మరి కొద్ది గంటల్లో పెళ్లి చేసుకోబోతున్న యువతిని ఏం చేశారో తెలిస్తే షాక్..

355

ప్రేమిస్తున్నా అని ఒక అమ్మాయికి చెప్పడం తప్పు కాదు గాని ఆ ప్రేమను ఒప్పుకోలేదని దారుణాలకు పాల్పడటం తప్పు. ప్రేమ ముసుగులో చాలా మంది చాలా తప్పులు చేస్తారు. కొందరు యాసిడ్ దాడులు చేస్తే మరికొందరు అమ్మాయిని చంపేస్తా అని బెదిరించి అయినా సరే లొంగదీసుకోవాలని అనుకుంటారు. ఇప్పుడు ఇలాంటి పనికే ఒక యువకుడు పాల్పడ్డాడు. తనను కాదని వేరే వాడితో పెళ్ళికి సిద్దమైన యువతిని కిడ్నాప్ చేశాడు. మరి చివరికి ఏమైందో తెలుసుకుందామా.

Image result for marraige

పంజాబ్‌లోని ముక్తాసర్‌ నగరంలో నివసించే ఒక యువతికి కొద్ది గంటల్లో పెళ్లి అనగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ అయిన యువతికి అదే ప్రాంతానికి చెందిన ఓ యువకునితో ఆమెకు వివాహం నిశ్చయం అయింది. నిన్న సాయంత్రం వారి వివాహం జరగాల్సి ఉంది. అయితే మెకప్ కోసం ఆ యువతి శుక్రవారం ఉదయం 5:30 గంటల సమయంలో దగ్గర్లోని ఓ బ్యూటీ పార్లర్‌కు వచ్చింది. ఈ క్రమంలో ఆమె కోసం పార్లర్‌ బయట ఇద్దరు వ్యక్తులు వేచి ఉన్నారు. 20 నిమిషాల తర్వాత ఆ యువతి బయటకు రాగానే వారు ఆమెను కిడ్నాప్ చేశారు. ఆ యువతిని బలవతంగా కారులో ఎక్కిస్తున్న దృశ్యాలు పార్లర్ బయట ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. అనంతరం ఆమెను కిడ్నాపర్స్ సమీపంలో ఉన్న ఓ బస్టాండ్‌లో వదిలి వెళ్ళారు . ఆమె నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి జరిగిన విషయం చెప్పింది.ఆ యువతి ఎక్కడకి వెళ్లిందో తెలియక అయోమయంలో ఉన్న తల్లిదండ్రులకు ఆమె తమ రక్షణలో ఉన్నట్లు పోలీసులు వారికి సమాచారం అందిచారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అయితే ఈ కిడ్నాప్ కు ఎవరు ప్రయత్నించి ఉంటారా అని ఆలోచించగా ఆ యువతీ ఒకరి మీద అనుమానం వ్యక్తం చేసింది. గత కొన్నిరోజులుగా ఒక యువకుడు తనను ప్రేమిస్తున్న అని వేధిస్తున్నాడు. పెళ్లి చేసుకుంటే నన్నే చేసుకోవాలి లేకుంటే లేదని వార్నింగ్ ఇస్తున్నాడని ఆమె చెప్పింది. అలాగే తల్లిదండ్రులు కూడా కొందరి మీద అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు కిడ్నాప్‌కు ప్రయత్నించిన దుండగులను త్వరలోనే పట్టుకోనున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా వెల్లడించారు.ముందు ప్రేమిస్తున్నా అని వేధించే వాడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే సిసి టీవీ కెమెరాలో రికార్డ్ అయినా దానిని చూస్తే అది ఎవరో యువకులు చేసిన పనిలాగా ఉంది కాబట్టి ఇది ఆ ప్రేమికుడి పనే అనుకుంటున్నారు. మరి ఈ ఘటన గురించి అలాగే ఇలా ప్రేమను కాదన్నారని దారుణాలకు పాల్పడే వారి గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.