వాలెంటైన్స్ డే రోజున పార్కులో పెళ్లి ఘటనలో సంచలన ట్విస్ట్.. ఏంటో తెలిస్తే షాక్

309

వాలెంటైన్స్ డే సందర్భంగా గురువారం హైదరాబాద్‌లోని కండ్లకోయ ఆక్సిజన్ పార్కుకు వచ్చిన యువతి, యువకుడిని బెదిరించి బలవంతంగా పెళ్లి చేసిన యువకులు అడ్డంగా బుక్కయ్యారు. ఈ ఘటనలో శ్రీహరిచారి, ఆనంద్, అవినాష్, అశోక్, సురేష్ కుమార్, చంద్రశేఖర్ అనే ఆరుగురు యువకులను గుర్తించి పోలీసులు అరెస్టు చేశారు. ప్రేమికుల రోజున బహిరంగంగా తిరిగితే అక్కడికక్కడే పెళ్లి చేసేస్తామంటూ భజరంగ్‌దళ్ లాంటి హిందుత్వ సంస్థలు హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గురువారం ఆక్సిజన్‌ పార్కులో ఓ జంట కనిపించగా కొంతమంది వారిని బెదిరించి యువతి మెడలో యువకుడితో తాళి కట్టించారు. ఈ పెళ్లిని ఫోన్‌లో రికార్డు చేసిన సోషల్‌మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఈ వీడియోను చూసిన అమ్మాయి తండ్రి కాంతారెడ్డి జైపాల్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కూతురు సుష్మారెడ్డి సీఎంఆర్ కాలేజీలో బీటెక్ చదువుతోందని, ఎప్పటిలాగే గురువారం కూడా కాలేజీకి వెళ్తున్నానని చెప్పి ఉదయం 7.45 గంటలకు ఇంట్లో నుంచి బయటకు వచ్చిందని పోలీసులకు చెప్పారు. ఉదయం పది గంటలకు ఆమెకు ఫోన్ చేయగా లిఫ్ట్ చేయలేదని, దీంతో కంగారుపడి కాలేజీకి వెళ్లగా ఆమె కాలేజీకి రాలేదని సమాధానం వచ్చిందని తెలిపారు. ఆ తర్వాత తమ దూర బంధువైన రాకేష్‌తో కండ్లకోయ ఆక్సిజన్‌ పార్కులో సుష్మ పెళ్లి జరిగిన వీడియోను దగ్గరి బంధువు ఒకరు పంపారని ఆయన వెల్లడించారు.