తమ కంటే అందంగా ఉందని బెస్ట్ ఫ్రెండ్ ను ఈ ఇద్దరు అమ్మాయిలు ఏం చేశారో తెలిస్తే షాక్

136

మీ స్నేహితులను మీరు ఎక్కువగా ఇష్టపడుతున్నారా. .వాళ్ళతోనే ఎక్కువ సమయం గడుపుతున్నారా.. అసలు మీ స్నేహితుల లిస్ట్ లో ఎంత మంది మీ మంచి కోరే వారు ఉన్నారు. మీ స్నేహితులతో కొంచెం జాగ్రత్త..ఇవన్నీ ఎందుకు చెప్తుంది అనుకుంటున్నారా..ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ వింటే మీకే అర్థం అవుతుంది. ‘‘ప్లీజ్.. అమ్మతో అర్జంటుగా మాట్లాడాలి. నా ఫోన్‌లో టాప్అప్ వేయించు. డబ్బులు చాలా తక్కువగా ఉన్నాయి’’ అంటూ తన స్నేహితురాలి ఫోన్‌కు మెసేజ్ పంపిన ఆమె.. ఆ తర్వాత రోజు శవమైంది. తల్లిదండ్రులు సైతం గుర్తుపట్టలేనంతగా ముఖం చిధ్రమై.. ఒళ్లంతా గాయాలతో అత్యంత ధీనస్థితిలో కనిపించింది. ఆమెకు ఈ దుస్థితి కల్పించింది మరెవరో కాదు.. ఆమె స్నేహితురాళ్లే. అసలు ఆ స్నేహితులకు ఆమెకు మధ్య ఏం జరిగింది. ఆమెను ఎందుకు చంపారు. అసలేమైంది. ఇప్పుడు పూర్తీగా తెలుసుకుందాం.

Image result for beautiful girls

రష్యాలోని అర్ఖంగెల్స్క్‌లో నివసిస్తున్న విక్టోరియా అవెరినా (17) అలియాస్ వికాకు 16 ఏళ్ల లీనా, ఇరినా అనే స్నేహితులు ఉన్నారు. ఆమె ఎప్పుడు వారితోనే కలిసి తిరుగుతుండేది. వారి మధ్య ఏమైందో ఏమో, ఓ రోజు లీనా, ఇరినాలు.. వికాను పాడుబడిన భవనానికి పిలిచారు. అనంతరం గాజు సీసాలను వీకా ముఖంపై కొట్టారు. పగిలిన గాజు పెంకులతో వికా ముఖాన్ని గుర్తుపట్టని విధంగా చెక్కేశారు. అనంతరం గొంతు నులిమి చంపి ఇంటికి వెళ్లిపోయారు. వికా కనిపించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. జాగిలాలతో శోధించగా పాడుబడిన బంగళా సమీపంలోని పచ్చిక బయళ్లలో ఆమె శవం లభ్యమైంది. విచారణలో భాగంగా పోలీసులు కొన్ని ఆధారాలు సేకరించారు. హత్యకు ముందు ఆమె లీనా, ఇరీనాలతో మాట్లాడినట్లు ఫోన్ కాల్స్ ఆధారంగా తెలుసుకున్నారు. అనంతరం ఆ ఇద్దరిని అనుమానస్పద నిందితులుగా అదుపులోకి తీసుకున్నారు. విచారణలో లీనా, ఇరీనా చేసిన నేరాన్ని అంగీకరించారు.

ఈ క్రింది వీడియో ని చూడండి

విచారణలో లీనా, ఇరీనా విస్తుగొలిపే విషయాలు చెప్పారు. ఆమె తమకంటే ఎక్కువ అందంగా, ఆకర్షనీయంగా ఉంటుందని, ఆమె తన అందం చూసుకుని తమని ఎప్పుడూ హేళన చేసేదన్నారు. ఆ ప్రవర్తన నచ్చకపోవడం వల్లే ఆమెకు బుద్ధి చెప్పాలనుకున్నామని తెలిపారు. అయితే, పోలీసులు దీని వెనుక వేరే కారణాలు ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ హత్యకు మరో వ్యక్తి సహకరించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై మరో స్నేహితురాలు స్పందిస్తూ.. ‘‘వికా ఆ ఇద్దరితో చాలా సన్నిహితంగా మెలిగేది. శరీర ఆకృతిలో వికా కంటే లీనా, ఇరీనాలు భారీగా ఉండేవారు. గుండాల్లా ప్రవర్తించేవారు. వికా అందంగా ఉంటుందనే మాట వాస్తవమే. కానీ, అదే ఆమె హత్యకు కారణం అంటే నమ్ముబుద్ధి కావడం లేదు. చనిపోడానికి ముందు వికా నాకు మెసేజ్ పంపింది. తన మొబైల్‌లో టాప్‌అప్ వేయాలని కోరింది. అమ్మకు అర్జంటుగా ఫోన్ చేయాలని, తన ఫోన్లో డబ్బులు లేవని మెసేజ్‌లో తెలిపింది’’ అని పేర్కొంది. ఈ నేరం రుజువైతే లీనా, ఇరీనాలకు 15 ఏళ్ల జైలు శిక్ష విధించే అవకాశాలున్నాయి. చూశారుగా అందంగా ఉందని ఎలా చంపేశారో.. కాబట్టి మీరు కూడా మీ స్నేహితులతో కాస్త జాగ్రత్తగా ఉండండి. మరి అందంగా ఉందని అమ్మాయిని చంపేసిన ఈ ఘటన గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.