క్యామెల్ గ‌ర్ల్ ఈమె గురించి తెలిస్తే షాక్

335

ఎల్లా హెర్బ‌ల్ జ‌న‌వ‌రి 05 1870న జ‌న్మించింది..ఆమె జ‌న‌నం గురించి ఎందుకు అనుకుంటున్నారా ఆమె ఏమైనా పెద్ద సెల‌బ్రెటీనా ఎందుకు ఆమె గురించి అనుకుకుంటున్నారు క‌దా మ‌న చ‌రిత్ర‌లో ఎంద‌రో క‌ష్ట‌ప‌డి పైకి వ‌చ్చిన వారుఉంటారు వారి జీవితంలో ఎదురైన అనుభ‌వాలు వారి క‌ష్టాలు చెప్పుకుంటారు అవే వ‌చ్చే త‌రాల వారికి మార్గంగా కూడా మార‌తాయి. ఇక ఎల్లా గురించి చెప్పుకుంటే ఆమె వేళ్ల‌కు కాళ్ల‌కు సంబంధించి స‌మ‌స్య‌ల‌తో పుట్టింది.

Image result for Camel Girl

ఆమె జ‌న్యుప‌ర‌మైన స‌మస్య‌ల‌తో జ‌న్మించ‌డం వ‌ల్ల ఆమె మోకాళ్లు వెన‌క్కి తిరిగి ఉంటాయి దీంతో ఆమె న‌డ‌వ‌డంలో ఎంతో ఇబ్బంది ప‌డేది త‌ర్వాత ఆమెకు ఇలా న‌డ‌క అల‌వాటు అయింది. ఆమెని అంద‌రూ క్యామెల్ గ‌ర్ల్ అని పిలిచే వారు… 1886లో వైహ‌వీస్ అనే స‌ర్క‌స్ లో ఆమె ఓ స్టార్ గా వెలుగు వెలిగింది.. ఇక స‌ర్క‌స్ గురించి వార్త ప్ర‌చురించిన స‌మ‌యంలో ఆమె గురించి వార్త ప‌త్రిక క‌థ‌నం రాసింది.. నేను చేతులు కాళ్లు సాయంతో న‌డుస్తాను, అందుకే ఇలా పిలుస్తారు.. నాకు న‌డ‌క‌కు ఇబ్బంది లేదు అని చెప్పింది. ఇక స‌ర్క‌స్ లో ప‌ని చేసి స్కూల్ లో టీచ‌ర్ గా చేర‌తా అని చెప్పింది.. ఇక వారానికి 200 డాల‌ర్లు సంపాదంచింది అప్ప‌ట్లో బాగానే ఆమె డ‌బ్బులు సంపాదించింది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

త‌ర్వాత రాబ‌ర్డ్ అనే వ్య‌క్తిని పెళ్లి చేసుకుని ఓ బిడ్డ‌కు జ‌న్మనిచ్చింది… ఇక ఆ స‌మ‌యంలో తన బిడ్డ కూడా ఆమెని చూడ‌టానికి భ‌య‌ప‌డేవాడు త‌ర్వాత త‌ల్లి ప్రేమ చూపించ‌డం ఆ బిడ్డ‌ని దగ్గ‌ర‌కు ఎక్కువ‌గా తీసుకోవ‌డంతో ఆ బిడ్డ‌పై కూడా ప్రేమ పెరిగింది. ఇక ఆమె 1921 డిసెంబ‌రులో చ‌నిపోయింది.. ఇక ఎప్పుడూ ఇంట‌ర్యూలు ఇచ్చినా త‌న కుటుంబం అండ‌గా ఉంది అని, అందుకే తాను ఇంత‌కాలం ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్ర‌తికాను అని చెప్పింది. చూశారుగా కుటుంబం నుంచి స‌పోర్ట్ ఉంటే వారు ఏదైనా సాధిస్తారు అని చెప్ప‌డానికి ఈమె జీవితం ఓ ఉదాహ‌ర‌ణ మ‌రి దీనిపై మీ అభిప్రాయం కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.