పెళ్లి జరిగిన కాసేపటికే ఏం జరిగిందో తెలిస్తే కన్నీళ్ళు ఆగవు

284

పెళ్లి జరిగిన ఇల్లు ఎలా ఉంటుంది చెప్పండి. ఇంటి నిండా చుట్టాలతో వదువువరులు నవ్వులతో ఆటపాటలతో ఎంతో సంతోషంగా ఉంటుంది కదా. అలా ఆనందముగా ఉన్న సమయంలో విషాదం నెలకొంటే ఎలా ఉంటుంది చెప్పండి. అప్పటి వరకు మంగళవాయిద్యాలు, పచ్చతోరణాలతో కళకళలాడిన ఇంట అంతలోనే చావు బాజా మోగితే ఎలా ఉంటుంది చెప్పండి.. అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించి కుమార్తెను ఓ ఇంటిదాన్ని చేసిన తండ్రి పనిలో భాగంగా బయటకు వెళ్లి రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడడంతో ఆ ఇంట విషాదం అలముకుంది. మరి ఆ ప్రమాద ఘటన గురించి పూర్తీగా తెలుసుకుందామా.

Image result for indian marriages

తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం పురుషోత్తపట్నానికి చెందిన ఈలి అర్జునరావు (53) తన కుమార్తె శ్రీదేవికి, బంధువుల్లోని ఓ యువకుడికి ఇచ్చి పెళ్లి చేశాడు.. రఘుదేవపురంలోని సాయిబాబా ఆలయంలో గురువారం తెల్లవారు జామున వీరి వివాహం ఇరువర్గాల కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది.పెళ్ళికి బంధువులు అందరు వచ్చారు. మంచి భోజనాలు పెట్టి అందరి ఆశిర్వాదాలు పిల్లలకు అందించారు. ఇక ఆ తండ్రి మనసులో ఆనందం పొంగిపొర్లుతోంది. కూతురికి ఒక మంచి జీవితాన్ని ఇచ్చా అనే ఆనందం అతనిలో ఉంది. అయితే వీళ్ళు ఆనందంగా ఉన్నారని ఎవరు ఏమని తిట్టుకున్నారో కానీ వీరి కుటుంబంలో విషాదం నెలకొంది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

వివాహం తంతు పూర్తయ్యాక వధూవరులను అన్నవరంలోని సత్యదేవుని దర్శనానికి పంపించారు. తదుపరి పూజల కోసం కావాల్సిన పూలు, ఇతర సామగ్రి కొనుగోలు చేయాలని అర్జునరావు స్వగ్రామం పురుషోత్తపట్నానికి వెళ్లారు. సామగ్రి తీసుకుని ఉదయం ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తున్నారు. గోదావరి గట్టు రహదారిలో వస్తుండగా వెనుక నుంచి వస్తున్న ట్రాక్టర్‌ అర్జునరావును ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. ఈ సమాచారంతో అప్పటి వరకు ఆనందోత్సాహాలతో కళకళలాడిన ఇంట్లో ఒక్కసారిగా విషాదం అలముకుంది.కాబట్టి వాహానాలను నడిపే సమయంలో కొంచెం జాగ్రత్తలు పాటించండి. మరి ఈ కుటుంబంలో నెలకొన్న ఈ విషాద ఘటన గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.