ఎయిర్ పోర్ట్ లో మలద్వారం ద్వారా బంగారం స్మగ్లింగ్ ఎలా చేశారో తెలిస్తే షాక్

457

సమాజంలో ఉండే దుర్మార్గమైన పనులలో స్మగ్లింగ్ ఒకటి.స్మగ్లింగ్ ను ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు.దొంగలు లేటెస్ట్ టెక్నాలజీని యూజ్ చేసుకుంటున్నారు. పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటూ స్మగ్లింగ్ కు పాల్పడుతున్నారు. విదేశాల నుంచి బంగారం అక్రమ రవాణా చేయడం చాలా ఈజీ అంటూ తాజాగా రియాజ్ అహ్మద్ అండ్ గ్యాంగ్ నిరూపించారు.అయితే బంగారాన్ని అక్రమంగా తరలించబోయి అడ్డంగా దొరికిపోయారు.తిరుచ్చి ఎయిర్ పోర్ట్ లో జరిగిన ఈ ఘటన గురించి పూర్తీగా తెలుసుకుందామా.

Related image

ఆ స్మగ్లర్ మామూలోడు కాదు. బంగారం స్మగ్లింగ్ చాలామంది లోదుస్తుల్లోనో, బెల్టుల్లోనో… తదితర మార్గాల ద్వారా చేరవేస్తుంటారు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే స్మగ్లర్స్ బంగారంను మలద్వారం ద్వారా స్మగ్లింగ్ చేశారు.బంగారం అక్రమ రవాణాకు ఈ స్మగ్లర్లు కొత్తకొత్త దారులు వెతికారు.. ఈ ముగ్గురు వ్యక్తులు 1.25 కేజీల బంగారాన్ని మలద్వారంలో పెట్టుకుని అక్రమ రవాణా చేస్తూ ఎయిర్‌పోర్టు అధికారులకు చిక్కారు. తిరుచ్చి విమానాశ్రయంలో వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే,కౌలాలంపూర్ నుంచి తిరుచ్చికి ఎయిర్ ఇండియా విమానం ఒకటి వచ్చింది. ఈ విమానంలో కొందరు ప్రయాణికులు స్మగ్లింగ్ చేస్తున్నట్టు ఎయిర్‌పోర్టు అధికారులకు ముందుగానే సమాచారం అందింది. దీంతో విమానం తిరుచ్చికి చేరుకోగానే, ప్రయాణికులందరినీ క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

అత్యాధునిక స్కానింగ్ పరికరాలు ఏ ఒక్కరివద్ద బంగారం ఉన్నట్టు గుర్తించలేక పోయాయి. అయితే, ముగ్గురు ప్రయాణికుల తీరు అనుమానాస్పదంగా ఉండటంతో వారిని మరో గదిలోకి తీసుకెళ్లి విచారించారు. ఈ విచారణలో నిజం వెల్లడించారు.మలద్వారం, అరికాలికి రసాయన పదార్థాలతో అంటించి బంగారం స్మగ్లింగ్ చేస్తున్నట్టు వెల్లడించారు. వీరి నుంచి 1.25 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రయాణికులను రియాజ్ అహ్మద్, తమీమ్ అన్సారీ, జకీర్ హుస్సేన్‌లుగా గుర్తించారు. వీరిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. కాగా వీరితోపాటు మరికొందరు కూడా ఇదే మార్గాన్ని ఎంచుకుని ఓ ముఠాలా మారి బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నారేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.అందుకే వచ్చే విదేశాల నుంచి వచ్చే వారి మీద ఒక కన్ను వేసి ఉంచారు.అనుమానంగా ఉండే అందరిని స్కాన్ చేసి చూస్తున్నారు.స్మగ్లర్స్ ఇలా విచిత్రంగా స్మగ్లింగ్ చెయ్యడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.ఇంత తెలివిగా చేస్తే ఇక మోసపూరిత చర్యలను అరికట్టడం చాలా ఇబ్బంది అవుతుంది అంటున్నారు అధికారులు.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.ఈ ముగ్గురు స్మగ్లర్ గురించి వాళ్ళు స్మగ్లింగ్ చేసిన విధానం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.