భార్య గదిలోకి పొరుగింటి వ్యక్తి..బయట భర్త కాపలా..కన్నీరు పెట్టించే ఓ మహిళ కధ

366

మందుకు బానిసైన ఓ మృగాడు మానవత్వానికే మచ్చ తెచ్చే ఓ దారుణానికి తెగబడ్డాడు.. డబ్బులు కోసం కక్కుర్తి పడి కట్టుకున్న భార్యను గదిలో బందించి ఇద్దరు వ్యక్తులతో అత్యాచారం చేయించాడు..హర్యానా లోని గుర్గావ్ లో జరిగిన దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది..బాదితురాలు చెప్పిన వివరాల ప్రకారం గుర్గావ్ కు చెందిన 31 ఏళ్ళ ఓ వ్యక్తి మద్యానికి బానిసయ్యాడు..తాగడానికి కావాల్సిన డబ్బులు కోసం ఎంతటి నీచానికైనా దిగజారే పరిస్థితికి చేరుకున్నాడు..ఆ మందుబాబు భార్యపై పక్కింటి వ్యక్తితో పాటు బందువొకరు కన్నేసారు..అతడి బలహీనతను ఆసరాగా చేసుకొని దారుణానికి ఒడిగట్టారు..అతడి భార్యతో సెక్స్ చేయడానికి అంగీకరిస్తే తాగడానికి కావాల్సినంత డబ్బులు ఇస్తామని ఆశ చూపారు..ఆ మాటలకు లొంగిపోయిన తాగుబోతు భర్త డబ్బుల కోసం కట్టుకున్న భార్య శీలాన్ని పణంగా పెట్టాడు..తన భార్యను గదిలో పెట్టి తాళం వేసిన ప్రబుద్దుడు పక్కింటి వ్యక్తిని మరో వ్యక్తిని గదిలోకి పంపించాడు..

వారు ఆమెను బలాత్కారం చేసారు..సొంత ఇంటిలోనే తనపై దారుణం జరుగుతుంటే ఆ ఇల్లాలు ఎదురించడానికి ప్రయత్నించగా ఆ నీచపు భర్త ఆమె చేతులు వెనక్కి విరిచి పట్టుకొని వాళ్ళతో బలవంతంగా అత్యాచారం చేయించాడు..తరువాత తనపై ఈ అఘాయిత్యం జరిగినట్టు బాదితురాలు పోలీసులకు చెప్పింది..తనపై బలాత్కారం చేయడానికి ప్రయత్నించాడని తన భర్త తనను చంపేస్తానని బెదిరించి తనను గదిలో నిర్బందించి అతడిని లోని పంపించాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది..ఘటన జరిగిన వెంటనే తన ముగ్గురు పిల్లలను తీసుకొని పుట్టింటికి వచ్చేసినట్టు బాదిత మహిళ తెలిపింది..భర్త వద్దకు వెళ్ళడానికి వణికిపోతున్న మహిళను ఆమె తల్లి గుచ్చి గుచ్చి ప్రశ్నించగా తల్లికి అసలు విషయం చెప్పుకొని బోరుమంది..ఆ దారుణం గురించి తెలిసిన వెంటనే ఆ తల్లి తన బిడ్డను వెంటబెట్టుకొని పోలీస్ స్టేషన్ కు వెళ్ళి ఫిర్యాదు చేసారు..సభ్య సమాజం తలిదించుక్నే విధంగా ప్రవర్తించిన తన అల్లుడితో పాటు మరో ఇద్దరు నిందితులపై కఠిన చర్యలు తీసుకొవాలని కోరారు..దేశ రాజధాని డిల్లీకి కూతవేటు దూరంలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది..చూసారు కదా ఆ మహిళ పట్ల దారుణంగా ప్రవర్తించిన ఆ నీచులకు ఎలాంటి శిక్ష విధించాలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో చెప్పండి..