పదో తరగతి కుర్రాడు 20 మంది సాఫ్ట్వేర్ అమ్మాయిలను ఏం చేశాడో తెలిస్తే ఖంగుతింటారు

671

పిట్టా కొంచెం కూత ఘనం అంటారు.అంటే చిన్న వయసులో ఉండి కానీ చిన్న స్థానంలో ఉండి కానీ ఏదైనా పెద్దది సాధించినప్పుడు లేదా పెద్ద పని చేసినప్పుడు ఈ సామెతను వాడతారు.అయితే ఇప్పుడు ఒక కుర్రాడి విషయంలో కూడా ఈ సామెతనే వాడాలేమో.అయితే అతను ఏమి ఘనకార్యం చెయ్యలేదులెండి.నీచపు పని చేశాడు.ప‌దో త‌ర‌గ‌తి కూడా చ‌ద‌వ‌ని ఆ కుర్రాడు 20 మందికి పైగా సాఫ్ట్‌వేర్ కంపెనీల‌లో జాబ్ చేస్తున్న అమ్మాయిల‌ను మోసం చేశాడు.సాఫ్ట్ వేర్స్ అంటే బాగా చదువుకున్న వాళ్ళు.మరి అంత చదువు చదివి కేవలం పదో తరగతి చదివిన వాడి చేతుల్లో ఎలా మోసపోయారనేగా మీ సందేహం.మరి ఆ కుర్రాడి గురించి అతను మోసం చేసిన విధానం గురించి పూర్తీగా తెలుసుకుందామా.

Image result for lovers

నెల్లూరుకి చెందిన జీవన్ కుమార్ 8వ త‌ర‌గ‌తి వ‌ర‌కు చ‌దువుకుని మానేశాడు.అతని వయసు 20 ఏళ్ళు కూడా దాటలేదు ఇప్పుడు.చెడు అలవాట్లకు బానిసైన జీవన్ కుమార్ ఎలాగైనా డబ్బు సంపాదించాలనుకున్నాడు.అందుకోసం పెద్ద స్కెచ్ వేశాడు.సాఫ్ట్‌వేర్ కంపెనీల‌లో జాబ్ చేస్తున్న అమ్మాయిల‌ను టార్గెట్ చేసుకుని వారిని మోసం చేయ‌డం మొద‌లు పెట్టాడు.సికింద్రాబాద్ కి చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఈ ఏడాది ఫిబ్రవరిలో జీవన్ షాదీ.కామ్ అనే మ్యాట్రిమోనీ వెబ్ సైట్ లో తన వివరాలను పొందుపరిచింది. అందులో రిషి కుమార్ నేలపాటి అనే వ్యక్తి ఆమెకు ఇంట్రస్ట్ గా అనిపించడంతో అతనితో పరిచయం పెంచుకుంది. కొద్దిరోజులు ఫోన్లో మాట్లాడుకున్న అనంతరం ఇరువురు వారి ఫోటోలను ఒకరికి మరొకరు పంపించుకున్నారు.రోజూ ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండేవారు. సదరు వ్యక్తి తాను బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో పనిచేస్తున్నానని యువతిని నమ్మించాడు.ఒకరోజు యువతికి ఫోన్ చేసి తన తల్లి ఆరోగ్యం బాగాలేదని డబ్బులు అవసరమని చెప్పాడు. ఆమె వెంటనే తన క్రెడిట్ కార్డ్ డీటైల్స్, ఓటీపీ నెంబర్ అన్నీ అతనికి పంపింది.

Image result for lovers

ఆమె వద్ద నుంచి దాదాపు రూ.2.4లక్షల వరకు కాజేశాడు. డబ్బు తీసుకున్న తర్వాత కలుద్దామని యువతి అడిగిన నాటి నుంచి ఆమెను బ్లాక్ చేసేసాడు. ఫోన్ చేయడం,. మెసేజ్ లకు రిప్లై ఇవ్వడం మానేశాడు. దీంతో మోసపోయానని గుర్తించిన యువతి పోలీసులను ఆశ్రయించింది. పోలిస్ లను ఆశ్రయించిన తర్వాత తెలిసింది ఆమెకు దిమ్మతిరిగి పోయే నిజం.పోలీసుల విచారణలో ఏం తేలిందంటే…ఇన్ని రోజులు ఈ అమ్మాయితో మాట్లాడింది రిషి కుమార్ కాదని ఈ జీవన్ కుమార్ అనే వ్యక్తి అని తెలిసి షాక్ అయ్యింది.నిత్యం కంప్యూటర్ ముందు కూర్చొని సాఫ్ట్ వేర్ అమ్మాయిలకు వల వేసి వారి నుంచి డబ్బు గుంజుతాడని పోలీసుల దర్యాప్తులో తేలింది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఇప్పటి వరకు 20మంది అమ్మాయలను ఇలా మోసం చేశాడు. బెంగళూరుకి చెందిన ఓ అమ్మాయి ద‌గ్గ‌రు ఇలానే దాదాపు 10 ల‌క్ష‌లు వ‌సూలు చేసిన‌ట్లు తెలుస్తుంది.ఇతని భాదితులందరు కంప్లైంట్ ఇవ్వడంతో జీవన్ కుమార్ ఇప్పుడు జైలు పాలు అయ్యాడు.చూశారుగా ఈ జీవన్ కుమార్ ఎలా మోసం చేశాడో.మరి ఈ అందుకే ఆన్ లైన్ లో పరిచయం అయినా వారితో కాస్త జాగ్రత్త.లేకుంటే మీరు కూడా ఇలాగే మోసపోతారు.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.20 మంది అమ్మాయిలను మోసం చేసిన ఈ ఘనుడి గురించి అలాగే ఇలా ఆన్ లైన్ లో పరిచయం చేసుకుని మోసం చేస్తున్న వారి గురించి వారి చేతిలో మోస పోతున్న వారి గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.