కూతురు 6 వేళ్ళతో పుట్టిందని ఈ తల్లి ఏం చేసిందో తెలిస్తే మీకు దిమ్మతిరుగుతుంది..

275

నవ మాసాలు మోసి కన్న తల్లికి బిడ్డ రంగు, రూపు గురించి పట్టింపు ఉండదు. వీటన్నింటికతీతంగా పిల్లల్ని ప్రేమించగలిగేది తల్లి మాత్రమే. ఆరోగ్యంగా ఉన్న పిల్లలకంటే వైకల్యంతో పుట్టిన పిల్లల పట్లనే తల్లికి ఎక్కువ ప్రేమ, సంరక్షణ ఉంటాయి. లోకమంతా వారిని ఎగతాళి చేసినా, అసహ్యించుకున్నా.. తల్లి మాత్రం వారిని కడుపులో పెట్టి చూసుకుంటుంది. తనను ఏమన్నా ఊరుకుంటుంది కానీ తన పిల్లలను తక్కువ చేసి మాట్లాడితే మాత్రం అస్సలు ఊరుకోదు. వారికి తగిన విధంగా సమాధానం చెప్పి నోరు మూయిస్తుంది.అయితే ఇప్పుడు ఒక తల్లి నీచపు పనికి పాల్పడింది. కూతురు 24 వేళ్ళతో పుట్టిందని దారుణానికి ఒడిగట్టింది. మరి ఏమైందో తెలుసుకుందామా.

Related image

మద్యప్రదేశ్‌లోని ఖండ్వా జిల్లాకు చెందిన ఒక మహిళ ఇటీవలే తల్లి అయ్యింది. ఆమెకు జన్మించిన పాపకు చేతులకు మరియు కాళ్లకు ఆరు వేళ్లు ఉన్నాయి. అంటే 20 వేళ్లకు బదులుగా 24 వేళ్లు ఉన్నాయి. అలా ఎక్కువ వేళ్లు ఉంటే అశుభం అంటూ అక్కడి వారి నమ్మకం. ఆ మూడ నమ్మకంతో ఆమె అత్యంత దయనీయమైన పని చేసింది. తన కూతురుకు ఉన్న ఆ అదనపు వేళ్ల వల్ల అంతా కూడా ఆమెను దురదృష్ట వంతురాలు అంటారని, దాంతో పాటు పెదయ్యాక పెళ్లి కూడా కాకపోవచ్చు అని అదనంగా ఉన్న వేళ్లను కొడవలితో కోసేసింది. వేళ్లను కోసి వేయడంతో తీవ్ర రక్త స్రావం అయ్యింది. గాయాల వద్ద ఆవు పేడ పెట్టి కూతురుకు కట్టు కట్టే ప్రయత్నం చేసింది. కాని కూతురు నొప్పి బరించలేక మరియు తీవ్ర రక్తస్రావం అయ్యి కొద్ది సేపటికి మరణించింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

సొంత కూతురును మూడ నమ్మకం పేరుతో చంపేసుకున్న ఆ మహిళపై పోలీసులు కేసు నమోదు చేసి ఎంక్వౌరీ మొదలు పెట్టారు.ఇలా పిల్లలకు చిన్న లోపం ఉందని ఏ తల్లి కూడా ఇలాంటి పిచ్చి పనులు చేయవద్దు. వారికి మంచి చేస్తున్నామని భావించి ఇలాంటి దారుణాలు చేయడం వల్ల వారి జీవితాలే లేకుండా పోయే ప్రమాదం ఉంది. అందుకే కాస్త జాగ్రత్తగా ఉండండి అమ్మలు..మరి ఈ విషయం గురించి మీరేమంటారు. కూతురి వేలును నరికేసిన ఈ తల్లి ఘటన గురించి అలాగే పిల్లలు అందవికారంగా పుట్టారని దారుణాలకు పాల్పడే తల్లిదండ్రుల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.