అభినంద‌న్ చివ‌రి ప్ర‌య‌త్నంగా ఏం చేశాడో తెలిస్తే షాక్

297

పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై జైషే మహ్మద్ దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు దాదాపు యుద్ధం అంచుల వరకు వెళ్లాయి. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత వైమానిక దళం (ఐఏఎఫ్) పాకిస్తాన్‌లోని బాలాకోట్‌ ఉగ్రస్థావరాలపై మెరుపుదాడులు నిర్వహించింది. ఆ మరుసటి రోజే పాకిస్తాన్ యుద్ధ విమానాలు భారత సైనిక స్థావరాలపై గురిపెట్టడంతో ఇరు వైమానిక దళాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ సందర్భంగా ఐఏఎఫ్‌కి చెందిన మిగ్-21 బైసన్ యుద్ధ విమానం దాడికి గురికావడంతో… దాన్ని నడుపుతున్న వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ అందులో నుంచి బయటికి రావాల్సి వచ్చింది. పారాచూట్ సాయంతో పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని బింబెర్ జిల్లా హోరాన్ గ్రామంలో ఆయన దిగారు. పాకిస్తాన్ గడ్డపై అభినందన్ దిగిన తర్వాత ఏం జరిగింది? తాను శత్రువు పాకిస్తాన్‌లో పడినట్టు అభినందన్ ఎలా పసిగట్టారు? తనవద్ద ఉన్న రహస్యాలు పాక్ సైన్యం చేతికి చిక్కకుండా ఏం చేశారన్నదానిపై ఒక జాతీయ టీవీ ఛానెల్ ప్రతినిధి బృందం సమగ్ర వివరాలు రాబట్టింది. అభినందన్ వర్థమాన్ కనబర్చిన సమయ స్ఫూర్తి, తెలివి ఆయనను ఎలా కాపాడాయో స్థానికులు ఇప్పటికీ గుర్తుచేసుకుంటున్నారు.

Image result for abhinandan

ఆరు యుద్ధ విమానాలను ఒక్క విమానంతో తరుముకుంటూ అభినందన్ వచ్చినట్టు అక్క‌డ వారు చెప్పారు. సరిగ్గా తిరిగి ఆయన భారత గగనతలంలోకి వస్తుండగా పాక్ వైమానిక దళాలు అభినందన్ ప్రయాణిస్తున్న మిగ్21ను కూల్చేశాయి. దాన్నుంచి బయటపడిన అభినందన్‌కు.. తాను శత్రు భూభాగంపై దిగుతున్నట్టు తెలియలేదు. నియంత్రణ రేఖకు మూడు కిలోమీటర్ల ఆవల ఓ కొండప్రాంతంపై ఆయన దిగారు. ఇక ఎఫ్ పాక్ కు సంబంధించిన ఎఫ్ 16 ను భార‌త్ వాయుసేన గ‌గ‌న త‌లంలో టార్గెట్ చేసింది ..ఒకానొక స‌మ‌యంలో భార‌త్ నుంచి మిగిలిన విమానాలు వెన‌క్కి వెళ్లాయి, కాని అభినంద‌న్ న‌డుపుతున్న విమానం మిడ్ 19 కు మాత్రం అనుమ‌తి వ‌చ్చింది. ఎఫ్ 16 ని టార్గెట్ చేయ‌మ‌ని , దీంతో అభినంద‌న్ ఎఫ్ 16 విమానాన్ని వేటాడాడు , ఈ స‌మ‌యంలో పీవోకేలో ప్ర‌వేశించి పాక్ విమానాన్ని క్లోజ్ గా త‌న రేంజ్ లోకి తీసుకువ‌చ్చాడు అభినంద‌న్.

ఈ క్రింది వీడియో చూడండి 

త‌న విమానానికి అమ‌ర్చిన ఆర్ 73 మిస్సైల్ ని, పాక్ ఎఫ్ 16 కి లాక్ చేశాడు… దానిని కూల్చ‌డానికి ఆర్ 73 క‌రెక్ట్ అన భావించాడు. ఇంత‌లో అభినంద‌న్ విమానాలని పాక్ విమానాలు టార్గెట్ చేశాయి. హైజీ బ్యార‌ల్ రోల్ విన్యాసం చేశాడు అభినంద‌న్ ..గాలిలో ప‌ల్టీలు కొట్టి విమానం గింగిరాలు తిప్పాడు. కాని ఈ స‌మ‌యంలో అత‌ని విమానం దాడికి గురి అయింది. దీంతో అత‌ను పాక్ భూభాగంలో ప‌డ్డాడు, అయితే అక్క‌డ నుంచి చాక‌చ‌క్యంగా సైన్యం ద‌గ్గ‌ర వ్య‌వ‌హ‌రించాడు చివ‌ర‌కు భార‌త్ వ‌చ్చాడు అభినంద‌న్, అందుకే ఆయ‌న‌కు యావ‌త్ భార‌తావ‌ణి సెల్యూట్ చేస్తోంది.