ప్రణయ్ తన డైరీలో పుట్టబోయే బిడ్డ గురించి ఏం రాశాడో చూస్తే కన్నీళ్లు ఆగవు

520

పరువు హత్యలు తెలుగు రాష్ట్రాల్లో కొత్తేమీ కాదు. ప్రతీ హత్యా ఓ సంచలనమే. పరువు, ప్రతిష్ట అన్న మాయలో పడి కన్నబిడ్డల్నే చిదిమేస్తున్న తండ్రులున్నారు. అల్లుళ్లను హతమారుస్తున్న మామలున్నారు. అంతేకాదు… పేగుతెంచుకుపుట్టిన బిడ్డ అన్న ఆలోచన లేకుండా తల్లులే బిడ్డల గొంతు నులిమి చంపేస్తున్నారు. అగ్రవర్ణానికి చెందిన అమ్మాయి అమృత తక్కువ కులానికి చెందిన అబ్బాయి ప్రణయ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారని అమ్మాయి తండ్రి మారుతీరావు ప్రణయ్ ను చంపించిన సంగతి మన అందరికి తెలిసిందే.అయితే ఇప్పుడు ప్రణయ్ డైరీ ఒకటి బయటపడింది.అందులో ప్రణయ్ కొన్ని భావోద్వేగ మాటలు రాశాడు.మరీ ప్రణయ్ రాసిన ఆ భావోద్వేగ మాటల గురించి తెలుసుకుందామా.

Image result for pranay and amrutha

పెళ్లి చెయ్యడానికి నలుగురు ఫ్రెండ్స్ ఉంటె సరిపోతుంది.కానీ లాంగ్ లైఫ్ కలిసి ఉండాలంటే పెద్దల అవసరం చాలా ఉంది.అందుకే ఇది రాస్తున్నా.కూతురు ఎంతమందితో తిరిగినా కానీ కడుపు మాత్రం తెచ్చుకోకూడదు.కూతురు ఎలా తిరిగినా కానీ ప్రేమించిన వాడిని మాత్రం పెళ్లి చేసుకోకూడదు.ఇది ప్రస్తుతం చాలా మంది కాన్సెప్ట్.వీళ్లకు శీలం మానం ఎథిక్స్ లాంటి ఏవి అవసరం లేదు.వీళ్ళు ఇంతే.మందు సిగరెట్ అలవాటు ఉన్న వాళ్ళను ప్రేమిస్తే రిజెక్ట్ చెయ్యండి.చదువు లేని వాడు ప్రేమిస్తే వద్దని చెప్పండి.మీ అమ్మాయిని ప్రాణం కన్న ఎక్కువగా లవ్ చెయ్యకపోతే వద్దని చెప్పండి.అంతేకానీ మీ కులం కాదని డబ్బు లేదని మీరు చుసిన అబ్బాయి కాదని రిజెక్ట్ చెయ్యొద్దు.ప్రేమించి పెళ్లి చేసుకున్న పిల్లల తల్లిదండ్రులకు ఒక వినతి.

Image result for pranay and amrutha

డియర్ అమ్మాయి పేరెంట్స్ లవ్ మ్యారేజ్ లో ఉండే ఒకేఒక్క డౌన్ బ్యాక్ ఏమిటి అంటే ఇద్దరి మధ్య ఏదైనా మిస్ అండర్ స్టాన్డింగ్ ఉంటె అగ్గికి ఆజ్యం పోసేవాళ్ళు ఉంటారు కానీ కలిపే వాళ్ళు ఉండరు.మీ వర్షన్ కే వద్దాం.మిమ్మల్ని ఎదిరించి పెళ్లి చేసుకోవడం తప్పే.ఆ విషయం మాకు తెలుసు.కానీ మేము ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్పా ఏ నేరం చెయ్యలేదు.కులం పేరు చెప్పి మతం పేరు చెప్పి వర్గం పేరు చెప్పి కొట్టుకోవచ్చు.కానీ ప్రేమించకూడదు అంటారు.ఎప్పుడు మారుతారు మీ పెద్దొళ్ళు.ప్రేమంటే మీకు ఇంత చిన్న చూపు ఎందుకు అంటే..వెదవలు ఉంటారు పరమ వెదవలు ఉంటారు.వారి బారిన పడి కూతురు బాధ పడకూడదు అని మీరు అనుకోవడం తప్పు కాదు.అందరిని అదే చూపుతో చూడవద్దు.ప్రేమ విషయంలో మీరు చూసే దృష్టిలోనే లోపం ఉంది. అందరిని ఒకే దృష్టితో చూడవద్దు.మీరు అనుకునే వెధవలలో మేము లేము.మేము ఎంతో బాధ్యతతో ఉంటాం.

Image result for pranay and amrutha

మీ అమ్మాయిని లైఫ్ మొత్తం హ్యాపీగా చూసుకోవాలని పెళ్లి చేసుకుంటాం.మాకు మీ ఆస్తి అంతస్తుతో పని లేదు.మాకు కావాల్సింది కేవలం మీ అమ్మాయి మాత్రమే.మేము ప్రేమించుకుని మాత్రమే పెళ్లి చేసుకున్నాం.మీరు చేయాలనుకునే మ్యారేజ్ ఏంటి అంటే..కట్నంతో డీల్ చేసుకుని అమ్మాయి పక్కన అబ్బాయి పడుకోవచ్చు అనే డీల్ కుదుర్చుకున్నారు.దీనిని పెళ్లి అంటారా లేక ఇంటర్నేషనల్ బ్రోతింగ్ అంటారా.ప్రేమ అనేది అంతులేనిది.అది మీకు ఎప్పుడు అర్థం అవుతుంది.మేము కడుపు చేసి పారిపోవట్లేదు.మేము ప్రాణం కన్నా ఎక్కువగా లవ్ చేస్తాం.కన్ను మూసేవరకు కళ్ళలో పెట్టుకుని చూసుకుంటాం.మీరు తెచ్చేవాడు మా కన్న మంచిగా చూసుకుంటాడని గ్యారెంటీ ఇవ్వగలరా.కానీ మేము గ్యారెంటీ ఇవ్వగలం.అమ్మ ప్రేమతో పోటీ పడి ప్రేమిస్తాం.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

నాన్న ఆత్మీయతకు సాటిగా చూసుకుంటాం.చివరగా ఒక్కమాట.ఏ రిలేషన్ కూడా వ్యారేంటి గ్యారెంటీతో రాదూ.అమ్మ మీద ఎంత ప్రేమ ఉంటుందో మా జీవితంలోకి వచ్చిన అమ్మాయి మీద కూడా అంతే ప్రేమ ఉంటుంది.వీలైతే ప్రేమను గౌరవించండి.లేకుంటే మా బతుకు మమ్మల్ని బతకనివ్వండి…ఇదేనండి ప్రణయ్ తన డైరీలో రాసిన మాటలు.వింటుంటే చాలా బాధగా ఉంది కదూ.మరీ ఈ విషయం గురించి మీరేమంటారు.ఈ పరువు హత్య గురించి అలాగే అలాగే ప్రణయ్ డైరీలో ప్రేమ గురించి రాసిన మాటలు అలాగే తల్లిదండ్రులందరికి కోరిన విన్నపం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.