ఈ కార్పొరేట‌ర్ సెలూన్ లో అమ్మాయిని ఏం చేశాడో తెలిస్తే షాక‌వుతారు.

384

కొంద‌రు రాజ‌కీయ నాయ‌కులు ఆ ప‌ద‌విలో ఉన్న స‌మ‌యంలో పూన‌కం వ‌చ్చిన నాయ‌కుల్లా మారిపోతారు… త‌మ‌కు ఎవ‌రి నుంచి అడ్డు అదుపు ఉండ‌దు అని ఫీలై పోతారు. ఎవ‌రిమాట విన‌ని సీత‌య్య‌ల్లా మారిపోతారు. ఇక ఈ స‌మ‌యంలో త‌మ‌కు తోచిన విధంగా ఫీలై పోయి ఇష్టం వ‌చ్చిన రీతిలో ప్ర‌వ‌ర్తిస్తారు. వారు ఏం చేస్తున్నారో కూడా మ‌ర్చిపోతారు, ఇక అధికారం అనే ద‌ర్పం చూపించి సామాన్యుల‌పై దాడుల‌కు ఎగ‌ప‌డ‌తారు.. ఇక ఎమ్మెల్యేలు ఎంపీలు ఇలాంటి దూకుడు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డిన సంద‌ర్బాలు మ‌నం అనేకం చూశాము.. ఇప్పుడు ఓ కార్పొరేట‌ర్ చేసిన ప‌ని పై త‌మిళ‌నాట పెద్ద చ‌ర్చ‌ జ‌రుగుతోంది.

Image result for girls depression

తమిళనాడులోని పెరంబళూరులో దారుణం జరిగింది. డీఎంకే కు చెందిన కార్పొరేటర్‌ సెల్వకుమార్ మ‌హిళ‌పై దాడి చేశాడు.. ఈ విష‌యం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది… స్థానికంగా ఉన్న ఓ బ్యూటీ పార్లర్‌ లోకి వెళ్లి ఓ మహిళను విచక్షణ రహితంగా కాలితో తన్నాడు. మహిళ కడుపుపై కనికరం లేకుండా పదే పదే కాలితో తన్నాడు. అక్కడే ఉన్న మిగతా మహిళలు కొట్టవద్దని బతిమాలిన పట్టించుకోలేదు. ఈ ఏడాది మే 25 న జరిగిన ఈ ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. ఈ విజువల్స్ ను బ్యూటీ పార్లర్‌ యాజమాన్యం పోలీసులకు అప్పగించింది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అయితే స‌ద‌రు కార్పొరేట‌ర్ ఇలాంటి దాడుల‌కు పాల్ప‌డ‌టంలో ముందు ఉంటాడ‌ని, గ‌తంలో ఇలాంటి కేసులు జ‌రిగిన సంఘ‌టన‌లు ఉన్నాయి అని అంటున్నారు.. స‌ద‌రు నాయ‌కుడికి ఎమ్మెల్యేల అండ‌దండ‌లు ఉండ‌టంతో ఇక్క‌డ విచ‌క్ష‌ణ కోల్పోయి ఇలాంటి దాడుల‌కు కార‌ణం అవుతున్నాడు అని అంటున్నారు.. ఇక ఎమ్మెల్యేకు ఇత‌ని వ్య‌వ‌హారం చెప్పినా ఆయ‌న స్పందించ‌లేదు అని అంటున్నారు. అయితే కార్పొరేట‌ర్ ఎందుకు దాడిచేశాడు అనేదానిపై ఇక్క‌డ విచార‌ణ జ‌రుగుతోంది. పోలీసులు చెప్పే దాని ప్ర‌కారం ఆ మ‌హిళ‌కు ఆయ‌న‌కు ఉన్న త‌గాదాల వ‌ల్ల ఆయ‌న ఇలా దాడికి పాల్ప‌డి ఉంటాడు అని అంటున్నారు. అలాగే ఈ కార్పొరేట‌ర్ పై గ‌తంలో వ‌చ్చిన ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ఇలా పార్టీలో ఉండి ప్ర‌జ‌ల‌పై దాడుల‌కు దిగ‌డాన్ని వ్య‌తిరేకిస్తున్నారు అంద‌రూ.. ఇక ఆయ‌న పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో పోలీసులు అరెస్ట్ చేయ‌డంతో  డీఎంకే పార్టీ అధినాయకత్వం అతన్ని పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది.. ఇలాంటి వ్య‌క్తిని శిక్షించాలి అని ఆ మ‌హిళ కోరుతున్నారు. . చూశారుగా ఇలాంటి నాయ‌కుల‌కు ఎటువంటి శిక్ష విధించాలో కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.