లింగమార్పిడిలో భాగంగా ఆడవారిని మగవారుగా, మగవారిని ఆడవారుగా ఎలా మార్చుతారో తెలిస్తే షాక్

442

దేశంలో సెక్స్ మార్పిడి శస్త్రచికిత్సలు చేయించుకునేందుకు ముందుకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దేశ రాజధాని నగరమైన ఢిల్లీలోని లోక్ నాయక్ ఆసుపత్రిలో ఐదుగురు లింగ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకునేందుకు వేచి ఉన్నారు. ఈ లింగ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకునే వారి సంఖ్య పెద్దది కాకపోయినా ఇటీవల ఢిల్లీ నగరంలో ఈ ఆపరేషన్లకు డిమాండు పెరుగుతోంది.అయితే మీకు ఈ లింగ మార్పిడి ఎలా జరుగుతుందో తెలుసా. అమ్మాయి అబ్బాయిగా లేదా అబ్బాయి అమ్మాయిగా ఎలా మారతారో మీకు తెలుసా..ఆ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Image result for hijras

లింగమార్పిడి అనగా జన్మతహ వచ్చిన లింగమును శస్త్ర చికిత్స ద్వారా మార్పు చేసుకోవడము. అనగా జన్మతహ స్త్రీ, పురుషునిగానూ అలాగే పురుషుడు స్త్రీ గానూ మారిపోవడము.కొన్ని జంతువులలో ఇది సహజంగా జరిగే ప్రక్రియ. కానీ మానవులకు మాత్రం ప్రకృతి ఈ సౌలభ్యాన్ని ప్రసాదించలేదు.దీనికి శస్త్ర చికిత్స ఒక్కటే మార్గము.లింగ మార్పిడి చికిత్సను ఇంగ్లిష్‌లో ‘సెక్స్ రీఎసైన్‌మెంట్ సర్జరీ’ అంటారు. సాధారణంగా ట్రాన్స్‌జెండర్లకు ఈ ఆపరేషన్ అవసరమవుతుంది.’లైంగిక అవయవాలు’, లైంగికత వేర్వేరుగా ఉన్నవారిని ట్రాన్స్‌జెండర్లు అంటారు. ఈ శస్త్రచికిత్స చేయడానికి ముందు వారికి ‘జెండర్ డిస్ఫోరియా’ ఉందో లేదో చూస్తారు.అంటే… వారు శరీర తత్వానికి తగ్గట్టుగా వ్యవహరిస్తున్నారా లేదా అన్నది పరీక్షిస్తారు.జెండర్ డిస్ఫోరియా’ను నిర్థరించేందుకు సైకాలజిస్ట్ లేదా సైకియాట్రిస్ట్ సహాయం కావాలి. జెండర్ డిస్ఫోరియా ఉన్నట్లయితే మొదట హార్మోనల్ థెరపీ చేస్తారు.

Image result for hijras

మందులు, ఇంజెక్షన్ల ద్వారా శరీరంలోకి హార్మోన్లను ఎక్కిస్తారు. ఆ తరువాత సర్జరీకి సిద్ధం చేస్తారు.కనీసం 20 ఏళ్ల వయసు దాటాకే ఈ చికిత్స చేస్తారు. అంతకంటే తక్కువ వయసుంటే, తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి.లింగమార్పిడి ఆపరేషన్‌కు 5-6గంటల సమయం పడుతుంది. ఇందులో భాగంగా వక్షోజాలు, జననాంగం, ముఖానికి శస్త్రచికిత్స చేస్తారు. దీని కోసం ప్లాస్టిక్ సర్జన్, సైకియాట్రిస్ట్, గైనకాలజిస్ట్‌తో పాటు న్యూరాలజిస్ట్ కూడా కావాలి.ఆపరేషన్ తరువాత మళ్లీ ఏడాదిపాటు హార్మోనల్ థెరపీ చేస్తారు.ఆడవాళ్లను మగవాళ్లుగా మార్చే చికిత్సకు మరింత ఎక్కువ సమయం పడుతుంది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

దీని కోసం రూ.10-20 లక్షలు ఖర్చవుతాయి.అంతడబ్బు లేక కొందరు ఇప్పటికి కూడా తమను తాము చంపుకుని బతుకుతున్నారు.అయితే ఇలాంటివారిని తక్కువ చేసి చూడడం సమాజంలో జరుగుతుంది. కానీ వాళ్ళు కూడా మనుషులే అని గుర్తించి వాళ్ళతో కూడా కలిసిమెలిసి ఉండాలని కోరుకుందాం.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.ఈ లింగమార్పిడి గురించి దానికి డాక్టర్స్ చేసే చికిత్స గురించి అలాగే సమాజంలో వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.