ఖరీదైన మద్యంలో ఏం కలుపుతున్నారో తెలిస్తే..మీరు మందు జోలికే వెళ్లారు

305

ఆల్కహాల్ అంటే అందరికి ఇష్టమే.మూతి మీద మీసం వచ్చిన ప్రతి ఒక్కడు ఆల్కహాల్ ను టెస్ట్ చెయ్యాలని ఉవ్విళ్లూరుతుంటారు.దాని వలన జీవితాలు నాశనం అవుతాయని తెలిసి కూడా మద్యానికి అలవాటు పడుతున్నారు.కుర్రతనంలో ఉన్నప్పుడు బీర్ అంటారు.కొంచెం వయసు వచ్చే సరికి రమ్మీ విస్కీ అంటూ ప్రపంచంలోని అన్ని బ్రాండ్స్ గురించి చెబుతారు.ఇంకా సంపాదించే వయసు వచ్చే సరికి ఖరీదైన మద్యం అంటారు..ఇప్పుడు ఇలాంటి వారి కోసమే ఒక విషయం చెప్పబోతున్నాను.విని తెలుసుకోండి.

ఖరీదైన మద్యంలో కొంత నీరు లేదా చీప్‌లిక్కర్‌ కలిపి వినియోగదారులకు అందిస్తూ నగరంలో కొందరు తమ వ్యాపారాలను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు.ఈ రకమైన అక్రమ వ్యాపారం గ్రేటర్‌ పరిధిలో కొనసాగుతోంది. కొంత కాలం క్రితం ఇలాంటి రెండు, మూడు కేసులను ఎక్సైజ్‌ పోలీసులు పట్టుకుని కేను నమోదు చేశారు. ప్రత్యేకించి కొందరు మద్యం వ్యాపారులు అధిక లాభాలను దండుకునేందుకు ఖరీదైన మద్యాన్నే టార్గెట్‌ చేస్తున్నా రు. ఖరీదైన మద్యం సీసాల మూతలను చాకచక్యంగా తొలగించి అందులోని కొంత మద్యాన్ని తీసేస్తున్నారు. దాని స్థానంలో నీళ్లు లేదా సాధారణ బ్రాండ్‌ మద్యాన్ని నింపేస్తున్నారు.ఎక్సైజ్‌శాఖ సీల్‌ ఉన్నది ఉన్నట్టుగానే ఉంటుంది. కానీ అందులో మద్యాన్ని మాత్రం కల్తీ చేస్తున్నారు. ఇలాంటి అక్రమ దందాలపై ఆరా తీసేందుకు ఎక్సైజ్‌ అధికారులు కొంత మంది ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపింది. సాధారణ వినియోగదారుల మాదిరిగానే వెళ్లి ఆయా దుకాణాల వద్ద పరిశీలన చేస్తున్నారు. హైదరాబాద్‌, రంగారెడ్డిజిల్లాల పరిధిలోనూ వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు అధికారులు వెల్లడించారు.వైన్‌షాపులు నిర్వహిస్తూ పర్మిట్‌రూమ్‌లు, బార్లలో ఇలాంటివి ఎక్కువగా జరుగుతున్నట్లు సమాచారం.

అయితే కొందరు వైన్‌షాపుల నిర్వాహకులు సైతం నిపుణులైన వ్యక్తులను ఇలాంటి పనులకు నియమించుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మద్యం సీసాల సీల్‌ తీయకుండానే అందులోని మద్యాన్ని చోరీ చేసే టెక్నిక్‌ తెలిసిన వారు శివారు ప్రాంతాల్లో చాలా మందే ఉన్నట్టు తెలుస్తోంది. వీరిలో కొందరు ఇప్పటికే పోలీసులకు దొరికారు.గతంలో వైన్‌షాపుల్లో పని చేసిన వారు కొందరు, చాలా చాకచక్యంగా మూతలు తీయగల నేర్పుకలిగిన వారిని వ్యాపారులు తమ వద్ద ఉంచుకుంటున్నారు. గతంలో పనిచేసిన షాపుల్లో అక్కడి యాజమానులు చేసిన దందాను చాకచక్యంగా నేర్చుకుని, ఇప్పుడు వేరేషాపుల్లో ఇలాంటి వారు అదనపు జీతాలకు పని చేస్తున్నట్టు సమాచారం.కొందరు మద్యం షాపు నిర్వాహకులే మద్యం బాటిళ్లలో నీరు నింపుతున్నట్టు సమాచారం. ఫుల్‌ బాటిల్‌ నుంచి కనీసం 15 శాతం మద్యం తీసి నీటితో నింపుతున్నారు.ఖరీదైన మద్యాన్ని కల్తీ చేయడం ద్వారా కోట్ల రూపాయల లాభాల దండుకుంటున్నట్టు సమాచారం.విన్నారుగా ఖరీదైన మద్యంలో మీకు తెలియకుండా ఏమి కలిపి మిమ్మల్ని మోసం చేస్తున్నారో.కాబట్టి ఆల్కహాల్ తాగే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి.నా సలహా ఏంటంటే ఆల్కహాల్ అనే దానిని మీరు వదిలేయడమే మంచిది.ఇక మీ ఇష్టం.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.