చైనాలో మనిషి మాంసాన్ని ఏం చేస్తారో తెలిస్తే బిత్తరపోతారు

525

చైనా మనిషి మాంసం అమ్ముతోందంటా..! అదీ మామూలుగా కాదు.. చనిపోయిన మృతదేహాలను ప్రాసెస్ చేసి కార్నడ్ బీఫ్ అనే చెప్పి క్యాన్లలో, ప్యాకెట్లలో నింపి ఆఫ్రికా దేశాల్లో అమ్మేస్తోందంటా..! ఈ వార్త ఈ నెల మొదట్లో నెట్లో వైరల్ గా మారడంతో చైనాపై ఇతర దేశాలు ఇంతెత్తున లేచాయి. దీంతో చైనా ప్రభుత్వం విచారణ చేపట్టగా ఇదంతా ఫేస్ బుక్ లో వైరల్ అయిన ఒక పోస్ట్ ద్వారా వచ్చిన రూమర్ అని తేల్చింది. అసలు ఏం జరిగిందో ఇప్పుడు ఆఫ్రికాలో ఏం జరుగుతుందో పూర్తీగా తెలుసుకుందామా. మే నెల మొదటి వారంలో ఒక ఫేస్ బుక్ యూజర్ వీడియో గేమ్స్ లో ఉండే మనిషి బొమ్మ యానిమేషన్ చిత్రాలను, చైనాలోని మాంసం ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీల ఫొటోలను మార్ఫింగ్ చేసి ఒక పోస్ట్ పెట్టారు.

Related image

దీని అర్థం ఏంటంటే చైనాలోని మాంసాహార ఉత్పత్తుల సంస్థలు చనిపోయిన మనిషి కళేబరాలను తీసుకొని వాటిని మారినేట్ చేసి ఆ ప్రాసెస్డ్ మాంసాన్ని క్యాన్లలో, ప్యాకెట్లలో నింపి ఆప్రికన్ దేశాలకు ఎగుమతి చేస్తోందని సూపర్ మార్కెట్లలో ఇలాంటి ఉత్పత్తులను కొనొద్దని ఉంది. ఆఫ్రికాలోని జాంబియా దేశంలోని ఒక టాబ్లాయిడ్ ఈ ఫేక్ పోస్టును వార్తగా ప్రచురించింది.స్వయంగా చైనా నుంచే “సోర్స్” ఉందని ఆ పత్రిక పేర్కొంది. దీంతో ఆఫ్రికన్ దేశాల్లో రగడ మొదలైంది.అంతేకాకుండా చైనాలో నివసిస్తున్న జాంబియా దేశానికి చెందిన ఓ మహిళ ఆఫ్రికాలోని తన బంధువులకు సోషల్ మీడియాలో ఈ మాంసాన్ని తినొద్దంటూ హెచ్చరించడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.ఈ సందర్భంగా సదరు మహిళ మృతదేహాలను సేకరించి, వాటిని ముక్కలుగా చేసి విక్రయిస్తున్నారని పేర్కొంది.

ఈ పోస్ట్ ని కొన్ని వేల మంది షేర్ చేయడంతో చైనా ఆహార ఉత్పత్తుల అమ్మకాలు దెబ్బతిన్నాయి.దీంతో వెంటనే ఈ విషయంపై స్పందించిన చైనా విదేశాంగ అధికారి యాంగ్ యౌమింగ్ ఈ వార్తల్లో వాస్తవం లేదని, ఇది ఓ లోకల్ న్యూస్ పేపర్ సృష్టించిన పుకారని అన్నారు. మరోవైపు జాంబియాకు చెందిన ఓ ఉన్నతాధికారి ఒకరు స్పందిస్తూ చైనా నుంచి మానవ మాంసాన్ని దిగుమతి చేసుకుంటున్నట్లు వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని వ్యాఖ్యానించారు ఈ విషయం తెల్సుకున్న జాంబియాలోని చైనా రాయబారి ఇదంతా వట్టి పుకారే అని సోషల్ మీడియాలో కావాలనే చైనాను దెబ్బతీస్తున్నారని వివరణ ఇచ్చుకున్నాడు. చైనా కూడా ఈ విషయంపై ఆఫ్రికన్ కంట్రీస్ కి వివరణ ఇచ్చినా ఎవరూ నమ్మట్లేదు.పాపం ఇప్పుడు ఆఫ్రికన్ దేశాల్లో చైనా ఉత్పత్తులంటేనే భయపడుతున్నారంటా. సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్ కి చివరికి చైనా ఆహార సంస్థలు ఇలా బలయ్యాయి.చూడాలి మరి ఈ వ్యవహారం ఎక్కడికి వెళ్తుందో.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.చైనా మనిషి మాంసాన్ని అమ్ముతుందని వచ్చిన పోస్ట్ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.