అలెర్ట్: కొత్త ట్రాఫిక్ రూల్స్.. తెలియకుంటే జైలుకే

508

రోజు రోజుకూ రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. రహదారి నియమాలను ఉల్లఘించే వారి సంఖ్య పెచ్చుమీరడమే ఇందుకు ప్రధాన కారణమని భావించిన రహదారి మంత్రిత్వ శాఖ రహదారి నియమాల ఉల్లంఘనదారులకు భారీ జరిమానా విధించడం మరియు లైసెన్స్ రద్దు చేయడం వంటివి పరిచయం చేసింది

మద్యం సేవించి వాహనం నడిపితే 7 రోజులు జైల్వ్యవస్థలో ఎంతకీ మార్పు రాకపోవడంతో మద్యం సేవించి వాహనాలు నడిపేవారిని లక్ష్యంగా చేసుకుని అత్యంత కఠినమైన రూల్స్ అమల్లోకి తీసుకొచ్చారు. అయినప్పటికీ, ఎలాంటి ఆశించిన మార్పు రాలేదు. దీంతో తాజాగా మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడితే ఎలాంటి జరిమానా లేకుండా బెయిల్ రహిత 7 రోజుల జైలు శిక్ష విధించే చట్టాన్ని అమల్లోకి తీసుకురానున్నాయి.అయితే, డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే, 10,000 రుపాయలు జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష వీటితో పాటు మూడు నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడం. పునరావృతం అయితే, రెండు సంవత్సరాలు జైలు శిక్ష మరియు లైసెన్స్‌ను రద్దు చేయనున్నట్లు మంత్రివర్గం ప్రతిపాదించింది

మద్యం సేవించి వాహనం నడిపితే 7 రోజులు జైల్ఈ నేపథ్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులకు పుల్‌స్టాప్ పెట్టేందుకు గోవా రాష్ట్ర పోలీసులు ఒక నూతన అభిప్రాయంతో ముందుకొచ్చారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల నుండి తప్పించుకునేందుకు జరిమానా ఎంతైనా చెల్లించి తప్పుకోవాలని చూస్తారు. జరిమానా ద్వారా ఎలాంటి మార్పు ఉండబోదు.కాబట్టి, డ్రంక్ అండ్ డ్రైవ్ ఉల్లంఘనలను పూర్తి స్థాయిలో అరికట్టేందుకు గోవా మోటార్ వాహనాల చట్టంలో పలు మార్పులు చేర్పులు నిర్వహించాలని గోవా పోలీస్ విభాగం ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.
మోటార్ వాహనాల చట్టంలో మార్పులకు గోవా ప్రభుత్వం అంగీకరిస్తే, డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టబడిన వారికి ఎలాంటి బెయిల్ మరియు జరిమానా లేకుండా ఏడు రోజుల పాటు జైలు శిక్ష విధిస్తారు. ఉల్లంఘనదారులు 7 రోజుల పాటు జైలు గోడల మధ్య శిక్ష పూర్తిచేసుకున్న అనంతరం బెయిల్ వర్తిస్తుంది.

డీజీపీ ముక్తేశ్ చందర్ మీడియాతో మాట్లాడుతూ, “డ్రంక్ అండ్ డ్రైవ్ క్షమించరాని నేరం, అందుకే ఈ కేసులను కోర్టు వరకు తీసుకెళుతున్నాం. కానీ, కోర్టులు మాత్రం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల పట్ల చాలా సున్నితంగా వ్యవహరిస్తున్నాయి. లైసెన్స్ రద్దు చేయడం, జరిమానా విధించడం మరియు జైలు శిక్ష విధించే అధికారం కోర్టుకు ఉంది. కానీ ఇప్పటి వరకు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వారు ఒక్కరాత్రి కూడా జైలు శిక్ష అనుభవించిన దాఖలాలులేవు.”మద్యం సేవించి వాహనాలు నడిపిన కేసులో దోషులుగా గుర్తించిన వారికి హైదరాబాదా, బెంగళూరు మరియు ముంబై వంటి నగరాల్లో జైలు శిక్షను అమలు చేస్తున్నపుడు. గోవాలో ఎందుకు సాధ్యం కాదని వివరించాడు. అందుకే బెయిల్ రహిత 7 రోజుల జైల్ శిక్ష నియమాన్ని అమలు చేయాలని” ఆయన చెప్పుకొచ్చాడు.