కేరళలో జరిగిన ఈ అధ్బుతం గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు

465

కేరళలో ఇటీవల సంభవించిన జల ప్రళయం గురించి అందరికీ తెలిసిందే. వందలాది మంది ప్రాణాలు కోల్పొయారు. అయితే కొన్ని మానవ తప్పిదాల వల్లే ప్రకృతి ఇలా ప్రకోపం చూపించింది. ఇప్పుడిప్పుడే కేరళ మళ్లీ కోలుకుంటుంది. గత శతాబ్ద కాలంలో ఎప్పుడూ లేని విధంగా కేరళలో వరదలు సంభవించాయి.కేరళ వరదలప్పుడు చాలా ఆసక్తికర ఘటనలు చోటుచేసుకున్నాయి. అందులో ఒకటి కాస్త ప్రత్యేకంగా ఉంది.ఆ ఘటన చూస్తే మీరు షాక్ అవ్వడం గ్యారెంటీ.మరి ఆ ఘటన గురించి తెలుసుకుందామా.

Image result for kerala flood

కేరళలోని మున్నార్ ప్రాంతంలో ముతిరాపుజ్హ నదిలో ఒక పెద్ద రాయి కనపించింది.ఆ రాయి చూడటానికి ఎలా ఉందంటే అది ఒక పెద్ద మనిషి యొక్క చెయ్యిలాగా ఉంది.. మనిషి మొత్తం మునిగి కేవలం చెయ్యి ఒక్కటే పైకి ఎత్తినట్లుగా ఆ శిల కనిపించింది.చాలా మంది దాన్ని దూరం నుంచి మనిషి చేయి అనుకున్నారు.కొందరు ఫొటోగ్రాఫర్లు దాన్ని ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది వైరల్ గా మారింది.ఆ బండరాయి ఎలా ఉందంటే బాహుబలిలో నీళ్ల మధ్యలో శివగామి చెయ్యి ఉంటుంది కదా అలా ఉంది.దీనిని చుసిన చాలా మందికి బాహుబలి సినిమా గుర్తుకు వచ్చింది.అయితే స్థానికులు చేతి ఆకారంలో ఆ పెద్ద బండను దేవుడిలా చూస్తున్నారు. అది మున్నార్ ను రక్షించిన “దేవుని చేయి” అంటూ ప్రజలు కొలుస్తున్నారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

జల ప్రవాహాన్ని అడ్డుకుంటూ మీకు నేనున్నానంటూ అభయమిస్తున్నట్లుగా అనిపిస్తుంది ఆ పెద్ద కొండరాయిని చూస్తుంటే బాహుబలిలో మహేంద్ర బాహుబలిని కాపాడటానికి శివగామి ఎలా చెయ్యి ఎత్తిందో ఇక్కడ ఆ బండరాయి కూడా మున్నార్ ను కాపాడటానికి చెయ్యి అలాగే ఎత్తింది అని అనుకుంటున్నారు.అయితే కేరళలో వర్షాలు తగ్గినా ఆ నది ప్రవాహం మాత్రం తగ్గలేదు.గత కొన్ని రోజులుగా ఆ నదిలో ఆ బండరాయి అలాగే కనిపిస్తూ ఉంది. మీరు మున్నార్ వెళ్తే కొచ్చి-డాన్షుకోడి బైపాస్ బ్రిడ్జ్ పై నుంచి దీన్ని చూడొచ్చు.వెళ్తే తప్పక చూడండి.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.కేరళలో వచ్చిన ప్రళయం గురించి అలాగే మున్నార్ ను కాపాడుతున్న ఈ పెద్ద శిల గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో చెప్పండి.