మందు అలవాటు లేకున్నా తాగుతూనే ఉన్నా.. కూతుర్ని మాత్రమే చంపాలనుకున్నా’పోలీసుల దగ్గర మనోహరాచారి చెప్పిన విషయాలు వింటే షాక్..

441

హైదరాబాద్ ఎర్రగడ్డలో నవదంపతుల మీద అమ్మాయి తండ్రి కత్తితో పట్టపగలే దాడికి తెగబడిన ఘటన సంచలనం సృష్టించింది. తండ్రి దాడిలో కూతురు మాధవి తీవ్రంగా గాయపడగా.. ఆమె భర్త సందీప్ స్వల్ప గాయాలతో తప్పించుకున్నాడు. ప్రస్తుతం ఆమెకు సోమాజిగూడ యశోదా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆమె ఎడమ చేయి తెగిపోవడంతోపాటు.. చెవి మీదుగా తల వెనుక భాగంలో కత్తి వేటు పడింది. దీంతో మెదడుకు వెళ్లే నరాలు తెగిపోయాయి. 8 నుంచి 10 గంటల పాటు సర్జరీ చేసిన డాక్టర్లు.. ఆమె పరిస్థితి ఆందోళనకరంగానే ఉందన్నారు.అయితే మనోహరాచారి పోలీసుల దగ్గర లొంగిపోయాడు. అతను పోలీసుల దగ్గర కొన్ని సంచలన విషయాలు చెప్పాడు.మరి మనోహరాచారి ఏం చెప్పాడో చూద్దామా.

సందీప్, మాధవిలపై దాడి, యువతి పరిస్థితి విషమం

ఎర్రగడ్డలో నవదంపతులు మీద జరిగిన దాడి ట్విన్ సిటీలో కలకలం స్పృష్టించింది.ప్రేమ పెళ్లి చేసుకున్నందుకు కూతురు అల్లుడి మీద అతికిరాతకంగా దాడి చేశాడు అమ్మాయి తండ్రి మనోహరాచారి.ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.దాడి తర్వాత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయిన మనోహరాచారి తన గోడును వెళ్లబోసుకున్నాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న తన కుమార్తె ఎంత నచ్చజెప్పినా వినకుండా వేరే కులం వ్యక్తిని వివాహం చేసుకోవడంతో, పట్టలేని ఆవేశంతో దాడి చేశానన్నాడు. నా బిడ్డను మాత్రమే చంపాలని అనుకున్నాను. సందీప్‌ను చంపాలనుకోలేద’ని పోలీసుల విచారణలో వెల్లడించాడు.కానీ కూతురిని చంపుతుంటే సందీప్ అడ్డు వచ్చాడు.అందుకే అతని మీద కూడా దాడి చేశాను.కానీ చచ్చిపోయేంతలా దాడి చెయ్యలేదు.అతనికి చిన్న గాయాలు అయ్యేట్టు దాడి చేశాను.తన కూతురిని మాత్రం చంపాలని ఆమె మీద ఎక్కువ దాడి చేశానని మనోహరాచారి చెప్పాడు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

మాధవికి రెండేళ్ల వయసు ఉన్నప్పుడు పొట్టకూటి కోసం హైదరాబాద్ వచ్చానని చెప్పి భోరుమన్నాడు. ఓ నగల దుకాణంలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నట్టు తెలిపాడు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు.. ఇంట్లో నుంచి వెళ్లిపోయిన తర్వాత తీవ్ర మానసిక వేదను గురయ్యానని చెప్పాడు. మందు తాగే అలవాటు లేకున్నా కూతురు తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్న నాటి నుంచి గత ఐదు రోజులుగా తాగుతూనే ఉన్నానని చెప్పాడు. తన కోపమంతా మాధవిపైనేనని చెప్పిన చారి సందీప్ మీద ఆవేశంలో దాడి చేశాను. అంతేగానీ అతణ్ని హతమార్చాలని భావించలేదని స్పష్టం చేశాడు.విన్నారుగా నవదంపతుల మీద దాడి చేసిన ఈ రాక్షస తండ్రి చెప్పిన విషయాల గురించి.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.నిన్న మారుతీరావు నేడు మనోహరాచారి.ఈ తండ్రులు ఎందుకిలా తయారవుతున్నారు. కన్న పిల్లల కంటే కులమే ఎక్కువ.కులం కోసం కన్న బిడ్డలను చంపుకుంటారా.కులం కోసం పిల్లలను చంపుతున్న తండ్రుల గురించి అలాగే మాధవి తండ్రి మనోహరాచారి చెప్పిన విషయాల గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో చెప్పండి.