16 ఏళ్ళ అమ్మాయి జీవితం ఎలా నాశనం అయిందో తెలిస్తే మనసు చలించిపోతుంది

409

హైదరాబాద్ నగరం అంటే తెలుగువారందరికీ ఒక గర్వకారణం. చంద్రబాబు దేనిని సైబర్ సిటీ అంటే కెసిఆర్ ఏమో దీనిని విశ్వనగరం అని అంటారు. హైదరాబాద్ బిర్యానీకి ఫెమస్. ఇక్కడ చదువుకోడానికి ప్రపంచంలోని అన్ని దేశాల నుంచి వస్తారు. అయితే ఇంత పేరు ఉన్న హైదరాబాద్ కు మరొక కోణం కూడా ఉంది. ముఖ్యంగా పాతబస్తీలో కొన్ని దారుణ ఘటనలు చోటుచేసుకుంటాయి. పాతబస్తీలో మైనారిటీ తీరని మైనర్ బాలికలను నిఖా పేరుతో అమ్మేస్తుంటారు. ఎన్నో పనుల మీద వేరే దేశాల నుంచి ఇక్కడికి వస్తుంటారు అలాగే మైనర్స్ ను పెళ్లి చేసుకుని తమ దేశాలకు తీసుకెళ్లేందుకు కూడా కొందరు వస్తారు. అయితే అలా వచ్చిన వాళ్ళు వయసులో ఉన్నవాళ్లు కాదు పండు ముసలోళ్ళు. వాళ్లలో అరబ్ షేక్ లు ఒమన్ షేక్ లు ఉంటారు. ఇలాంటి ఘటనలు పాతబస్తీలో చాలా జరుగుతాయి.

Image result for girls asking lift

ఇప్పుడు మరొక ఘటన జరిగింది. బాల్యం నిండని అమ్మాయిని విక్రయించాడు ఆ కసాయి తండ్రి. బాల్యం తీరని 16 ఏళ్ల చిన్నారిని ఐదు లక్షలకు అమ్మేశాడు. 65 ఏళ్ల వృద్ధుడైన అరబ్ షేక్ కు ఇచ్చి పెళ్లి జరిపించేశాడు. తీరా పెళ్లి చేసి ఒమన్ దేశానికి పంపించాడు. బాలిక తల్లి ఫిర్యాదు చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ నగరంలోని నవాబ్ సాహెబ్ కుంట ప్రాంతానికి చెందిన బాలిక తల్లి సయీదా ఉన్నిసా తాజాగా తన కూతురును విక్రయించిన విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భర్త సికిందర్. అతని సోదరి గౌసియాలు కలిసి పాతబస్తీకి చెందిన ఓ ఖాజీ సాయంతో బార్కాస్ హోటల్ లో పెళ్లి చేశారని సయీదా ఉన్నీసా పోలీసులకు సమర్పించిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

తన భర్త, అతని సోదరి అరబ్ షేక్ నుంచి 5లక్షల రూపాయలు తీసుకొని ఈ పెళ్లి జరిపించారని ఆమె ఆరోపించారు. పెళ్లయ్యాక తన కూతురి పేరిట పాస్ పోర్టు ఇప్పించి ఓమన్ దేశానికి పంపించారని ఆమె చెప్పారు. తన కూతురు వృద్ధుడితో కలిసి విలాసవంతమైన జీవితం గడుపుతున్నట్లు వీడియో చూపించారని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.తన కూతుర్ని అరబ్ షేక్ కు ఇచ్చి వివాహం చేయడం తనకు ఇష్టం లేదని, తన కూతుర్ని ఒమన్ దేశం నుంచి హైదరాబాద్ కు రప్పించి నిందితులపై చర్యలు తీసుకోవాలని బాలిక తల్లి పోలీసులను వేడుకుంది.దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.చూశారుగా 16 ఏళ్ల అమ్మాయి జీవితాన్ని కన్నతండ్రి ఎలా నాశనం చేశాడో. మరి ఈ ఘటన గురించి అలాగే ఇలా మైనర్ ముస్లిం బాలికలను షేక్ లకు ఇచ్చి పెళ్లి చేసి అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తున్న వారి గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.