హైదరాబాద్ మెట్రో రైలు రాంగ్ ట్రాక్‌లో నడిచిందా.. అసలేమైంది?

215

హైదరాబాద్ మెట్రో రైలుకు ఘోర ప్రమాదం తప్పింది. మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వెళ్లే మెట్రో ట్రాక్ మారింది. ఒక ట్రాక్‌లో వెళ్లాల్సిన మెట్రో రైలు మరో ట్రాక్‌లోకి వెళ్లింది. అయితే పొరపాటును గుర్తించిన అధికారులు మరో ట్రాక్‌లో ఎలాంటి రైళ్లు రాకుండా కంట్రోల్ చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఆ సమయంలో మెట్రో రైలులో 400 మంది ప్యాసింజర్లు ఉన్నారు. ప్రమాదంను గుర్తించిన అధికారులు మెట్రో రైలును లక్డీకపూల్‌కు రప్పించారు. అక్కడ ప్రయాణికులందరిని దించివేశారు. అనంతరం దాన్ని తిరిగి వెనక్కు పంపించారు. అయితే మెట్రో రైలు పూర్తిగా నాగోల్‌లోని కంట్రోల్ రూం నుంచి ఆటోమేషన్ వ్యవస్థ ద్వారా నడుస్తుంది. ఒక్కసారిగా ఆ రైలు రాంగ్ రూట్‌లోకి వెళ్లడంతో అప్పటి వరకు లోపలున్న ప్రయాణికులకు ఏమి జరుగుతోందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఆ తర్వాత రైలు వెనక్కు వెళుతున్న సమయంలో ట్రైన్ లోపల గందరగోళ పరిస్థితి నెలకొంది. మెట్రో రైలు రాంగ్ రూట్ వెళ్లడంతో కాసేపు మెట్రో సేవలను నిలిపివేశారు అధికారులు.

ఈ క్రింద వీడియోని చూడండి

సాంకేతిక కారణాలతో హైదరాబాద్ మెట్రో రైలు కొన్ని నెలల కితం నిలిచిపోయింది. అయితే ఇలా రాంగ్ రూట్‌లో అంటే ట్రాక్ మారి ప్రయాణించడం మాత్రం ఇదే తొలిసారి కావడం విశేషం. అసలు రైలు ట్రాక్ ఎలామారిందనే దానిపై అధికారులు విచారణ చేపట్టారు. పూర్తిస్థాయిలో విచారణ చేసి నివేదిక సమర్పించాలని అధికారులకు ఉన్నతాధికారులు ఆదేశించారు. అయితే ఇదంతా అవాస్తవం అని కొట్టిపడేశారు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. ”వాస్తవాలు తెలుసుకోకుండా ఇలాంటి పుకార్లు సృష్టించొద్దు. శనివారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో వీచిన పెనుగాలులకు అసెంబ్లీ స్టేషన్ సమీసంలో మెట్రోకు సంబంధించిన మెరుపు అరెస్టెడ్ రాడ్.. ట్రాక్‌పై పడిపోయింది. ముందు జాగ్రత్తగా ఓవర్‌హెడ్ ఎలక్ట్రికల్ పవర్‌ను నిలిపేసి, రాడ్‌ను తొలగించాం. రైలుకు విద్యుత్ సరఫరా లేకపోవడంతో బ్యాటరీతో నడిచింది’ అని ఆయన తెలిపారు.

Related image

రైలులో ఆస్తమాతో బాధపడుతున్న ఓ ప్రయాణికుడు ఫిర్యాదు చేయడం వల్లే ప్రయాణికులకు ట్రాక్‌పై నడిచేందుకు అనుమతించామని ఎన్వీఎస్ రెడ్డి వివరణ ఇచ్చారు. అసెంబ్లీ స్టేషన్‌కు కొన్ని మీటర్ల దూరంలో రైలును ఖాళీ చేయించి ప్లాట్‌ఫామ్‌కు తీసుకెళ్లాం. భద్రతాపరమైన చర్యల కారణంగానే మెట్రో సేవలకు అరగంట అంతరాయం కలిగింది అని ఆయన తెలిపారు. ఏదిఏమైనా సాంకేతిక కారణాలతో మెట్రో రైళ్లు తరచూ నిలిచిపోతుండటం ప్రయాణికుల్లో అసహనం తెప్పిస్తోంది. శుక్రవారం రాత్రి మియాపూర్ – ఎల్‌బీ నగర్ మార్గంలో సాంకేతిక కారణాలతో ఇరువైపులా రైళ్ల రాకపోకలు 20 నిమిషాల పాటు నిలిచిపోయాయి. నిర్వహణ పరంగా మరిన్ని చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. మరి మెట్రో ఇలా ట్రాక్ మారడం మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.