నాకు ఇప్పటికి కూడా ఒక అనుమానం ఉంది: ప్రణయ్ తండ్రి బాలస్వామి

630

కూతురు ప్రేమ వివాహం చేసుకుందని అల్లుడిని అతి కిరాతకంగా చంపించిన మిర్యాలగూడ ఘటన రెండు తెలుగు రాష్టాల్లో సంచలనం స్పృష్టించిన సంగతి మన అందరికి తెలిసిందే.తక్కువ కులానికి చెందిన వ్యక్తిని ప్రేమ పెళ్లి చేసుకుందని అల్లుడంటే ఇష్టం లేని మారుతీరావు కిరాయి గుండా చేత చంపించాడు.సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య పూర్వాపరాలను నల్లగొండ ఎస్‌పి ఎం.వి.రంగనాథ్ మంగళవారం సాయంత్రం మీడియా సమావేశంలో వెల్లడించిన సంగతి తెలిసిందే.అయితే ఈ మీడియా సమావేశం తర్వాత ప్రణయ్ తండ్రి బాలస్వామి కొన్ని అనుమానాలను రేకెత్తించాడు.మరి ఆయన రేకెత్తించిన ఆ అనుమానాల గురించి పూర్తీగా తెలుసుకుందామా.

Image result for pranay and amrutha

ప్రణయ్ హత్య కేసు విషయమై ప్రణయ్ తండ్రి బాలస్వామి మీడియాతో మాట్లాడారు.ప్రణయ్‌ హత్య కేసులో పోలీసులపై నాకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. పోలీసులు మీడియా ముందు అన్ని విషయాలు చెప్పారు.హంత‌కులు ప‌ట్టుబ‌డిన‌ట్లుగా పోలీసులు ప్రెస్ మీట్ పెట్ట‌టం కేసుకు సంబంధించిన అన్ని వివ‌రాల్ని చెప్పేసిన‌ట్లుగా పోలీసులు క‌నిపించిన‌ప్ప‌టికీ కీల‌క‌మైన ఒక అంశాన్ని పోలీసులు ప్ర‌స్తావించ‌లేదంటున్నారు. ప్ర‌ణ‌య్ ను హ‌త్య చేసిన‌ట్లుగా చెబుతున్న బిహార్ కు చెందిన హంత‌కుడు శ‌ర్మ వేలిముద్ర‌లు.. ప్ర‌ణ‌య్ ను హ‌త్య చేసిన‌ప్పుడు వినియోగించిన క‌త్తి మీద ఉన్న వేలిముద్ర‌లు ఒకటేనా? అన్న విష‌యాన్ని ఎస్పీ ప్ర‌స్తావించ‌లేద‌ని ప్ర‌ణ‌య్ తండ్రి బాల‌స్వామి ప్ర‌శ్నిస్తున్నారు. వేలిముద్ర‌లు కానీ ఒక‌టి కాకుంటే కేసు వీడిపోతుంద‌ని ఆయ‌న చెబుతున్నారు.

వేలిముద్ర‌లు ధ్రువీక‌ర‌ణ కాకుంటే హంత‌కుడు త‌ప్పించుకునే వీలుంద‌ని అదే స‌మ‌యంలో హత్య‌కు కార‌ణ‌మైన వ్య‌క్తి డ‌బ్బున్న వ్య‌క్తి కావ‌టంతో కేసు నుంచి బ‌య‌ట‌ప‌డే అవ‌కాశం ఉంద‌న్నారు. హంత‌కుడు చేసిన ప‌నికి ఉరిశిక్ష ప‌డితే తాము సంతోషిస్తామ‌ని మారుతీరావు లాంటోళ్లు మ‌ళ్లీ బ‌య‌ట‌కు వ‌స్తే ఇలానే హ‌త్యలు చేసే అవ‌కాశం ఉంద‌న్న భ‌యాన్ని వ్య‌క్తం చేశారు.మారుతీరావుకు శ‌ర్మ‌ల‌కు ఉరిశిక్ష ప‌డేలా ప్ర‌జాసంఘాలు పార్టీలు పోలీసులు ప్ర‌య‌త్నం చెయ్యాలని ప్ర‌ణ‌య్ ను చంపినోళ్లు రేపు త‌మ‌ను చంప‌ర‌న్న గ్యారెంటీ ఏమిట‌ని? ప్ర‌శ్నించారు. ఇలాంటి హంత‌కులు బ‌య‌ట‌కు వ‌స్తే అమ్మాయి అమృత‌ను కిడ్నాప్ చేసి త‌మ నుంచి దూరం చేసే ప్ర‌మాదం ఉంద‌న్నారు. అందుకే నిందితుల‌పై త‌క్ష‌ణ‌మే పీడీ యాక్ట్ పెట్టాల‌ని డిమాండ్ చేశారు. నిజ‌మే బాల‌స్వామి సందేహంలో పాయింట్ ఉంది కదూ.ప్ర‌ణ‌య్ తండ్రి బాల‌స్వామి వేస్తున్న ప్ర‌శ్న ఇప్పుడు కొత్త సందేహాల‌కు తావిస్తోంది.పోలీసులు అతని సందేహం మీద ఎలాంటి వివరణ ఇవ్వలేదు.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.ప్రణయ్ హత్య ఘటన గురించి అలాగే పోలీసులు చెప్పిన విషయాల గురించి అలాగే ప్రణయ్ తండ్రి బాలస్వామి రేకెత్తించిన అనుమానం గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో చెప్పండి.