రోడ్డు మీద మరణించిన బిచ్చగాడి సంచిలో ఏమున్నాయో తెలిస్తే నివ్వెరపోతారు

262

ఒక వ్యక్తి బిచ్చం ఎత్తుకుంటున్నాడు అంటే ఎంత దౌర్భాగ్యం అనుకోవాలి చెప్పండి.కన్నా పిల్లలకు తల్లిదండ్రులు బారమైనప్పుడు చనిపోయే ధైర్యం లేక రోడు మీద పడి బిచ్చం ఎత్తుకుని జీవించేవాళ్ళు చాలా మంది ఉన్నారు.ప్రతి బిచ్చగాని వెనక ఏదో ఒక కుటుంబం ఉంటుంది.కానీ వాళ్ళకు బారంగా మారడం వలన ఇంట్లో నుంచి గెంటి వెయ్యబడి బిచ్చగాళ్ళ లాగా మారతారు.రోజు ఎవరో ఒకరు వేసే బిచ్చం వలన వాళ్ళు జీవనం కొనసాగిస్తారు.మాములుగా బిచ్చం ఎత్తుకుని బతికేవాళ్ళకు ఆస్తులు ఏమైనా ఉంటాయా అంటే ఉండవు అనే చెబుతారు కదా.కానీ బిచ్చం ఎత్తుకుని జీవించే ఒక వ్యక్తి ఎంత డబ్బును ఆదా చేసిందో తెలిస్తే వామ్మో అంటారు.మరి అతను బిచ్చం ఎత్తుకుని ఎంత సంపాదించాడో చూద్దామా..

రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో ఒక బిచ్చగాడు కళ్ళుతిరిగి రోడ్డు మీదనే పడిపోతాడు. అతని నోటి నుంచి నురుగు రావడంతో చాలా మంది భయపడి అతని దగ్గరకు వెళ్ళడానికి కూడా భయపడ్డారు. కొద్దిసేపటికి ఒక యువకుడు వచ్చి అతనికి సహాయం చేద్దామని వెళ్ళాడు. అతనికి బాగా చెమట పట్టింది. దాంతో డీ హైడ్రేషన్ అయిందేమో అనుకుని అతని షర్ట్ ను విప్పడానికి ట్రై చేశాడు.అయితే అతని షర్ట్ చాలా టైట్ గా ఉండడంతో అక్కడ తియ్యడానికి వీలుకాక హాస్పిటల్ కు తరలించారు. అతనికి కొంచెం చికిత్స అందించారు. అతని షర్ట్ తీయడానికి హాస్పిటల్ లో కూడా ట్రై చేశారు.కానీ రాలేదు. దాంతో చాక్ తీసుకుని అతని షర్ట్ ను కట్ చేశారు. అయితే అతను ధరించింది ఒక షర్ట్ కాదు ఐదు షర్ట్స్ ను వేసుకున్నాడు. ఐదు షర్ట్స్ వేసుకుని చిరిగినా షర్ట్స్ ను చుట్టూ కట్టుకున్నాడు. ఆ ఐదవ షర్ట్ కు తీసేసి అతని దగ్గర ఉన్నదానిని చూసి అందరు షాక్ అయ్యారు.ఏమున్నాయి అనుకుంటున్నారా..అతని దగ్గర 2000 రూపాయల కట్టలు మూడు ఉన్నాయి. ఆ డబ్బే కాకుండా బ్యాంక్ ఖాతా బుక్ కూడా ఉంది. ఆ బ్యాంక్ ఖాతాలో కూడా 3 లక్షల రూపాయలు ఉన్నాయి. వీటిని చూసి ఆ డాక్టర్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు.

బిచ్చం ఎత్తుకునే వాడి దగ్గర ఇంత డబ్బు ఉందంటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే కదా. ముందు ఆ బిచ్చగాడికి చికిత్స చేసి ఆ తర్వాత పోలీసులను పిలిచి మొత్తం చెప్పారు. ఆ డబ్బు అతను బిచ్చం ఎత్తుకుంటే వచ్చినవా లేక ఎక్కడైనా దొంగతనం చేశాడా లేదా ఎవరైనా ఇచ్చారా అనే డౌట్ తో అతనిని పోలీసులకు అప్పజెప్పారు.అయితే ఆ బిచ్చగాడికి మెలుకువ వచ్చిన తర్వాత అతను చెప్పింది ఏమిటంటే.. నేను చాలా రోజుల నుంచి బిచ్చం ఎత్తుకుని సంపాదించినా డబ్బు ఇది. చిల్లర ఎక్కువ అవ్వడంతో వాటిని నోట్ల రూపంలోకి మార్చుకుని కొంత సొమ్మును నా దగ్గర పెట్టుకుని మరికొంత బ్యాంకు లో వేసుకున్నా అని చెప్పాడు. ఇప్పుడు నా దగ్గర ఉన్న నోట్ల కట్టలు ఇందాకనే తెచ్చుకున్నాను. వీటిని రేపు బ్యాంకు లో వెయ్యాలనుకున్నా అని చెప్పాడు. ఇది విని పోలీసులు షాక్ అయ్యారు. ఒక బిచ్చగాడు ఈ రేంజ్ లో సంపాదిస్తున్నాడా అని ఖంగుతిన్నారు..విన్నారుగా ఈ బిచ్చగాడు బిచ్చమెత్తుకుని ఎంత సంపాదించాడో..అందుకే బిచ్చాగాల్లె కదా అని చులకనగా చూడవద్దు వాళ్ళు మనకంటే ఎక్కువగానే సంపాదిస్తుంటారు.మరి బిచ్చం ఎత్తుకుని ఇంత డబ్బు సంపాదించినా ఈ వ్యక్తి గురించి అలాగే ఇలా బిచ్చం ఎత్తుకుని ఆస్తులు కూడబెట్టే వారి గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.