పదహారేళ్లప్పుడు నన్ను రేప్ చేశారు.. ఆ నొప్పిని 32 ఏళ్లుగా భరిస్తూనే ఉన్నాను …

456

భారత సంతతి మోడల్, అమెరికాలో టెలివిజన్ ప్రయోక్త అయిన పద్మలక్ష్మి సంచలన విషయాన్ని వెల్లడించారు. పదహారేళ్ల వయసులోనే తనపై అత్యాచారం జరిగిందని చెప్పారు.ఇంతకాలం ఆ విషయాన్ని ఎందుకు దాచిపెట్టి ఉంచాల్సిందో కూడా ఈ 48 ఏళ్ల మోడల్ వివరించారు.మరి ఆమె చెప్పిన విషయాల గురించి తెలుసుకుందామా.అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ సుప్రీంకోర్టుకు నామినేట్ చేసిన జడ్జి బ్రెట్ కేవెనాపై ఇద్దరు మహిళలు అత్యాచార ఆరోపణలు చేయడం సంచలనంగా మారిన నేపథ్యంలోనే పద్మలక్ష్మి వ్యాసం ప్రచురితమైంది.కాగా 1980ల్లో జరిగినట్లుగా చెబుతున్న ఈ ఆరోపణలను జడ్జి కేవెనా తోసిపుచ్చుతున్నారు.అయితే అసలేం జరిగిందో ఆమె ఒక వ్యాసం రూపంలో చెప్పింది.ఆమె రాసిన వ్యాసంలో ఏముందంటే.. ‘అప్పుడు నేను స్కూల్ ముగిశాక లాస్ ఏంజెలెస్‌లోని ఒక మాల్‌లో పనిచేసేదాన్ని.

పద్మలక్ష్మి

అక్కడే పరిచయమైన కుర్రాడితో డేటింగ్ మొదలైంది. అతను కాలేజిలో చదువుకుంటూనే ఓ మెన్స్‌వేర్ దుకాణంలో పనిచేసేవాడు. అతడికి 23.. నాకు 16.అలా పరిచయం కొనసాగుతున్న సమయంలోనే కొత్త సంవత్సరం వేడుకల రోజున ఇద్దరం కలిసి పార్టీకి వెళ్లాం. అక్కడి నుంచి అతని అపార్ట్‌మెంట్‌కి వెళ్లాను.అలసిపోవడంతో మాట్లాడుతూ మాట్లాడుతూ అలా నిద్రపోయాను. అంతలోనే రెండు కాళ్ల మధ్యా కత్తితో కోస్తున్నంతగా నొప్పి, ఆ నొప్పికి మెలకువ వచ్చేసింది, కళ్లు తెరిచి చూసేసరికి అతడు నాపై ఉన్నాడు.’ఏం చేస్తున్నావని అడిగాను.’కొద్దిసేపే ఈ నొప్పి ఉంటుంది’ అన్నాడు.’ప్లీజ్ ఆ పని మాత్రం చేయొద్దు’ అంటూ గట్టిగా అరిచాను.అయినా వినకపోవడంతో భయంతో ఏడ్చాను.నిద్రపోయుంటే ఇంత ఉండేది కాదు కదా అంటూ నాపైనుంచి లేచాడు.ఆ తరువాత నన్ను ఇంటి దగ్గర దించేశాడు” అని పద్మలక్ష్మి తన వ్యాసంలో ఆ నాటి ఘటనను రాసుకొచ్చారు.

పద్మలక్ష్మి

బాయ్‌ఫ్రెండ్ అత్యాచారం చేశాడని తన తల్లికి కానీ, స్నేహితులకు కానీ చెప్పలేదని ఆమె తెలిపారు.ఇలాంటి పాడు పనులేంటి.. అసలు నీకంటే పెద్దోడైన కుర్రాడితో నీకు స్నేహమేంటి?’ అంటూ పెద్దోళ్లు ఎక్కడ ప్రశ్నిస్తారో అని నాకు నేనే ఊహించుకునేదాన్నని పద్మ తన వ్యాసంలో రాశారు.నేను దీన్ని అత్యాచారమో, సెక్సో చెప్పలేకపోయేదాన్ని.. కానీ, నా కన్యత్వం కోల్పోవడం పెద్ద విషయంగా భావించేదాన్ని.ఈ ఘటన తరువాత నా జీవితంలోకి మరికొందరు బాయ్‌ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్లకి నేను కన్యననే చెప్పేదాన్ని కానీ, అత్యాచారం సంగతి చెప్పలేదు.నిజానికి నాపై రేప్ జరగడానికి ముందే కొన్ని చేదు అనుభవాలున్నాయి. ఏడేళ్ల వయసులోనే నా సవతి తండ్రి స్నేహితుడొకాయన లైంగికంగా వేధించాడు. ఆ సంగతి ఇంట్లో చెబితే నన్ను కొన్నాళ్ల పాటు భారత్‌లోని తాతగారింటికి పంపించేశారు.లైంగిక దోపిడీ గురించి చెబితే మనల్నే బయటకు పంపిస్తారని ఆ ఘటనతో నాకు అర్థమైందని ఆమె పేర్కొన్నారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఇన్నాళ్ల తరువాత నేనీ విషయం బయటపెట్టడం వల్ల నాకేమీ రాదు అని స్పష్టం చేసిన పద్మ.. వెంటనే బయటపెట్టకుండా ఏళ్ల తరువాత చేసే అత్యాచార ఆరోపణల్లో నిజాలు తక్కువని అన్న ట్రంప్‌ని ఆమె తప్పు పట్టారు.లైంగిక దాడులపై నిజాలు బయటపెట్టడానికి కాలపరిమితి విధిస్తే అందరం చాలా కోల్పోవాల్సి వస్తుందని ఆమె అన్నారు.మరోవైపు పద్మ అభిప్రాయాలకు సోషల్ మీడియా వేదికగా ఎంతోమంది మద్దతు లభిస్తోంది.ఇలా ఆమెకు ఎదురైనా అనుభవాలను వ్యాసం రూపంలో చెప్పుకొచ్చింది పద్మలక్ష్మి.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.పద్మలక్ష్మి గురించి ఆమె ఎదుర్కొన్న పరిస్థితుల గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో చెప్పండి.