ఇలా చేస్తే సీక్రెట్ కెమెరాల నుంచి తప్పించుకోవచ్చు

427

కొత్త బట్టలు కొనడానికి ఫ్రెండ్స్ తో గాని, ఫ్యామిలీ తో గాని సరదాగా షాపింగ్ కు వెళ్తే… కొత్త కొత్త బట్టలు ట్రై చేసి.. అందులో బాగా నచ్చినవి కొనుగోలు చేస్తాం. ఇంత వరకు బానే ఉంటుంది…. కాని కొన్ని రోజుల తరువాత మీరు ట్రయల్ రూమ్ లో కొత్త బట్టలు ట్రై చేసేటప్పుడు తీసిన వీడియో ఇంటర్నెట్ లో వస్తే దానిని మించిన షాక్ మరొకటి ఉండదు. సరదగా షాపింగ్ చేసిన ఆ రోజు మీకు పీడకలగా మారే అవకాశాలు ఉన్నాయి. ఈ మధ్య ఆడవారి మానం విషయంలో ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి. ఇలాంటి విషయాలు ఆ షాపు యజమానులకు కూడా తెలిసుండకపోవచ్చు.అయితే రహస్య కెమరాలు ఎక్కడ పెట్టారో కూడా తెలియదు మనకు.అయితే ఇప్పుడు ఒక రహస్య కెమెరా గురించి అలాగే వాటి బారి నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో చెబుతా వినండి.

Image result for secret camera

ప్రస్తుత కాలంలో ఆడవారు ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మీరు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అంతే సంగతులు.ఇది ఏమిటో చెప్పండి. హ ఏముంది led బల్బ్ అంటారు కదా.కానీ కాదు అదొక సీక్రెట్ కెమెరా. ఇది చాలా అత్యంత్య ప్రమాదకర కెమెరా.ఇందులో మెమరీ కార్డు చిప్ ఒకటి ఉంటుంది.ఈ కెమెరా బల్బ్ వలన మీకు తెలియకుండానే మీరు ప్రమాదంలో పడే అవకాశం ఉంది.వీటిని షాపింగ్ మాల్స్ లలో లేడీస్ డ్రెస్ చేంజ్ చేసుకునే ప్రదేశాలలో హోటల్ రూమ్స్ లలో పెడుతున్నారు.దీని వలన ఆడవారు ఇబ్బందులకు గురవుతున్నారు.దీనిని బల్బ్ అనుకుని ఆడవారు డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నారు. ఈ విషయం తెలియక మనం చేసే పనులన్నీ అందులో రికార్డ్ అవుతుంది.ఆ తర్వాత వాటిని అశ్లీల సైట్ లలో పెట్టి బిజినెస్ చేసుకోవడం అనేది సర్వసాధారణం అయ్యింది.లేదా ఆ వీడియోలో ఉన్న అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చెయ్యడం కూడా జరుగుతుంది.కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అయితే ఇలాంటి కెమెరాలను ఎలా గుర్తించాలి అంటే.. ట్రయల్ రూమ్ లో హిడెన్ కెమెరా ఉంటె మీ ఫోన్ ద్వారా ఎవరికైనా కాల్ చేసి చూడండి. ఒకవేళ సిగ్నల్ ప్రాబ్లం వచినా లేక కాల్ డ్రాప్ అయినా అక్కడ ఏదో అపాయం ఉన్నట్టే.అలాగే కొన్ని టూ వే మిర్రర్స్ ఉంటాయి.వీటి ద్వారా కూడా ఆడవాళ్ళ వీడియోలను తీస్తుంటారు.ఇది చూడడానికి అచ్చం అద్దంలానే ఉంటుంది. కాని ఈ అద్దం మరోవైపునుండి స్పష్టంగా చూడవచ్చు. ట్రయల్ రూమ్ లో ఉన్న అద్దం టూ-వే మిర్రరా కాదా అని తెలుసుకోవడం చాలా తేలిక. ఆ అద్దం పైన మీ వేలుని ఆనించండి. ఒకవేళ మీ వేలు.. అద్దంలో కనిపిస్తున్న ప్రతిబింబం రెండు కలిసినట్టు ఉంటె అది టూ-వే మిర్రర్ అని అర్ధం. అలా కాకుండా మీ వేలు అద్దంలో కనిపిస్తున్న ప్రతిబింబం మధ్యలో గ్యాప్ ఉంటె అది నిజమైన అద్దం అని అర్ధం. ఈ విషయంలో కన్ఫ్యూజ్ కాకండి. గ్యాప్ ఉంటె నిజమైన అద్దం. గ్యాప్ లేకుంటే టూ-వే మిర్రర్.ఇలా జాగ్రత్తలు తీసుకోండి లేకుంటే నాశనము అయ్యేది మీ జీవితమే.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.కొత్తగా వచ్చిన ఈ led బల్బ్ రహస్య కెమెరా గురించి అలాగే డ్రెస్ చేంజ్ చేసుకుంటున్న సమయంలో ఆడవారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కామెంట్ రూపంలో రాసి అందరికి తెలియజేయండి.