బయటపడ్డ బాలసాయిబాబా ఆస్తులు ఎన్ని కోట్లో తెలిస్తే షాక్

429

తెలుగురాష్ట్రాల్లో ఆధ్యాత్మిక గురువు బాల‌సాయి మ‌ర‌ణంతో విషాదం అల‌ముకుంది.. ఆయ‌న భ‌క్తులు బాబా లేరు అనే వార్తతో క‌న్నీరు మున్నీరు అవుతున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు బాల‌సాయి. దోమల్ గూడ ప్రాంతంలోని లోయ‌ర్ ట్యాంక్ బండ్ ద‌గ్గ‌ర ఆశ్ర‌మంలో ఆయ‌న ఉంటున్నారు. ఆశ్రమంలో సోమవారం అర్ధరాత్రి గుండెపోటు రావడంతో హుటాహుటిన హాస్పిటల్ కు తరలించారు. డాక్టర్లు వైద్యం అందిస్తుండగా పరిస్థితి విషమించడంతో మృతిచెందారు బాల‌సాయి.. దీంతో ఆయన అనుచరులు, భక్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. బాల సాయి అతిచిన్న వ‌య‌సులోనే సొంతంగా ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నారు..18 ఏళ్ల వ‌య‌సు నుంచే ఇలా ఆధ్మాత్మిక భావ‌న‌తో ఉన్నారు.

Image result for bala sai
బాల‌సాయికి 18 భాష‌లు వ‌చ్చు… అందులో విదేశీ భాష‌లు కూడా ఉన్నాయి. ఇంగ్లీష్ ఫ్రెంచ్ జ‌ర్మ‌న్ ఫ్రాన్స్ భాష‌లు ఆయ‌న బాగా మాట్లాడ‌తారు త‌నద‌గ్గ‌ర‌కు వ‌చ్చే భ‌క్తుల‌తో వారి భాష‌లో మాట్లాడితే వారికి అర్ధం అవుతుంది అని ..అందుకే త‌న ద‌గ్గ‌ర‌కు విదేశీ భ‌క్తులు ఎక్కువ సంఖ్య‌లో వ‌స్తూ ఉంటారు అని చెబుతారు బాల‌సాయి… ఆయ‌న పేరు మీద వేల‌కోట్ల రూపాయ‌ల ఆస్తులు ఉన్నాయి అని అంటున్నారు.. ఇక హైద‌రాబాద్ బెంగ‌ళూరులో ఆయ‌న పేరు మీద వంద‌ల ఎక‌రాల భూములు స్ధ‌లాలు ఉన్నాయ‌ని చెబుతున్నారు శిష్యులు. ఇక ఆయ‌న ద‌గ్గ‌రకు వ‌చ్చే పెద్ద పెద్ద ధ‌న‌వంతులు, వారు కోరుకున్న కోరిక నెర‌వేరితో, బాబాకు ఆడి బెంజ్ కార్లు బాబాకి గిఫ్ట్ గా ఇచ్చేవారు.. ఇక ఆయ‌న ఆస్తుల గురించి ఎప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చింది అంటే రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగిన స‌మ‌యంలో ఆయ‌న ఓ ప్ర‌క‌ట‌న చేశారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

2014 లో ఆయ‌న ఓ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. న‌వ్యాంధ్రా రాజ‌ధానిగా క‌ర్నూలుని చేస్తే 500 కోట్లు ఇస్తాను అని అన్నారు. అందులో 300 కోట్ల రూపాయ‌లు వెంచ‌ర్లు, 200 కోట్ల క్యాష్ ఇస్తాను అని అన్నారు…దీంతో అప్పుడే ఆయ‌న ద‌గ్గ‌ర వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి అని అంద‌రికి అర్ధం అయింది.కర్నూలుకు చెందిన 59 ఏళ్ల బాల సాయిబాబా 1960 జనవరి 14న జన్మించారు. ఆయన అసలు పేరు కన్ననూరు బాలరాజు. 18 ఏళ్ల వయసులోనే ఆశ్రమం ఏర్పాటు చేశారు…. శివరాత్రి నాడు కడుపులోంచి ఆత్మలింగం బయటకు తీసే ప్రక్రియతో బాగా ప్రాచుర్యం పొందారు. దీంతో ఆధ్యాత్మిక గురువుగా చలామణి అయ్యారు. దేశ విదేశాల్లో ఆయనకు అనుచరగణం భారీ స్థాయిలో ఉన్నారు.తనకు తానుగా బాబాగా ప్రకటించుకున్న బాలసాయి తుంగభద్ర నది ఒడ్డున బాలసాయి సెంట్రల్ సేవా నిలయం స్థాపించారు. ఆయ‌ననా ఏది కోరుకున్న క్ష‌ణాల్లో జ‌రుగుతుంది అని భ‌క్తులు విశ్వ‌సిస్తారు. ఇప్పుడు ఆయ‌న ఆస్తులు అన్నీ ఆయ‌న చారిటీ పేరు మీద ఉన్నాయ‌ట. మ‌రి ఈ విష‌యంలో ఎటువంటి నిర్ణ‌యం శిష్యులు తీసుకుంటారో, ప్ర‌భుత్వం తీసుకుంటుందో చూడాలి. మ‌రి ఆయన అకాల మ‌ర‌ణం పై మీ సంతాపం కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.