పూర్వకాలంలో ఆడవారిపై ఉన్న నియమాలు తెలిస్తే షాక్

637

మ‌న దేశంలోనే కాదు ప్ర‌పంచంలో స్త్రీ శ‌క్తిని గ‌తంలో చాలా త‌క్కువ‌గా చూసేవారు.. ఇక వందేళ్ల వెన‌క్కి వెళితే స్త్రీల‌కు ఇప్పుడు ఉన్న స‌మాన‌త్వం హ‌క్కుల్లో 5 శాతం కూడా లేవు.. నలుగురి మ‌ధ్య‌లో కూర్చుని మాట్లాడ‌కూడ‌దు. న‌లుగురితో తిర‌గ‌కూడ‌దు. ఇలా అనేక ఆంక్ష‌లు పెట్టేవారు. ఇక ఆమెకు భ‌ర్తపై ముద్దు ముచ్చ‌ట ఉన్నా ఆమె కోరిక‌ను నిగ్ర‌హించుకోవాలి.. త‌న భ‌ర్త ఎప్పుడు కోరుకుంటే అప్పుడు ఆమె ఆ ప‌రిస్దితికి లోను కావాలి. అంత దారుణ‌మైన శిక్ష‌లు అవ‌మానాలు స్త్రీలు ఎదుర్కొనేవారు. మ‌రి గ‌తంలో పుర్వ‌కాలంలో స్త్రీలు ఎలాంటి నియ‌మాలు పాటించారు వారిపై ఎటువంటి నిబంధ‌న‌లు అమ‌లు చేసేవారో ఇప్పుడు తెలుసుకుందాం.

Image result for painting girls

గ‌తంలో స్త్రీల పై అనేక ఆంక్ష‌లు ఉండేవి, పెళ్లికాక ముందు ఎక్క‌డికి వెళ్లినా తండ్రి సోద‌రుల అనుమ‌తి తీసుకోవాల్సిందే..బ‌య‌ట‌కు ఎక్క‌డిక వెళ్లినా వారిలో ఎవ‌రో ఒక‌రిని అడిగి వెళ్లేవారు.. ప్రాచీన కాలంలో స్త్రీలు ఎప్పుడు ప‌డితే అప్పుడు శృంగారంలో పాల్గొన‌కూడ‌దు.. రాత్రిపూట మాత్ర‌మే చేసేవారు. ఇక భ‌ర్త తిట్టినా కొట్టినా ఇంట్లో ఉండాల్సిందే, ఈ విష‌యం బ‌య‌ట చెబితే మ‌రో స్త్రీని పెళ్లి చేసుకుంటాను అని భ‌ర్త‌లు ఆమెని హింసించేవారు.

Image result for painting girls

భ‌ర్త‌ముందు భార్య‌లు అలంకారం చేసుకోవాలి. అంతే కాని భ‌ర్త ఇంటిలో లేని స‌మ‌యంలో అందంగా అలంక‌రించుకోకూడ‌దు.భ‌ర్త ఎంత త‌క్కువ సంపాదించినా దానితోనే స‌రిపెట్టుకోవాలి. ఎప్పుడూ సంపాద‌న కోసం పేరు పెట్ట‌కూడ‌దు.వేశ్య‌తో ఎవ‌రైనా స్త్రీ మాట్లాడితే ఆమెని వెలివేసేవారు. ఆమె ఇంటికి ఎవ‌రూ వెళ్లేవారు కాదు. ఆమె ఇంటికి ఏ పిలుపు వ‌చ్చినా శుభ‌కార్యానికి కూడా వెళ్లేవారు కాదు.. ప్ర‌తీ పండుగ‌కు ఉప‌వాసాలు ఉండాల్సిందే, వారానికి రెండు నుంచి మూడు రోజులు క‌టికి నేల‌పై భ‌ర్త కోసం నిద్రించేవారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ముందు పిల్ల‌లు భ‌ర్త తిన్న త‌ర్వాత మాత్ర‌మే భార్య ఆహారం తీసుకోవాలి, ఇక పీరియ‌డ్స్ స‌మ‌యంలో స్త్రీ త‌న భ‌ర్త‌ని చూడ‌కూడ‌దు..ఆమె ఇంటి బ‌య‌ట నిద్రించాలి, ఇంట్లోకి రాకూడ‌దు. ఇక రోజూ బిచ్చ‌గాళ్ల‌కు ఆవుల‌కు భోజ‌నం పెట్టాలి ఆ త‌ర్వాత మాత్ర‌మే ఆమె భోజ‌నం చేయాలి.ఇంటిలో ఎన్ని గొడ‌వ‌లు జ‌రిగినా ఒక్క విష‌యం కూడా బ‌య‌ట చెప్ప‌కూడ‌దు. భ‌ర్త గురించి ఎట్టి ప‌రిస్దితుల్లో పుట్టిన ఇంటిలో కూడా చెప్ప‌కూడ‌దు. ఇక భ‌ర్త గురించి చెడుగా ఎవ‌రికి చెప్పినా ఆమెకు క‌ఠిన శిక్ష అమ‌లు చేసేవారు…భ‌ర్త గురించి ఎవ‌రికి ఎప్పుడూ చెప్ప‌కూడ‌దు.భ‌ర్త నిద్రించాకే ఆమె క‌చ్చితంగా ప‌డుకోవాలి, ఇక భ‌ర్త లేని స‌మ‌యంలో గ‌డ‌ప దాటి ఆమె బ‌య‌ట‌కు వెళ్ల‌కూడ‌దు. భ‌ర్త ఏది చెబితే అది పాటించాలి.