కండోమ్ ప్రకటనల విషయంలో ఏయే దేశాల్లో ఎలాంటి నియమాలు పాటిస్తారో తెలిస్తే షాక్..

451

మన దేశంలో కండోమ్ ప్రకటనలు పిల్లలు చూసేందుకు తగినవి కాదంటూ, వాటిని కేవలం రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల మధ్యనే ప్రసారం చేయాలని సమాచార, ప్రసార శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలతో ప్రభుత్వ నియంత్రణ పైన, ఏవి అభ్యంతరకర దృశ్యాలు, ఏవి కావు అన్నదాని పైన మరోసారి చర్చ మొదలైంది.అయితే కండోమ్ వంటి పెద్దలకు మాత్రమే ఉద్దేశించిన ప్రకటనల విషయంలో ప్రపంచంలో వేర్వేరు దేశాల్లోనూ వేరువేరు నియమాలున్నాయి. ఏ సమయంలో వాటిని ప్రసారం చేయొచ్చు అనే దానిపై ఖచ్చితమైన నిబంధనలున్నాయి.మరి ఏ దేశంలో ఎలాంటి నియమాలు ఉన్నాయో చూద్దామా.

Image result for candoms

బ్రిటన్: యూకేలో ఫ్రీ-టు-ఎయిర్ చానెళ్లు పూర్తిగా పిల్లలు చూడరాని దృశ్యాలను రాత్రి 9 నుంచి ఉదయం 5.30 గంటల మధ్య మాత్రమే ప్రసారం చేయొచ్చు. ప్రీమియమ్ చానెళ్ల విషయానికి వస్తే ఇది కొంచెం ముందు – అంటే రాత్రి 8 గంటలకు మొదలై, ఉదయం 5.30 గంటలకు ముగుస్తుంది.

Image result for candoms

అమెరికా: ‘యునైటెడ్ స్టేట్స్ ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్’ (ఎఫ్‌సీసీ) టీవీలో ప్రసారం చేసే దృశ్యాల ప్రమాణాలను నిర్దేశిస్తుంది. ఎఫ్‌సీసీ నియమాల ప్రకారం ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల మధ్య ఎలాంటి అభ్యంతరకర దృశ్యాలను ప్రసారం చేయడానికి వీలులేదు.’అభ్యంతరకర దృశ్యాలు’ అంటే ఏవైనా లైంగికపరమైన దృశ్యాలని ఎఫ్‌సీసీ నియమాలు పేర్కొంటున్నాయి. అయితే అభ్యంతరకర దృశ్యాలను పూర్తిగా నిషేధించలేమని అమెరికా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.

Image result for candoms

చైనా: టీవీల్లో ప్రసారమయ్యే అంశాలపై చైనాలో అతి కఠినమైన, సమగ్రమైన మార్గదర్శకాలు ఉన్నాయి. బ్రాడ్‌కాస్టింగ్ అండ్ టెలివిజన్ అడ్మినిస్ట్రేషన్ నియమాల చట్టంలోని ఆర్టికల్ 32 టీవీల్లో అభ్యంతరకర దృశ్యాల గురించి వివరిస్తుంది.అశ్లీల, మూఢనమ్మకాలు, హింసను ప్రేరేపించే దృశ్యాలను చూపించే కార్యక్రమాలను టీవీల్లో నిషేధించాలని ఈ చట్టం పేర్కొంటుంది. కండోమ్స్ లేదా సెక్స్-సంబంధిత ఉత్పత్తుల ప్రకటనపై చైనాలో ప్రత్యేకించి ఏ చట్టమూ లేనప్పటికీ, ఆ ప్రకటనల్లోని అశ్లీల దృశ్యాల విషయంలో మాత్రం నియమాలను అనుసరించాలి.

Image result for candoms

ఆస్ట్రేలియా: బ్రాడ్‌కాస్టింగ్ సర్వీసెస్ చట్టం 1992 ప్రకారం, పిల్లలకు హాని కలిగించే దృశ్యాలను ఆస్ట్రేలియాలో ఉదయం 5 నుంచి రాత్రి 8.30 గంటల మధ్య ప్రసారం చేయకూడదు. టీవీల్లో ప్రసారమయ్యే ప్రకటనలు మరీ అతిగా, అభ్యంతరకరంగా ఉండనంత వరకు కండోమ్స్ లేదా అలాంటి ఉత్పత్తుల ప్రసారాలను నిషేధించరు. అయితే మరీ అభ్యంతరకరంగా ఉండే ప్రకటనల విషయంలో మాత్రం కొన్ని నిర్దిష్టమైన చర్యలు తీసుకుంటారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఇదేనండి కొన్ని ముఖ్యదేశాలలో కండోమ్ యాడ్స్ మీద ఉన్న కొన్ని ఖచ్చితమైన నియమాలు.ఇలాంటి నియమాలు మనం దేశంలో కూడా ఉంటె బాగుంటుంది కదూ.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.కండోమ్ యాడ్స్ మీద అలాగే మన దేశంలో కండోమ్ యాడ్స్ విషయంలో పాటించే నియమాల గురించి అలాగే పైన చెప్పిన దేశాలలో పాటించే నియమాల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.