టాయ్లెట్ గోడపై ఫోన్ నెంబర్ ఉందని ఫోన్ చేస్తే…చివరికి ఏమైందో తెలిస్తే షాక్!

317

మనం ఏదైనా చేసే ముందు ఒక్కసారి అది తప్పో ఒప్పో అని ఒక్కసారి ఆలోచించండి.ఎందుకంటే మనం చేసే దాని వలన ఇతరులకు చాలా నష్టం జరగవచ్చు.కొంతమంది ఆకతాయి కుర్రాళ్ళు చేసే పనుల వలన మహిళలు ఎదుర్కొనే సమస్యలు ఎన్నో ఉంటాయి.ఇప్పుడు ఒక మహిళ ఇలాంటి సమస్యనే ఎదుర్కొంది.స్టూడెంట్స్ అని నీతి మాటలు చెబితే టీచర్ అని కూడా చూడకుండా దారుణానికి ఒడిగట్టారు.మరి ఆ విషయం గురించి పూర్తీగా తెలుసుకుందామా.

అది కర్ణాటకలోని నెల మంగళ గ్రామం.ఆ గ్రామంలో ఒక స్కూల్ టీచర్ ఉంది.ఆమె అక్కడ దగ్గరలో ఉండే ఒక స్కూల్ లో ప్రయివేట్ టీచర్ గా పనిచేస్తుంది.అయితే ఆమె ఇంటికి దగ్గరలోనే ఆమె స్టూడెంట్స్ కొంతమంది ఉంటారు.ఆ స్టూడెంట్స్ ఫామిలీలతో నివసిస్తారు.అయితే మొన్నీమధ్యనే ఆ స్టూడెంట్స్ కు టీచర్ కు మధ్య ఒక చిన్న ఇష్యు జరిగింది.స్టూడెంట్స్ రోడ్డు మీద అమ్మాయిలను ఏడిపిస్తుండగా ఆ టీచర్ చూసింది.తన స్టూడెంట్స్ అలా చెయ్యడం ఆటీచర్ కు నచ్చలేదు.అందుకే నడిరోడ్డు అని కూడా చూడకుండా వాళ్ళను అక్కడే చెడామడా తిట్టేసింది.దానికి ఆ స్టూడెంట్స్ టీచర్ మీద కోపం పెంచుకున్నారు.

అయితే అందరు కాసేపు కోపంలో ఉన్నా కానీ తర్వాత ఆలోచించారు మనం చేసిన తప్పుకు కదా టీచర్ కొట్టిందని.ఆలోచించి టీచర్ మీద కోపాన్ని వదిలేసుకున్నారు.కానీ అందరు వదిలేసినా ఒక్కడు మాత్రం ఆ కోపాన్ని అలాగే ఉంచుకున్నాడు.టీచర్ మీద ఎలాగైనా కోపం తీర్చుకోవాలనుకున్నాడు.ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్న సమయంలో ఆ కుర్రాడికి ఒక నీచపు ఆలోచన వచ్చింది.అదేమిటి అంటే..టీచర్ క్యారెక్టర్ ను బ్లేమ్ చెయ్యాలనుకున్నాడు.అందుకోసం ఒక మాష్టర్ ప్లాన్ వేశాడు.ఆ టీచర్ ఫోన్ నెంబర్ ను బస్టాండ్ దగ్గర ఉన్న టాయిలెట్ గోడ మీద రాశాడు.మీకు నేను కావాలంటే ఈ నెంబర్ కు ఫోన్ చెయ్యండి అని రాసి పెట్టాడు.

దీనిని చుసిన వాళ్ళు కొంతమంది వదిలేసి పోతే కొందరు ఆకతాయిలు మాత్రం ఆమెకు ఫోన్ చేశారు.ఒకడు మాత్రం మహిళకు పదే పదే ఫోన్‌ చేసి అసభ్య కరమైన పదజాలం ప్రయోగించాడు.అతని మాటలకు విసిగిపోయి తన ఫోన్‌కు గుర్తు తెలియని వ్యక్తి కాల్‌ చేసి అసభ్య కరమైన మాటలతో వేధిస్తున్నాడని మహిళ కుటుంబ సభ్యులకు తెలిపింది. పక్కా ప్రణాళిక ప్రకారం యువతితోనే సదరు యువకుడికి ఫోన్‌ చేయించి పిలిపించారు.నిజమేననుకుని వచ్చిన యువకుడిని పట్టు కుని చెప్పులతో చితకబాదారు.అసలు ఈ నెంబరు ఎలా లభించిందని ఆరా తీస్తే టాయ్‌లెట్‌ గోడపై ఉందని అందుకే కాల్‌ చేశానని తనను క్షమించాలని యువకుడు వేడుకోవడం కొసమెరుపు. నెల మంగల పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడితే ఇదంతా జరగడానికి కారణం ఆమె స్టూడెంట్ అని తెలిసింది.నేను మీ మంచి కోసమే చెప్పాను.ఇలా కోపం పెంచుకుని ఇంకా తప్పులు చేస్తారని అనుకోలేదని ఆ టీచర్ స్టూడెంట్ దగ్గర అన్నది.స్టూడెంట్ కాబట్టి వదిలేయండని ఆమె పోలీసులకు చెప్పడంతో ఇంకెప్పుడు ఇలా చెయ్యొద్దని పోలీసులు వార్నింగ్ ఇచ్చి పంపించారు.టీచర్ మంచి మనసు అర్థం చేసుకుని క్షమాపణలు అడిగాడు.విన్నారుగా టీచర్ మీద కోపంతో ఆ స్టూడెంట్ ఎంతటి పని చేశాడో.ఎవరైనా మంచి కోసమే చెప్తారు.అలా అని మనల్ని ఏమో అన్నారని ఇంకొక తప్పు చేస్తే ఎలా చెప్పండి.కాబట్టి ఇలా చేసేముందు ఒక్కసారి ఆలోచించండి.మరి ఈ ఘటన గురించి మీరేమంటారు.ఆ స్టూడెంట్ చేసిన పని గురించి అలాగే దాని మూలాన ఆ టీచర్ ఎదుర్కొన్న సమస్యల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.