ఈ పూలు ఎంత రొమాంటిక్ ఓ తెలిస్తే ఆశ్చర్యపోతారు

319

ప్ర‌కృతిలో మ‌న‌కు అంద‌మైన పూలు క‌నిపిస్తూనే ఉంటాయి. ప్రకృతి మనకు ఎన్నో అందమైన, సువాసనలతో కూడిన పుష్పాలను ఇచ్చింది. ఈ పువ్వుల్లో ఒక్కో పువ్వుకు ఒక్కో ప్రత్యేక గుణం ఉంటుంది. మానవుని జీవితంలో సగం దాంపత్యానికే కేటాయించబడుతుంది. ఈ దాంపత్య జీవితం సుఖమయంగా, సాఫీగా సాగేందుకు కొన్ని రకాల, రంగుల పుష్పాలు ఎంతగానో దోహదపడతాయి.అందుకే మొద‌టిరాత్రికి కూడా ప‌లు పూల‌తో లింకు పెడ‌తారు, ఇక పూజ‌ల‌కు ప‌డ‌క‌కు ఇలా అనేక ర‌కాల పూల‌ను వ‌ర్గీక‌రించారు.

Image result for beautiful flowers

పింక్ పూలతో శృంగార శక్తి డబుల్ అవుతుంది అని అంటారు మ‌రి ఇది ఏమిటి దీని వెనుక ఉన్న లింక్ ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. పింక్ కలర్ పూలకు పడకగదిలో చోటిస్తే దంపతుల్లో శృంగారం రెట్టింపవుతుందట. ఊదా రంగు పూలకు హృదయాలను స్పందింపజేసే శక్తి, రొమాంటిక్ ఆలోచనలు రేపే లక్షణం ఉంది. కనుక బెడ్రూంలో ఈ పూలకు స్థానం కల్పిస్తే సుఖసాంసారం సొంతం అవుతుంది అని చెబుతున్నారు.ఆహ్లాదమైన సాయంత్రపు వేళల్లో రోజా ఎంతో ఆనందం క‌లిగిస్తుంది.. రోజా పూల గురించి వేరే చెప్పక్కర్లేదు. అయితా సాయంత్రపు వేళల్లో ఆహ్లాదంగా, ఆనందంగా గడపేందుకు ఎర్రెర్రని రోజాపూలు ఎంతగానో దోహదపడతాయి. ఈ పూలకు ఇంట్లో హాలులో స్థానాన్ని కల్పిస్తే మీ ఇంటికి వచ్చేవారికీ, మీకూ ఎంతో ఆహ్లాదాన్ని కల్గిస్తాయి.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అనారోగ్యాన్ని తరిమేసే పసుపు, నారింజ పూలు: అనారోగ్యంగ ఉన్నవారిలో సత్తువ, శక్తిని రేకెత్తించడానికి పసుపు, నారింజ రంగు పూలు ఎంతగానో సహాయపడతాయి… ముఖ్యంగా అనారోగ్యంతో సతమతమవుతున్నవారిని పరామర్శించేందుకు వెళ్లినప్పుడు ఈ రంగుపూలతో కూడిన చిన్న బొకేను ఇస్తే వారికి స్వాంతన చేకూర్చినట్లవుతుంది.. పుట్టినరోజు వేడుకలకు అనేక పువ్వుల కలబోత పుట్టినరోజు, పెళ్లిరోజు వేడుకలకు మీకు అత్యంత ఇష్టమైన పలు రకాల పువ్వులను కలిపి అందిస్తే సంతోషం రెట్టింపవుతుంది. డబ్బు, ఇతర బహుమతులతో రానటువంటి సంతోషం పువ్వులతో వస్తుంది కనుక ఆయా సందర్భాల్లో పూలను ఉపయోగిస్తే జీవితం ఆనందమయం అవుతుంది.అందుకే ఇటువంటి ర‌కాల పూల‌ను ఉప‌యోగించి మీ పార్ట‌న‌ర్ ని ఆనందింప‌చేయ‌డంతో పాటు మీరు కూడా సంతోషంగా ఉండంది లైఫ్ ని ఆనందంగా లీడ్ చేసుకోండి. మ‌రి దీనిపై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.