పెట్రోల్ బంక్ లో ఎన్ని రకాలుగా మోసం చేస్తారో తెలిస్తే దిమ్మతిరుగుతుంది

442

ప్రతి రోజు ఆఫీసులకు, కాలేజీలకు, ఇతర పనులకి బయటకి వెళ్లేవారికి సొంతంగా వాహనాలు ఉంటే పెట్రోల్ మరియు డీజిల్ కొట్టించడం తిరగడం సహజమే ఇక ఈ క్రమంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెరగడం వల్ల వాహనదారులపై అదనపు భారం పడుతుంది. అలాగా అని మనం మన సొంత వాహనాలు వాడకుండా ఉండలేము ఎందుకంటే మన అవసరాలు అలాంటివి అందుకే పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెరిగిన ఎవరు తమ సొంత వాహనం వాడకుండా ఉండలేదు ఉండలేరు కూడా. ఎక్కడికన్నా వెళ్ళితే సమయం వృధా కాకుండా ఉంటుంది కాబట్టి. అయితే ఇంధనం మీద భారం పడితే ఎవరన్నా భరిస్తారు కానీ మరొక విధంగా భారం పడితే ఎవరు భరించలేరు. అదిఎంటి ఇంధనం ధర భారం పడకుండా మరొకటి భారం ఏంటి అని ఆలోచిస్తున్నారా? అదే అండి పెట్రోల్ బ్యాంకులలో జరిగే మోసాల వల్ల అవును మరి వారు మోసం చేసి పెట్రోల్ తక్కువగా కొడితే ఆలా పదులు , వందల సంఖ్యలో జరిగితే అప్పుడు భారం ఎవరిపై పడుతుంది మన పైనేగా!

Image result for petroleum bunks

ఎలాగో మనం పెరిగిన ఇంధనం ధరల నుంచి తప్పించుకోలేము కానీ పెట్రోల్ బ్యాంకులలో జరిగే మోసాల నుంచి మాత్రం తప్పించుకుందాం. ఇక పెట్రోల్ బ్యాంకులలో జరిగే మోసాల పై మనకు కచ్చితంగా అవగాహనా ఉండాలి.లేకుంటే పెట్రోల్ మరియు డీజిల్ ధరలతో పాటు ఈ మోసం చేసిన డబ్బు కూడా మన నెల వారి ఖర్చులలో పడుతుంది. మరి అలాంటి పెట్రోల్ బంక్ మోసాలలో మొత్తం నాలుగు రకాలు ఉన్నాయి. వాటిలో మొదటిది మన ద్రుష్టి మరల్చడం పెట్రోల్ మరియు డీజిల్ కొట్టించేటప్పుడు రీడింగ్ సున్నా పెట్టి కొట్టిస్తారు అయితే మన ముందు మాత్రం రీడింగ్ సున్నా వేస్తారు కొంచం కొట్టిన తర్వాత మనల్ని మాటలో పెట్టి రీడింగ్ మార్చడం లేదా ఇంధనం తక్కువ కొట్టడం చేస్తారు.దింతో మనకు రావలసిన పెట్రోల్ రాదు కాబ్బటి రీడింగ్ తప్పనిసరి చూడాలి. నాసెల్ ని పదే పదే ప్రెస్ చేయడం పెట్రోల్ బ్యాంకులలో పెట్రోల్ కొట్టేటప్పుడు కొందరు బ్యాంకులలో పని చేసే వారు పదే పదే నాసెల్ ప్రెస్ చేస్తుంటారు. ఇది మనకు అంతగా కనిపించదు ఎందుకంటే మనం రీడింగ్ పైన ద్రుష్టి పెడతాం కనుక అప్పుడు వారు నాసెల్ ప్రెస్ చేస్తూ ఉంటారు దింతో మనకు ఇంధనం మనకు తక్కవ వస్తుంది.ఇక కార్ల సంగతికి వస్తే కొందరు కారు దిగకుండా కొట్టిస్తుంటారు.దీని వల్ల పెట్రోల్ బంకు వర్కర్లు ఇంకా తక్కువ ఇంధనం వేస్తారు.

ఈ క్రింది వీడియో చూడండి

పెద్ద పెద్ద పైపులను వాడడం సాధారణంగా పెట్రోల్ నింపే పైపులు చాలా పెద్దగా ఉంటాయి. ఈ క్రమంలో ఫ్యూయల్ మెషిన్ దగ్గర ఉంటే పైపులు వంగి పోతాయి దీనివల్ల కొంత ఫ్యూయల్ పైపులలో ఆగిపోతుంది. మనకు రావలసిన ఫ్యూయల్ పూర్తిగా రాదు. అయితే దీనిని నివారించాలి అంటే మీ వాహనాన్ని కొంచెం దూరంలో నిలిపి పెట్రోల్ కొట్టించుకోవాలి. కొన్ని పెట్రోల్ బంకులలో మెషిన్లను టాంపర్ చేస్తారు దీనివల్ల ఫ్యూయల్ క్వాంటిటీలో కూడా తేడా వస్తుంది. మనకు రావలసిన మొత్తంలో పెట్రోల్ రాదు. బ్యాంకులలో తక్కువ పెట్రోల్ పోసిన రూ.100 రూ.500 , రూ.1000 కనిపించేలాగా సర్దుబాటు చేస్తారు . ఆలా కాకండా రూ.125 మరియు రూ.575 కు పెట్రోల్ కొట్టించుకుంటే మీరు ఈ మోసాన్ని అరికట్టచ్చు. రౌండ్ ఫిగర్ల జోలికి పోకపోవడం మంచిది. పైన సూచించిన విధానాలు మీరు పాటిస్తే మీరు పెట్రోల్ బంకులు చేస్తున్న మోసాలనుంచి బయటపడ్డాచ్చు ఆలాగే మీరు నాణ్యమైన పెట్రోల్ పొందుతారు . దింతో మీ పెట్రోల్ మరియు డీజిల్ నెలవారీ ఖర్చులు దాటకుండా ఉంటాయి. మరి పెట్రోల్ బంకులలో చేసే మోసాల గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.