తల్లి, బిడ్డకు చనుబాలు ఇవ్వకపోతే ఆ పాలు ఏమవుతాయి?

424

ఈ ప్రపంచంలో కమ్మనైన పదం ఏదైనా ఉందంటే అది అమ్మ అనే పదమే అని చెప్పుకోవాలి.తల్లిని మించిన దైవం లేదని అంటారు.తల్లిని మించి మన మీద ప్రేమను ఎవరు చూపలేరు.ప్రతి స్త్రీ తల్లి కావాలనుకుంటుంది.అయితే ఆ అదృష్టం దక్కక కొంతమంది పడే బాధ వర్ణనాతీతం.వాళ్ళ సంగతి ఒకలా ఉంటె బంగారం లాంటి పిల్లలకు జన్మనిచ్చిన తలల కథ వేరే ఉంది. బిడ్డకు ఆరోగ్యాన్ని ఇచ్చేవి తల్లిపాలే అని అందరికి తెలుసు. కానీ కొంత మంది తల్లులు స్టైల్ కు పోయి బిడ్డకు చనుబాలు ఇవ్వరు. అందం తరగిపోతుందని కొందరు మరికొందరు వేరే కారణాల వలన చనుబాలు ఇవ్వరు. అయితే మీకెప్పుడైనా అనుమానం వచ్చిందా..మీరు చనుబాలు ఇవ్వకపోతే ఆ పాలు ఏమవుతాయి? దీని గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అవేమవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Image result for mother feeding

కొంతమంది తల్లులు చనుబాలు ఇస్తుంటే, మరికొంతమంది వేరే పద్ధతులను ఎంచుకుంటున్నారు. కాబట్టి, మీరు చనుబాలు ఇవ్వకపోతే మీ పాలు ఏమవుతాయి? మీకు చనుబాలు ఇవ్వకపోతే, పాల ఉత్పత్తి త్వరగా తగ్గిపోయి, చివరికి పాలు అసలు పడకుండ ఉండే పరిస్ధితి సంభవిస్తుంది. ప్రసవం అయిన, తొలి రోజుల్లో, పాలు కారడం సహజం. రొమ్ము గడ్డకట్టడ౦ కూడా సంభవించవచ్చు. కానీ చనుబాలు ఇవ్వకపోతే, పాలు పడడం క్రమంగా ఆగిపోతుంది. 6-7 రోజులలో, పాల ఉత్పత్తి జీరోకి చేరుతుంది! కాబట్టి, మీరు చనుబాలు ఇవ్వకపోతే ఆ పాలు ఏమవుతాయంటే పాల ఉత్పత్తి నిలిచిపోతుంది. పాల ఉత్పత్తి మొత్తం బిడ్డ అవసరం మీద ఆధారపడి ఉంటుంది. బిడ్డ పాలు ఎక్కువగా తాగితే, పాలు బాగా పడతాయి. బిడ్డ పాలు తాగకపోతే, పాలు పడడం ఆగిపోతాయి.

చనుబాలు ఇవ్వడం ఇష్టంలేని తల్లులు వాటికి సహాయంగా గట్టిగా పట్టి ఉండే బ్రా లను వాడితే రొమ్ము వాపు తగ్గుతుంది. చనుబాలు ఇవ్వకపోతే, శరీరం ఆ పాలను తిరిగి పీల్చుకుంటుంది, ఉత్పత్తిని నిలిపి వేస్తుంది. కాబట్టి ఆ పాలు ఎక్కడికీ పోవు. అవి కేవలం ఆవిరైపోతాయి. కొంతమంది స్త్రీలలో దీనివల్ల రొమ్ములో నొప్పి, నాళాలు అడ్డుపడడం, స్తనాలు గట్టిపడడం వంటివి జరుగుతాయి. మీ నిర్ణయం గురించి డాక్టరుతో మాట్లాడాలి. మీరు చనుబాలు ఇవ్వడం ఇష్టం లేకపోతే దాన్ని నివారించడానికి లేదా సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండడానికి వైద్యుని సహాయం తీసుకోవచ్చు. మరి చనుబాలు ఇవ్వకపోతే జరిగే పరిస్థితి గురించి అలాగే ఈ మధ్య బిడ్డలకు తల్లులు చనుబాలు ఇవ్వకపోవడం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.