అపార్ట్ మెంట్ లో యువతి స్నానం చేస్తుండగా.. వెంటిలేటర్ నుంచి తొంగి చూసి.. హైదరాబాద్‌లో అటెండర్ వక్రబుద్ధి

185

యువత చెడు మార్గంలో పయనిస్తోందనడానికి నిత్యం వెలుగుచూస్తున్న ఘటనలే నిదర్శనం. అభం శుభం తెలియని చిన్నారులపై లైంగిక వేధింపులు మొదలు యువతులపై అత్యాచారాల దాకా.. కొందరు యువకులు విచక్షణ కోల్పోతున్నారనే విషయం అర్థమవుతోంది. సమాజంలో ఉంటున్నామనే విషయం మరచిపోయి వికృత చేష్టలకు పాల్పడుతుండటం అనర్థాలకు దారితీస్తోంది. మంచి కంటే చెడు వైపు ఆకర్షితులవుతూ తమ జీవితాలు పాడు చేసుకోవడమే గాకుండా తల్లిదండ్రుల పరువు బజారున పడేస్తున్నారు. ఇరుగు పొరుగుతో ఎలా ఉండాలోననే ఇంగీత జ్ఞానం మరిచిపోయిన ఓ యువకుడు దారి తప్పాడు. పక్కింట్లో ఉండే యువతి స్నానం చేస్తుండగా వెంటిలేటర్ నుంచి తొంగి చూశాడు. సదరు యువతి ఫిర్యాదు మేరకు అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మలక్‌పేట పరిధిలోని మూసారంబాగ్ డివిజన్‌లోని ఓ అపార్టుమెంట్‌లో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా చర్చానీయాంశమైంది.

hyderabad person arrested for seeing from windows young girl doing bath

అపార్టుమెంటులోని మూడో అంతస్తులో ఓ కుటుంబం నివసిస్తోంది. బాలానగర్ ఏరియాలోని ఫతే నగర్ కు చెందిన 37 సంవత్సరాల శివకుమార్ పిళ్లై అనే యువకుడు అదే ఫ్లోర్‌లోని ఓ ఫ్లాట్‌లో ఉంటున్నాడు. అటెండర్‌గా పనిచేస్తున్న శివకుమార్ పిళ్లై ఈ నెల 26వ తేదీన పక్కింటి యువతి బాత్‌రూమ్‌లో స్నానం చేస్తుండగా వెంటిలేటర్ నుంచి తొంగి చూశాడు. ఆకస్మాత్తుగా ఆమె దృష్టి వెంటిలేటర్ వైపు మళ్లడంతో విషయం బయటపడింది. షాక్‌కు గురైన ఆ యువతి కేకలు వేయడంతో శివకుమార్ పరారయ్యాడు. అయితే కుటుంబ సభ్యులు వెంటనే బయటకు వచ్చి చూడగా ఆ వ్యక్తి అక్కడ లేడు. వెంటనే కుటుంబ సభ్యులు పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. వారు వచ్చి జరిగింది తెలుసుకుని కేసు ఫైల్ చేశారు.. అయితే ఆ అపార్ట్ మెంట్ లో సిసి టీవీలు ఉండటంతో నిందితుడిని పట్టుకోడానికి పోలీసులకు ఎక్కువ సమయం పట్టలేదు.

ఈ క్రింది వీడియో చూడండి

సీసీ టీవి ఫుటేజ్ పరిశీలించడంతో నిందితుడి లీలలు వెలుగుచూశాయి. స్టూల్ వేసుకుని బాత్‌రూమ్‌లోకి తొంగి చూసినట్లుగా విజువల్స్ రికార్డయ్యాయి. ఆ మేరకు అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఘటనపై స్పందించిన పోలీసులు.. ఆ వ్యక్తి తన సెల్‌ఫోన్లో వీడియో దృశ్యాలను డిలీట్‌ చేయడంతో సైబర్‌క్రైమ్‌ పోలీసులను సంప్రదించామని నివేదిక అందాల్సి ఉందని చెప్పారు. బాధితురాలి ఫిర్యాదుమేరకు స్పందించిన పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేశారు. మహిళ స్నానం చేయడాన్ని కిటికీల ద్వారా వీడియో తీశాడని, రెండేళ్లుగా స్నానం చేస్తుండటాన్ని కిటికీల ద్వారా తొంగిచూశానని తెలిపాడు.ఆ విషయాన్నీ విన్న పోలీసులు తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. దీంతో ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. చూశారుగా ఈ వ్యక్తి ఎంతటి పని చేశాడో. మరి ఈ వ్యక్తి చేసిన ఈ నిర్వాకం గురించి అలాగే ఇలా ఈ మధ్య ఎక్కువగా బయటపడుతున్న బాత్ రూమ్ వీడియో ఘటనల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.