అమృత విషయంలో ఈ డాక్టర్ చేసిన మేలేంటో తెలిస్తే క‌న్నీరుపెట్టుకుంటారు

414

న‌ల్ల‌గొండ జిల్లా మిర్యాల‌గూడ‌లో ప్ర‌ణ‌య్ హ‌త్య ఉదంతం తెలుగు ప్ర‌జ‌లు ఎవ‌రూ మ‌ర్చిపోరు, ఇలాంటి దారుణం చేసినా మారుతిరావు ద‌ర్జాగా ఉన్నాడు..మారుతీరావు మదిలో మెరిసిన ఒక చిన్న చెడు ఆలోచనతో ఎన్నో జీవితాలు చిందరవందరగా మారిపోయాయి. చిగురుటాకుల్లా వణికిపోయాయి. ప్రణయ్‌ని వేరు చేయాలి, తన కూతురును దగ్గరకు చేర్చుకోవాలి అన్న మారుతీరావు దారుణ‌మైన ఆలోచనతో తెలుగు జాతి మొత్తం ఓ కుదుపునకు గురైంది. తాను అనుకున్నది సాధించానని ప్రస్తుతం మారుతీ భావిస్తున్నా రాబోయే రోజుల్లో ఆయన కోల్పోయింది ఏమిటో కళ్ల ముందు కనపడనుంది. 9వ తరగతి నుంచి నమ్మిన ప్రేమకోసం వర్షిణి నిలబడింది. ఆ క్రమంలో రక్తం పంచిన తల్లిదండ్రులను కాదనుకొని ప్రణయ్‌ పంచన చేరింది. చావైనా, బతుకైనా అతనితోనే అని బలంగా నమ్మింది. కులం ఒక కుచ్చితత్వం అని గట్టిగా నినదించింది, నిలబడింది. ప్రేమ కోసం విలువైన ప్రాణాన్ని వదులుకున్న ప్రణయ్‌ తన నిజమైన హీరో అని అతని జ్ఞాపకాలను తనతోనే జీవితాంతం ఉంచుకుంటానని, ప్రేమ హత్య ప్రణయ్‌తోనే చివరిది కావాలని, కులాన్ని రూపుమాపడం కోసం ప్రేమ వివాహాన్ని ప్రోత్సహించడంకోసం తాను పనిచేస్తానని, ప్రణయ్‌ హంతకులను చివరివరకు వదలబోనంటూ చెబుతోంది. ఇక ఈ స‌మ‌యంలో ఆమెకు అండ‌గా నిల‌బ‌డిన డాక్ట‌ర్ పై కూడా ఇప్పుడు ప్రశంస‌లు వ‌స్తున్నాయి.

సమాజంలో స్థితివంతుడు, ప్రభావితం చేయగలిగే మారుతీరావు తన కూతురు వర్షిణికి అబార్షన్‌ చేయాలంటూ డాక్టర్‌ జ్యోతిపై పలుమార్లు ఒత్తిడి చేశాడు. అయినా ఆ డాక్టర్‌ మానవత్వమే గొప్పదని మారుతీరావు సూచనను పాటించేది లేదంటూ తేల్చేసింది. హత్య ఘటన తదుపరి సైతం డాక్టర్‌ జ్యోతి వర్షిణి ఆరోగ్యంపై జాగ్రత్త తీసుకోవడం బతికి ఉన్న విలువలను పట్టి చూపుతోంది. ఆమె కుటుంబ డాక్ట‌ర్ అయినా ఆమె ఎటువంటి ఒత్త‌డికి త‌లోగ్గ‌లేదు అమృత పుట్టింది కూడా ఆ డాక్ట‌ర్ చేతిలోనే, ఇప్పుడు ఆ డాక్ట‌ర్ ఆమె బిడ్డ‌కు కూడా ఈ లోకం చూపించ‌నుంది ఇలాంటి మంచి డాక్ట‌ర్ ఉండ‌టం కూడా మ‌న స‌మాజంలో అంద‌రికి ఓ క‌నువిప్పుగా ఉంది.వందల కోట్ల ఆస్తులు, విశాలమైన భవంతులు, విలాసమైన కార్లలో తిరుగుతూ నిన్నటి వరకు మిర్యాలగూడలో మారుతీ అంటే ఓ ప్రత్యేకత, నేడు అది చిన్న దుర్మార్గపు ఆలోచనతో నిట్ట నిలువునా కూలిపోయింది. నేరగాడిగా, దోషిగా, మూర్ఖుడిగా, రాక్షసుడిగా మారుతీరావు సమాజం ముందు నిలబడ్డాడు. ప్రేమే లోకంగా ప్రేమే జీవంగా ప్రణయ్‌కోసం శారీరక, మానసిక హింసలను భరించి, చదువుకు దూరమై, తల్లిదండ్రులతో వేరుబడి చిరు ప్రాయంలోనే వర్షిణి గొప్ప మహిళగా ప్రాచుర్యం పొందింది. కులాంతర, మతాంతర వివాహాలకు ధైర్యంగా ముందుకురావాలని, నిలబడాలని వర్షిణి మార్గం ముందు తరాలకు స్పష్టం చేస్తోంది. మొత్తంగా చూస్తే ఒక వ్యక్తి విచక్షణను కోల్పోతే ఏం జరుగుతుందో మారుతీరావు ఉదంతమే ఒక ఉదాహరణ. ఏకైక కూతురు.. వందల కోట్ల ఆస్తులు.. అవన్నీ నేడు అవసరం లేనివిగా మారిపోయాయి.

పోలీస్‌స్టేషన్లలో కటిక నేలపై కూర్చోవడం, జైలులో చిప్పకూడు తినడం, సమాజంతో చీ కొట్టించుకోవడం మారుతీరావుకు మిగిలింది. మారుతీరావు దుర్మార్గపు ఆలోచనతో ఉజ్వల భవిష్యత్‌ ఉన్న ప్రణయ్‌ ప్రాణాలు కోల్పోయాడు. బాలస్వామి కుటుంబానికి కడుపుకోతను మిగిల్చాడు. జీవితాంతం తీరని దుఃఖాన్ని ఆ కుటుంబానికి మిగిల్చాడు. మరోవైపు మారుతీరావు కుటుంబం ఆయన సోదరుని కుటుంబానికి సమాజంలో విలువ లేకుండా పోయింది. వందలాది కుటుంబాలపై మారుతీరావు దురాలోచన ప్రభావం పడింది. అత‌ని ఆత్మ‌కు శాంతిచేకూరాల‌ని మారుతిరావులాంటి వారికి బుద్దిరావాలి అని కోరుకుందాం