గూగుల్ మ్యాప్స్ సహాయంతో వీళ్ళు దొంగతనం ఎలా చేసారో తెలిస్తే షాక్!

293

ఈ కేటుగాళ్లు చేస్తున్న పని తెలిస్తే.. గూగుల్ మ్యాప్‌లను ఇలా కూడా వాడేయొచ్చా? అని ఆశ్చర్యం కలగక మానదు. నిజ‌మే చేతిలో స్మార్ట్ ఫోన్ వ‌చ్చిన త‌ర్వాత అందరూ బాగా తెలివిమీరారు. ఇది మంచి ప‌రిణామ‌మే, కాని స‌క్ర‌మ‌మైన మార్గం అయితే మంచిది. కాని కొంద‌రు వీటికి వ‌క్ర‌మార్గాల‌కు వాడుతున్నారు. ఇది చాలా పెద్ద స‌మ‌స్య‌. ఈ టెక్నాల‌జీని ఉప‌యోగించి ప‌లు అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్నారు. అందుకే మ‌న టెక్నాల‌జీ మ‌న‌కే చేటు తెస్తోంది..తాజాగా తెలంగాణ‌లో ఓ ఇద్ద‌రు యువ‌కులు వేసిన ప్లాన్ తెలిస్తే మ‌తిపొవ‌డం షురూ. మ‌రి ఆ ప్లాన్ ఏమిటి గూగుల్ మ్యాప్ తో ఏం చేస్తున్నారు అనేది తెలుసుకుందాం.

Image result for google maps

రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని పోతుబండ తండాకు చెందిన ఇద్దరు యువకులు మేకలు, గొర్రెలను దొంగిలిస్తున్నారు. ఇటీవల గొర్రెల చోరీపై ఫిర్యాదులు పెరగడంతో నిఘా పెట్టిన పోలీసులు ఎట్టకేలకు నిందితులను పట్టుకున్నారు. రాచకొండ సీపీ మహేష్ భగవత్ వీటి గురించి ప‌లు వివరాలు తెలియ‌చేశారు.. విస్లావత్‌ భజేందర్ వ్యవసాయంతో ఉపాధి పొందేవాడు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో డబ్బు సంపాదన కోసం గొర్రెలు, మేకలను దొంగిలించడం మొదలుపెట్టాడు. ఇతడికి సమీప బంధువు రత్లావత్ చిన్న అనే ఆటోడ్రైవర్ సహకరించేవాడు. వీరిద్ద‌రు ఇలా గొర్రెల‌ను మేక‌ల‌ను దొంగ‌త‌నం చేయాలి అని ప్లాన్ వేశారు అనుకున్న‌దే ఆలోచ‌న‌గా ఎక్క‌డ వీటికి అవ‌కాశం ఉందో చూసి అక్క‌డ టార్గెట్ పెట్టుకునేవారు.

 

భజేందర్‌ ఉదయం వేళల్లో బైకుపై తిరుగుతూ.. మేకలు, గొర్రెల మంద ఉన్న ప్రాంతాలను గుర్తించి, ఆ ప్రాంతాన్ని గూగుల్ మ్యాప్ ద్వారా చిన్నకు షేర్ చేస్తాడు. రాత్రికాగానే ఇద్దరూ ఆటోల్లో ఆ ప్రాంతానికి చేరుకుని గొర్లు, మేకలను చోరీ చేస్తారు. ఆ తర్వాత వాటిని బయట మార్కెట్లలో అమ్మేసి డబ్బులు సంపాదిస్తారు. ఇలా వీళ్లు కందుకూరు, మంచాల, యాచారం ప్రాంతాల్లో సుమారు 90 మేకలు, గొర్రెలను చోరీచేసినట్లు పోలీసులు తెలిపారు. వీరి నుంచి రూ.5 లక్షల నగదు, 2 ఆటోలు, 2 బైకులు, 2 సెల్ ‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరు అతి తెలివి తేట‌లు చ‌దువుపై పెట్టి ఉంటే క‌చ్చితంగా మంచి ఉన్న‌త స్ధానంలో ఉండేవారు. కాని ఇలాంటి చిల్ల‌ర దొంగ‌త‌నాల వ‌ల్ల జైలుపాలు అయ్యారు. మ‌రి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.