శ్మశానంలో అర్దరాత్రి కన్నెపిల్లలు ఏం చేస్తున్నారో తెలిస్తే మతిపోవడం ఖాయం

171

పట్టపగలు శ్మశానంలో అడుగు పెట్టాలంటేనే వెన్నులో వణుకు పుడుతుంది. అసలు స్మశానం పేరు విన్నా ఆ దరిదాపుల్లోకి వెళ్లాలి అన్నా చాలా భయపడిపోతారు ముఖ్యంగా వీటి దగ్గరకు కాని వాటి పేరు ఎత్తడానికి కాని వయసుతో సంబంధం లేకుండా భయపడిపోతారు జనం. కానీ, విశాఖపట్నంలోని భిమిలిలో అర్ధరాత్రి ఆడ పిల్లలు ఎలాంటి భయం లేకుండా శ్మశానానికి వెళ్తున్నారు. అర్ధరాత్రిళ్లు వారికి అక్కడేం పని అనుకుంటున్నారా? అయితే, మీరు ఆ అమ్మాయిలు ఎదుర్కొంటున్న తిప్పలు గురించి తప్పకుండా తెలుసుకోవల్సిందే.

నిశిరాత్రి నీటి వెతలు అని చెప్పాలి… హిందూ ఆచారం ప్రకారం అయినవారు చనిపోయినా ఆడవాళ్లు శ్మశానానికి వెళ్లరు. భీమిలి డైట్‌ కళాశాల విద్యార్థినులకు దప్పిక తీర్చుకోడానికి ఆ స్మశానంలో ఉన్న బోరు మాత్రమే దిక్కు. ఇటీవల భీమునిపట్నంలోని ఉపాధ్యాయ శిక్షణ కేంద్రంలో మంచి నీటి బోరు మరమ్మతులకు గురైంది. నీళ్ల కోసం నిత్యం తాము పడుతున్న బాధలను విద్యార్థులు ఎన్నోసార్లు కళాశాల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా.. ఫలితం లేకపోయింది.

వేరే దారి లేక..: ఎండలు మండిపోతున్న నేపథ్యంలో దప్పికతో అల్లాడుతున్న విద్యార్థులు.. సమీపంలోని శ్మశానంలో ఉన్న బోరును ఆశ్రయించడం మొదలుపెట్టారు. రోజువారీ అవసరాలకు సైతం నీళ్లు కరువ్వడంతో ఆ బోరే దిక్కవుతోంది. పగలంతా కళాశాలలో క్లాసులకు హాజరై రాత్రి వేళలో ఇలా శ్మశానికి బకెట్లు పట్టుకొని నీటి కోసం గుంపులుగా పరుగులు తీస్తున్నారు. అసలే శ్మశానం పురుగు పుట్ర పాములు ఉంటాయి. చీకట్లో వీరికి ఏమైన హాని జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు ప్రభుత్వాలు మాత్రం వీరి సమస్యని పట్టించుకోదు.

ఈ శ్మశానంలో అంత్యక్రియులు ముగిసిన తర్వాత చనిపోయినవారి బంధువులు స్నానాలు చేసేందుకు ఈ బోరును ఏర్పాటు చేశారు. అలాంటి బోరు నీళ్లే విద్యార్థినీల దాహార్తి, అవసరాలను తీర్చేందుకు దిక్కవడం దురదృష్టకరం. వారి కష్టాల గురించి కళాశాల యాజమాన్యానికి తెలిసినా.. నిధులు లేవు అంటూ సాకులు చెప్పడం గమనార్హం. ఎన్నికల నేపథ్యంలో ప్రజా ప్రతినిధులు ప్రచారాలల్లో బిజీగా ఉన్నారు. దీంతో ఎవరూ ఆ విదార్థుల సమస్యను పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. విద్యార్థుల నీటి కష్టాలను తీర్చాలి. నీళ్ల కోసం శ్మశానంలో అడుగుపెట్టి ప్రమాదాల్లో చిక్కుకునే పరిస్థితుల నుంచి వారికి విముక్తి కల్పించాలి అని కోరుతున్నారు. మరి చూశారుగా నేతలు యాజమాన్యాలు విధ్యార్దుల సమస్యలను ఎలా గాలికి వదిలేస్తున్నారో మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియచేయండి.