది. మ‌రి పుర్రెకో బుద్ది అని అంటారు , ఇలా మ‌నిషికో ఆలోచ‌న సంస్ద‌కో వ్యాప‌కం లా మారింది ఈ బిజినెస్, నిజంగా ఇలాంటి వ్యాపారాలు ఖండించాల్సిన‌వే, మ‌రి ఈ ఆన్ లైన్ సంస్ధ పై మీ అభిప్రాయం కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.