హైదరాబాద్ డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్ట్ లో బట్టబయలైన షాకింగ్ నిజం .. తాగకున్నా తాగినట్టు చూపించి జనాలను ఎలా మోసం చేస్తున్నారో చూడండి

448

మందు బాబుల అంతు చూడటానికి కనిపెట్టినది డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్.ఇది ఒక వ్యక్తి ఎంత తాగాడు అని చూపించి అతనికి శిక్ష వేసేలా చేస్తుంది.పోలీసులకు మందు బాబులను పట్టుకోడానికి ఇది ఎంతగానమో ఉపయోగపడుతుంది.అయితే ఇప్పుడు ఈ విషయమే వివాదంలో చిక్కుకుంది.తాగితే రీడింగ్ చూపిస్తుంది కానీ ఇప్పుడు తాగకపోయినా రీడింగ్ చూపించి కొత్త వివాదానికి తెర తీసింది.మరి ఆ విషయం గురించి పూర్తీగా తెలుసుకుందామా.

హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం పోలీసులు శనివారం రాత్రి చేపట్టిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు వివాదానికి దారితీశాయి. మద్యం సేవించి వాహనం నడిపినట్టు తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ మనవడిపై పోలీసులు కేసు నమోదు చేయడం, అతడి రక్త నమూనాల్లో మద్యం సేవించిన ఆనవాళ్లు లేవంటూ వైద్యులు నివేదిక ఇవ్వడంతో వివాదానికి దారితీసింది. బాధితుడు పోలీసులపై ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహరం మరింత మలుపు తిరిగింది. శనివారం రాత్రి సుల్తాన్‌ బజార్‌ ట్రాఫిక్‌ పోలీసులు కోఠి బిగ్‌బజార్ వద్ద డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహించారు.ఇదే సమయంలో డిప్యూటీ సీఎం మనవడు, శాలిబండకు చెందిన జహీరుద్దీన్‌ కారు నడుపుతూ వస్తున్నాడు. అతడి వాహనాన్ని నిలిపిన ట్రాఫిక్ పోలీసులు జహీరుద్దీన్‌కు బ్రీత్‌ అనలైజర్‌ పరీక్ష నిర్వహించారు. ఇందులో బీఏసీ 43 పాయింట్లుగా నమోదైనట్టు కేసు నమోదు చేశారు. అంతేకాదు తనకు మద్యం సేవించే అలవాటు లేదని జహీరుద్దీన్‌ చెప్పినా వినిపించుకోకుండా అతడి కారును స్వాధీనం చేసుకున్నారు.అనంతరం ఉస్మానియా ఆసుపత్రికి పంపి, పరీక్షలు నిర్వహించారు.అయితే రక్త నమూనాల్లో మద్యం సేవించిన ఆనవాళ్లు లేవని వైద్యులు నివేదికలో తేలింది. దీంతో ఈ నివేదికను తీసుకుని శనివారం అర్ధరాత్రి సుల్తాన్‌ బజార్‌ పోలీస్‌ స్టేషన్‌కు బాధితుడు వెళితే ఆదివారం రావాలని సూచించారు. ఆదివారం మరోసారి అక్కడికి వెళ్లిన జహీరుద్దీన్‌ పోలీసులు చెప్పిన సమాధానంతో అసహనం వ్యక్తం చేశాడు.

బీఏసీ ఆధారంగా కేసు నమోదు చేశామని, కౌన్సెలింగ్‌కు హాజరైతే వాహనం ఇస్తామని నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో శాంతి భద్రతల విభాగానికి ఫిర్యాదు చేశాడు. తన తప్పు లేకపోయినా కేసు నమోదు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు.బ్రీత్ ఎనలైజర్ పరీక్షల్లో మద్యం సేవించినట్టు నమోదు కాగా, ఉస్మానియా వైద్యుల నివేదిక అందుకు భిన్నంగా ఉండటంతో తప్పు ఎక్కడ జరిగిందోనని పోలీసులు జుట్టుపీక్కుంటున్నారు. బాధితుడు ఉప-ముఖ్యమంత్రి మనవడని తెలియడంతో పర్యవసానం ఎలాఉండబోతుందోనని పోలీసులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు బాధితుడు తనకు చిన్నతనం నుంచి మద్యం తాగే అలవాటు లేదని చెప్పినా వినిపించుకోలేదని అన్నాడు. బీఏసీ 43గా ఎలా నమోదైందో తనకు అర్థం కాలేదని, పరికరం సరిగ్గా పనిచేయడం లేదేమో సరిచూసుకోండి అని చెప్పినా ట్రాఫిక్‌ పోలీసులు వినలేదని తెలిపాడు. ఉస్మానియా వైద్యులే నేను మద్యం సేవించలేదని నివేదిక ఇచ్చినప్పుడు కౌన్సెలింగ్‌కు తానెందుకు వెళ్లాలని, పోలీసులు క్షమాపణలు చెప్పి నా కారును అప్పగించాలని కోరాడు.దీనిపై పోలీసులు ఇంతవరకు స్పందించలేదు.చూడాలి మరి చివరికి ఏమౌతుందో.