సీక్రెట్ గా బెడ్ రూమ్ లో పెట్టిన కెమెరాని ఎలా కనిపెట్టాడో తెలిస్తే షాక్

174

ఈరోజుల్లో హాస్టల్స్ కాలేజీలు బాత్రూంలు ఇలా అమ్మాయిలకు ఎక్కడికక్కడ కెమెరాలు స్పై కెమెరాలతో చుక్కలు చూపిస్తున్నారు కొందరు పోకిరీలు.. అనేకమైన ఘటనలు ఇలాంటివి వెలుగుచూస్తున్నాయి.. సీక్రెట్ కెమెరాల స్కాండిల్‌కు మించి భారీ స్కామ్ దక్షిణ కొరియాలో ఇటీవల వెలుగు చూసింది. హోటల్‌ గదుల్లో రహస్యంగా కెమెరాలు ఏర్పాటు చేసి…ఏకంగా 800 మంది సెక్స్ వీడియోలను రికార్డు చేసిందో ముఠా. ఆ వీడియోలను పెట్టేందుకు ఓ వెబ్‌సైట్ కూడా ఏర్పాటు చేశాయి. సదరు వెబ్‌సైట్‌‌లో జంటల శృంగార వీడియోలను లైవ్ టెలికాస్ట్ చేయడంతో వీరి గుట్టు రట్టు అయింది. దక్షిణ కొరియాలోని పది నగరాల్లో ఉన్న 30 హోటళ్లలో అమర్చిన స్పై కెమెరాలను చూసి పోలీసులు షాక్ అయ్యారు. సౌత్ కొరియాలోని కొన్ని హోటళ్లలో తక్కువ ధరకే గదులు లభిస్తాయి. దాంతో ఆ దేశానికి వెళ్లిన విదేశీయులతో పాటు పనుల నిమిత్తం వివిధ ప్రాంతాలకు ప్రయాణం చేసేవారు కూడా ఇలాంటి హోటళ్లలో గదులు తీసుకునేందుకు ప్రాధాన్యం ఇస్తారు. దీన్ని అవకాశంగా మలుచుకున్న ఓ ముఠా… పోర్న్ వీడియోలు చిత్రీకరించేందుకు భారీ పథకం పన్నింది. దేశంలోని 10 నగరాల్లో 30 హోటళ్లలో ముందుగా గదులు తీసుకుంటుందీ ముఠా. టీవీ బాక్సులు, వాల్ సాకెట్లలో, హెయిర్ డ్రెయ్యిర్ హోల్డర్స్, ఫ్యాన్స్… ఇలా గుర్తించడానికి వీలు లేకుండా స్పైకామ్‌లు అమరుస్తుంది.

ఈ క్రింది వీడియో చూడండి

ఇలా 40 గదుల్లో రహస్య కెమెరాలను అమర్చారు. ఆ గదుల్లో దిగిన అతిథులు శృంగారంలో పాల్గొన్న, బట్టలు మార్చుకుంటున్నా ఆ దృశ్యాలన్నీ ఓ వెబ్‌సైట్‌లో ప్రత్యక్ష ప్రసారం చేసేవారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ వెబ్‌సైట్ రూపొందించారు. ఈ వెబ్‌సైట్‌లో సెక్స్ వీడియోలు చూడాలంటే ప్రత్యేకంగా రుసుము చెల్లించాల్సి ఉంటుంది. వీక్షకుల నుంచి వీడియోకు ఇంత చెప్పున భారీ మొత్తంలో వసూలు చేస్తోందీ ముఠా. ఇలా దాదాపు 800 మంది స్వదేశీ, విదేశీయుల శృంగార వీడియోలు రికార్డు చేసినట్టు తేలింది. అయితే ఇలాంటి దారుణమే మరోకటి వెలుగులోకి వచ్చింది.. న్యూజిలాండ్ లోని ఓభార్య భర్త ఎయిర్ బీ అండ్ బీ అనే యాప్ ద్వారా హోటల్ లో రూమ్ బుక్ చేసుకున్నారు. ఇక పిల్లలు ఇద్దరు కూడా ఉన్నారు ఈ సమయంలో రూమ్ లో వైఫై ఆన్ చేద్దాం అని అనుకున్నాడు ఈ సమయంలో అతనికిఆప్షన్ లో హైపై కెమెరా అని కనిపించింది దీంతో అతను షాక్ అయ్యాడు.

Image result for lovers in hotel room

అతను ఇంజనీర్ టెక్నికల్ ఎక్స్ పర్ట్ కాబట్టి రూమ్ లో సీక్రెట్ కెమరా అమర్చారు అని తెలుసుకున్నాడు..ఆడివైస్ తో లాగిన్ అయి చూశాడు లైవ్ లో అతని కుటుంబం కనిపిస్తోంది, దీంతో రూమ్ లో కెమెరా ఉంది అని గుర్తించాడు, వెంటనే హోటల్ యాజమాన్యాన్ని నిలదీశాడు, దీంతో చేసేది లేక వెంటనే అక్కడ పనిచేస్తున్నవారు ఇది తాము చేస్తున్న తప్పు అని ఒప్పుకున్నారు..దీంతో వెంటనే ఎయిర్ బీ అండ్ బీ యాప్ కు కంప్లైంట్ చేశాడు అంతేకాదు వారికి ఫిర్యాదు చేసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు, దీనిపై ఆ యాప్ సంస్ధ అతనికి క్షమాపణ చెప్పింది అంతేకాదు ఈ హోటల్ లో బిజినెస్ చేయం అని చెప్పారు, ఇక పోలీసులకు కూడా మొత్తం ఆధారాలతో సహా నిరూపించడంతో వెంటనే అక్కడ కౌంటర్ నుంచి అతనికి డబ్బులు తిరిగి ఇచ్చేశారు అంతేకాదు ఆ హోటల్ ని క్లోస్ చేసి, ఆ యజమానిని అక్కడ పనిచేస్తున్న ముగ్గురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు, ఈ సమయంలో వారి నుంచి వివరాలు సేకరించారు ఇలా దాదాపు 110 మంది కపుల్స్ వీడియోలు తీశారు అని ఒప్పుకున్నారు.దీంతో ఆడేటా అంతా తీసుకుని వారికి 3 సంవత్సరాల జైలు శిక్ష విధించారు పోలీసులు. చూశారుగా అతను టెక్నాలజీ పై కాస్త శ్రద్ద పెట్టి నాలెడ్జ్ ఉంది కాబట్టి కనుగొన్నాడు. సాధారణ జనం ఇలా తెలుసుకోలేరు, అందుకే ఇలాంటి విషయాలలో జాగ్రత్తలు అవసరం అని చెబుతున్నారు పోలీసులు.