భారత ఆర్మీ లో క్రికెటర్ ధోని ఏం చేస్తున్నాడో తెలిస్తే షాకవుతారు

76

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ధోనీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. తన ఆటతీరుతో అందరినీ మెప్పించి మెరుపులా భారత జట్టుకు నాయకుడిగా ఎదిగాడు. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలన్నట్టు.. జట్టు ప్రయోజనాల కోసం అన్ని స్థాయిల్లోనూ ఆటగాళ్లకు ఆదర్శంగా నిలిచాడు. ప్రపంచ కప్ కళను సాకారం చేశాడు అయినా ఎప్పుడూ ధోనీ కూల్ గానే ఉన్నాడు. మిస్టర్ కూల్ గా ప్రశంసలు అందుకున్నాడు. ఇలా ఎన్ని చెప్పినా ఎదో ఒకటి మిగిలిపోతుంది. ఇక అసలు విషయానికి వస్తే.. ఇటీవల ధోనీ తీసుకున్న ఓ సంచలన నిర్ణయం అందరికీ తెల్సిందే. తనకు రెండు నెలల పాటు సైన్యంలో అదీ.. కాశ్మీర్ లో పని చేయాలనుందని ఆర్మీ అధికారులను అభ్యర్థించాడు. అతని అభ్యర్థనను మన్నించిన ఆర్మీ అధికారులు అవసరమైన శిక్షణ ఇచ్చి కశ్మీర్ సరిహద్దుల్లో గార్డ్ పోస్టింగ్ ఇచ్చారు. ఇదంతా తెలిసిందే.

Image result for dhoni in army

ప్రస్తుతం కాశ్మీర్ లో పరిస్థితులు అల్లకల్లోలంగా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో సైన్యంలో తనకున్న అధికారిక గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదా వదులుకుని సాధారణ సైనికునిలా పహారా విధులు నిర్వర్తిస్తున్నాడు ధోనీ. విపత్కర పరిస్థితిలోనూ తన విధులను నిర్వర్తిస్తూ అధికారులతోనే కాకుండా తోటి సైనికులతోనూ ఔరా అనిపించుకుంటున్నాడు. ఇప్పటివరకు ధోని మనకు ఒక క్రికెటర్ గా విజయవంతమైన కెప్టెన్ గా మాత్రమే తెలుసు. కానీ ధోనిలో మనకు తెలియని కళలు చాలానే ఉన్నాయని అతడు ఆర్మీలో పని చేస్తుంటే తెలుస్తోంది. పారాచూట్‌ రెజిమెంట్‌ 106 పారా టిఎ బెటాలియన్‌ కు చెందిన ధోని 2015లో ఆగ్రాలో శిక్షణా కేంద్రంలో విమానంలో నుండి పారాచూట్‌ ద్వారా దూకేలా ఐదు విభాగాల్లో శిక్షణ పూర్తి చేశారు. ఇప్పుడు క్రికెట్ నుంచి రెస్ట్ దొరకడంతో ఆర్మీ విధుల్లో పాల్గొంటున్నాడు. కాశ్మీర్‌ సరిహద్దుల్లో ఉగ్రవాదుల కదలికలపై నిఘా పెట్టనున్నారు. పెట్రోలింగ్‌, గార్డు, 15 రోజుల పాటు పోస్ట్‌ డ్యూటీ నిర్వర్తించున్నట్లు భారత ఆర్మీ వెల్లడించింది. ఆగష్టు 15 వరకు 106 టెరిటోరియల్‌ ఆర్మీ బెటాలియన్‌(పారా)లో సైనికులతో కలిసి లెఫ్టినెంట్‌ కల్నల్‌ ధోని విధులు నిర్వహించనున్నారు.

ఈ క్రింద వీడియో చూడండి

ఒకవైపు ఆర్మీలో సైనికుడిగా విధులు నిర్వహిస్తూనే.. మరోవైపు ఖాళీ సమయంలో తన తోటి సైనికులను ఆటపాటలతో అలరిస్తున్నాడు. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబచ్చన్ కభీ కభీ సినిమాలోని ‘ మై పల్ దో పల్ కా షాయర్ హు’ నే పాటను పాడి తోటి సైనికులను అలరించాడు. ధోనీ స్వయంగా ఈ పాట పాడడంతో సైనికులు క్లాప్స్ తో ధోనీని ప్రశంసించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే ధోనీ తన షూ పాలిస్ చేసుకుంటున్న ఫొటోలు కూడా బయటకు వచ్చాయి. ఇక ఆర్మీ సిబ్బందితో సరదాగా వాలీబాల్ ఆడుతూ సరదాగా ఎంజాయ్ చేశాడు. భారతదేశ సైన్యంలో పనిచేస్తూ చాలా సింపుల్ గా ఉండడంతో నెటిజన్లు క్రీడాభిమానులు అతడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ధోనీ క్రికెట్ ఆటగాడిగానే కాకుండా ఆర్మీ ఆఫీసర్ గా దేశం కోసం పనిచేయడంతో పాటు ఇటు సింగర్ గాను – అటు వాలీబాల్ ప్లేయర్ గాను చాలా కళల్లో ప్రావీణ్యం ఉన్నట్టే కనిపిస్తున్నాడు. ఏది ఏమైనా కల్లోల కాశ్మీరంలో ధోనీ లాంటి వ్యక్తి తనకు తోచిన విధంగా చేస్తున్న దేశసేవ మన దేశ యువతలో కచ్చితంగా దేశం పట్ల బాధ్యతను మరింత పెంచుతుందనడంలో సందేహం లేదు.