ట్రాఫిక్ రూల్స్ పక్కాగా పాటిస్తే సినిమా టికెట్లు ఫ్రీ.. హైదరాబాద్ పోలీసుల గిఫ్ట్

153

ట్రాఫిక్ సిగ్నల్స్ ను ఉల్లంఘిస్తూ ప్రమాదాలకు కారణమవుతున్న వారు హైదరాబాద్ లో చాలా మంది కనిపిస్తారు.హైదరాబాద్ జంటనగరాల్లో ట్రాఫిక్ ఎంతో అస్తవ్యస్తంగా మారింది. దాంతో చాలామంది వాహనదారులు ఇష్టం వచ్చినట్టు వెహికల్స్ ను నడుపుతుంటారు. అయితే కొందరు మాత్రం పక్కాగా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తుంటారు. ఇలా ట్రాఫిక్ నిబంధనలు పక్కాగా పాటిస్తే హైదరాబాద్ పోలీసులు సినిమా చూపిస్తున్నారు.. సినిమా అంటే మరేదో అనుకోవద్దు. అలాంటి వారిని అభినందిస్తూ మూవీ టికెట్లు గిఫ్ట్‌గా ఇస్తున్నారు. హైదరాబాద్‌ నగర పౌరుల్లో ట్రాఫిక్ నిబంధనల విషయంలో అనూహ్య మార్పు వచ్చిందని చెబుతున్నారు. నిబంధనలను పాటించే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుండటంతో పోలీసులు కూడా తమ శైలి మార్చారు. ట్రాఫిక్ రూల్స్ తూ.చ. తప్పకుండా పాటిస్తున్న వాహనదారులకు ప్రోత్సాహకాలతో సర్‌ప్రైజ్ చేస్తున్నారు. బుధవారం (ఆగస్టు 7) జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వద్ద స్పెషల్ డ్రైవ్ నిర్వహించి పలువురు వాహనదారులను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తారు.

ఈ క్రింద వీడియో చూడండి

పెండింగ్ చలాన్లు లేని, ట్రాఫిక్ నిబంధనలను తూ.చ. తప్పకుండా పాటిస్తున్న పలువురు బైకర్లను పోలీసులు అభినందించారు. వారికి ప్రోత్సాహకంగా సినిమా టికెట్లు అందజేశారు. ట్రాఫిక్ విభాగం అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ పాటించేలా అవగాహన కలిపించాలని ఆయన వాహనదారులను కోరారు. ట్రాఫిక్ రూల్స్ పాటించిన వారికి గులాబీ పువ్వుతో పాటు సినిమా టికెట్ ను కూడా ఆయన బహుమతిగా అందించారు. ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ఈ సందర్భంగా సిపి నగర ప్రజలకు సూచించారు. ట్రాఫిక్ రూల్స్ పాటించి ప్రమాదాలను నివారించాలని, అతివేగం వద్దని ఆయన పేర్కొన్నారు.

Image result for traffic polices

ప్రజల్లో ట్రాఫిక్ నియమ, నిబంధనలపై అవగాహన బాగా పెరిగిందని అనిల్ కుమార్ తెలిపారు. గతంలో టూవీలర్ వాహనదారుల్లో కేవలం 30 శాతం మంది మాత్రమే హెల్మెట్ ధరించి వాహనాలు నడిపేవారని కానీ, ఇప్పుడు ఆ సంఖ్య 90 శాతానికి చేరిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ట్రాఫిక్ రూల్స్ విషయంలో వాహనదారుల్లో వచ్చిన మార్పునకు ఆయన సంతోషం వ్యక్తం చేశారు. నిజంగా ఇది సంతోషించాల్సిన విషయం. ఎందుకంటే చాలామంది ప్రాణాలు ఈ ట్రాఫిక్ నిబంధలను పాటించకపోవడం వల్లనే జరుగుతున్నాయి. ఇలా ప్రజలలో మార్పు రావడం మంచి పరిణామమే అని చెప్పుకోవాలి. మరి ట్రాఫిల్ రూల్స్ విషయంలో ప్రజల్లో వచ్చిన ఈ మార్పుల మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.