మొన్న జొమాటో నేడు స్విగ్గీ… స్విగ్గీ డెలివరీలో ఏం వచ్చిందో తెలిస్తే దిమ్మతిరుగుతుంది..

266

ప్రముఖ ఆన్‌ లైన్‌ ఫుడ్‌ డెలవరీ సంస్థ జొమాటో డెలవరీ బాయ్‌ కస్టమర్ల బాక్స్‌ ను ఓపెన్‌ చేసి తినడం సంచలనంగా మారిన విషయం తెల్సిందే. కస్టమర్ల ఫుడ్‌ బాక్స్‌ జొమాటో డెలవరీ బాయ్‌ తీసి మరీ తినడంతో దేశ వ్యాప్తంగా కూడా ఆ సంస్థపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సమయంలోనే జొమాటో నుండి సదరు డెలవరీ బాయ్‌ను తొలగించినట్లుగా సంస్థ ప్రకటించింది. భారీ స్థాయిలో డెలవరీ బాయ్‌పై చర్యలు కూడా తీసుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చింది. ఇకపై డెలవరీకి వెళ్లే ఐటెంను మరింత భద్రతగా ప్యాక్‌ చేయిస్తామంటూ హామీ ఇచ్చిఇంది. ప్యాకెట్‌ను ఒకసారి ఓపెన్‌ చేస్తే మళ్లీ వేసే వీలు లేకుండా ప్యాక్‌ చేయిస్తామంటూ జొమాటో ప్రకటించింది. అయినా కూడా ఇప్పటికే జొమాటో పరువు గంగలో కలిసి పోయింది. అయితే ఈ ఘటన మరవకముందే ఇప్పుడు మరొక ఘటన జరిగింది.మరి అదేమిటో తెలుసుకుందామా.

Related image

దేశంలో ఆన్‌లైన్ మార్కెటింగ్ జోరుగా సాగుతోంది. కిరాణా సరకుల మొదలుకుని.. తినే తిండి వరకు ప్రతి ఒక్కటీ ఆన్‌లైన్‌లోనే ఆర్డర్ చేస్తున్నారు. అలా ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకునే వస్తువుల్లో వివిధ రకాల పురుగులు, బొద్దింకలు, బ్యాండేజ్‌లు ఇలా ఎన్నో రకాలైన వస్తువులు కనిపిస్తున్నాయి. దీంతో ఆన్‌లైన్‌లో ఆరగించే పదార్థాలు ఆర్డర్ ఇవ్వాలంటేనే భయపడిపోతున్నారు.మొన్నటికిమొన్న జొమాటో డెలివరీ బాయ్ ఫుడ్ పాకెట్స్ ఓపెన్ చేసి తింటున్న వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఇపుడు స్విగ్గిలో కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. చెన్నై‌కి చెందిన ఓ యువకుడు స్విగ్గీ ద్వారా ‘చాప్ ఎన్‌స్టిక్స్’ అనే చైనీస్ రెస్టారెంట్ నుండి చికెన్ నూడిల్స్ ఆర్డర్ చేశాడు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఆ ఫుడ్‌ డెలివరీ కాగానే లొట్టలేసుకుని ఆరగించేందుకు ప్యాక్ ఓపెన్ చేసి చూశాడు. ఆ నూడిల్స్‌లో రక్తంతో తడిచిన బ్యాండేజ్ (నాప్కిన్ వంటిది) కనిపించడంతో షాక్‌కు గురయ్యాడు. వెంటనే సంబంధిత రెస్టారెంట్‌కి ఫోన్ చేసి అడగగా యాజమాన్యం నుండి ఎటువంటి స్పందన రాలేదు. స్విగ్గికి ఫిర్యాదు చేసినా ఫలితం లభించలేకుండా పోయిందని వాపోయాడు.దాంతో అతను సోషల్ మీడియాకు ఎక్కి జరిగిన దాని గురించి చెప్పాడు. అది విని అందరు షాక్ అవుతున్నారు. ఈ విషయం అందరికి తెలియడంతో స్వీగ్గీ యాజమాన్యం వచ్చి స్పందించింది.ఈ ఘటనపై స్విగ్గీ సంస్థ విచారిస్తున్నట్లు తెలిపింది. ఇలాంటి సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో అసలు ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ చేయాలంటేనే భయపడుతున్నారు. ఇంకా ముందు ముందు మరెన్ని ఇలాంటివి జరుగుతాయో అనే ఆందోళన వ్యక్తం అవుతోంది.మరి ఈ విషయం మీద మీరేమంటారు.ఫుడ్ ఆర్డర్ చేస్తే డెలివరీ బాయ్స్ ఇలా చెయ్యడం గురించి అలాగే డెలివరీలో రక్తంతో తడిచిన బ్యాండేజ్ రావడం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.