ప‌ట్టుచీర చిరిగింద‌ని ఆర్టీసి బస్సు లో ఈ మహిళ ఏమి చేసిందో తెలిస్తే షాక్

434

మ‌నం ప్ర‌యాణాలు చేసే స‌మ‌యంలో ట్రైన్ అలాగే బ‌స్సుల్లో రేకులు సీటుకు చివ‌ర ఉండే మేకులు వ‌ల్ల మ‌న బ‌ట్ట‌లు అప్పుడు అప్పుడూ చిరిగిపోవ‌డం జ‌రుగుతుంది ఇక ల‌గేజీ బ్యాగులు కూడా అలాగే చిరిగిపోతూ ఉంటాయి తాజాగా ఇలాగే ఓ మ‌హిళ‌ప‌ట్టుచీర చిరిగింది. మ‌రి ఆమె ఏం చేసింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం.

Related image

బస్సు ఎక్కుతున్న ప్రయాణికురాలి పట్టుచీర చిరిగినందుకు టీఎస్ ఆర్టీసీకి రూ.3వేల జరిమానా విధించింది వినియోగదారుల ఫోరం. ఈ ఘటన నల్గొండ జిల్లాలో జరిగింది… నల్గొండకు చెందిన కట్టెకోల నరసింహారావు, వాణిశ్రీ దంపతులు. వీరు 2018, ఆగస్టు 26న హైదరాబాద్‌లో వివాహానికి హజరయ్యేందుకు నల్గొండ డిపోలో సూపర్ లగ్జరీ బస్సు ఎక్కారు. బస్సు ఎక్కుతున్న సమయంలో డోర్ దగ్గర బయటకు తేలిన రేకు తగిలి వాణిశ్రీ పట్టుచీర కొంచెం చిరిగింది. ఆ తర్వాత బస్సు ఎక్కిన మరో మహిళ చీర కూడా అదేవిధంగా చిరిగిపోయింది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

దీంతో ఆ రేకును సరిచేయాలని నరసింహారావు బస్సు డ్రైవర్‌కు సూచించాడు. అయితే అది డిపో సిబ్బంది పని అని, తనకు సంబంధం లేదని డ్రైవర్ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. ఈ విషయాన్ని ఆయన డిపో మేనేజర్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. దీంతో ఆర్టీసీ అధికారుల తీరుపై విసిగిపోయిన నరసింహారావు నల్గొండలోని వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. బస్సు టిక్కెట్స్‌తో పాటు డోర్ వద్ద బయటకు తేలిన రేకు, చిరిగిన పట్టుచీర ఫోటోలను సాక్ష్యంగా అందజేశారు. దీనిపై విచారణ చేపట్టిన వినియోగదారుల ఫోరం బాధితుడి వాదనతో ఏకీభవిస్తూ… ఆర్టీసీ సిబ్బంది నిర్లక్ష్యాన్ని ధ్రువీకరించింది. పట్టుచీరకు రూ.2వేలు, ఇతర ఖర్చులకు మరో రూ.1000 బాధితుడికి అందజేయాలని ఆర్టీసీని ఆదేశిస్తూ ఆదేశాలు జారీచేసింది. మ‌రి చూశారుగా నిర్ల‌క్ష్య‌స‌మాధానాల‌కు ప‌నులకు చెల్లించ‌క త‌ప్ప‌దు భారీ మూల్యం మ‌రి ఆయ‌న‌చేసిన ప‌నిపై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.